న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విండీస్‌తో వన్డేల్లొ ధోనీ ప్రదర్శన చాలా కీలకం: గంగూలీ

Ongoing series against West Indies will be crucial for MS Dhoni: Sourav Ganguly

గువాహటి: వచ్చే ఏడాది ప్రపంచకప్‌ దృష్ట్యా విండీస్‌తో జరగుతున్న వన్డే సిరీస్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి కీలకమని టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్ గంగూలీ అంటున్నాడు. కొంతకాలంగా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న ధోని ఈ సిరీస్‌లో రాణించాలని అతను కోరుకుంటున్నాడు. విండీస్‌తో ఐదు వన్డేల సిరీస్‌ ఆడుతున్న టీమిండియా... వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌ లోపు ఇంకా 18 వన్డేలు మాత్రమే ఆడనుంది. కొన్ని నెలలుగా వన్డేల్లో ధోనీ పెద్దగా స్కోరు చేయలేకపోతున్నాడు.

<strong>నిశ్చితార్థ వేడుకల్లో టీమిండియా క్రికెటర్</strong>నిశ్చితార్థ వేడుకల్లో టీమిండియా క్రికెటర్

విండీస్‌తో సిరీస్‌ అతనికి చాలా కీలకం

విండీస్‌తో సిరీస్‌ అతనికి చాలా కీలకం

ఇప్పటికే యువ వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌కు వన్డే జట్టులో చోటిచ్చిన సెలక్షన్‌ కమిటీ ప్రపంచకప్‌ జట్టు ఎంపిక విషయంలో ఎలా వ్యవహరిస్తుందో చూడాలని గంగూలీ చెప్పాడు. ‘ప్రపంచకప్‌లో ధోని కచ్చితంగా రాణించగలడు. ఐతే విండీస్‌తో సిరీస్‌ అతనికి చాలా కీలకం. ప్రపంచకప్‌నకు ముందు ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి. అంతిమంగా పరుగులు చేయడమే ముఖ్యం. అందుకే పంత్‌కు అవకాశం ఇచ్చారు' అని గంగూలీ తెలిపాడు.

ఎప్పుడూ చేయనంతగా తక్కువ స్కోరును

ఎప్పుడూ చేయనంతగా తక్కువ స్కోరును

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 15 వన్డేల్లో పది సార్లు బ్యాటింగ్‌ చేసే అవకాశం వచ్చిన ధోని 28.12 సగటు మాత్రమే నమోదు చేశాడు. ఇంతకుముందు జరిగిన ఆసియా కప్ టోర్నమెంట్‌లోనూ ధోనీ నాలుగు సార్లు బ్యాటింగ్ చేసి కేవలం 77 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అదీ 19.25 సగటుతో స్ట్రైక్ రేట్ 62.09తో మాత్రమే. అతని కెరీర్ లోనే ఎప్పుడూ చేయనంతగా తక్కువ స్కోరును ఇంగ్లాండ్ పర్యటనలో నమోదు చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ.

ధోనీ రికార్డు చాలా గొప్పదని గంగూలీ

ధోనీ రికార్డు చాలా గొప్పదని గంగూలీ

కెరీర్ మొత్తంగా చూస్తే ధోనీ రికార్డు చాలా గొప్పదని గంగూలీ కొనియాడాడు. రాబోయే వరల్డ్ కప్‌లో మాత్రం ప్రస్తుతం ఎలా ఆడుతున్నారనే అంశంపైనే సెలక్టర్ల వ్యవహరించొచ్చని సూచించాడు. బాగా ప్రదర్శన చేయడమంటే పరుగులు చేయాల్సి ఉంటుందని సౌరవ్ వివరించారు. గతంలోనూ ఆసియా కప్‌కు ముందు ధోనీ ప్రదర్శనపైనే తర్వాతి వన్డే మ్యాచ్‌లకు జట్టు ఎంపిక ఉంటుందని గంగూలీ తెలిపాడు.

ఇరు జట్ల మధ్య రసవత్తరమైన పోరు

ఇరు జట్ల మధ్య రసవత్తరమైన పోరు

వన్డే ఫార్మాట్‌లో టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. అలాగే విండీస్ కూడా అదే స్థాయి పోటీని ఇచ్చే విధంగా కనిపిస్తోంది. ప్రస్తుత టోర్నీ ఇరు జట్ల మధ్య మంచి రసవత్తరమైన పోరుకు ఆస్కారమిచ్చేలా కనిపిస్తోందన్నట్లు గంగూలీ చెప్పుకొచ్చారు.

Story first published: Monday, October 22, 2018, 13:31 [IST]
Other articles published on Oct 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X