న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వారిద్దరి వల్లే ఓడాం: విండిస్ కెప్టెన్ జాసన్ హోల్డర్

Not too disheartened by the performance – Jason Holder

హైదరాబాద్: ఆ ఇద్దరు బ్యాట్స్‌మెన్ వల్లే తొలి వన్డేలో ఓటమి పాలయ్యామని వెస్టిండిస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ వ్యాఖ్యానించాడు. గువహటి వేదికగా ఆదివారం భారత్‌తో జరిగిన తొలి వన్డేలో పర్యాటక జట్టు 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. బ్యాటింగ్‌లో విండీస్‌ గత మ్యాచ్‌లకంటే మెరుగ్గానే రాణించినప్పటికీ, బౌలింగ్‌లో మాత్రం తేలిపోయింది.

<strong>విశాఖలో టీమిండియా: మరో రికార్డుపై కన్నేసిన కోహ్లీ, విశేషాలివే</strong>విశాఖలో టీమిండియా: మరో రికార్డుపై కన్నేసిన కోహ్లీ, విశేషాలివే

మ్యాచ్ అనంతరం వెస్టింండిస్ జట్టు కెప్టెన్‌ జేసన్‌ హోల్డర్‌ మీడియాతో మాట్లాడుతూ "భారత్ లాంటి అగ్రశ్రేణి జట్లతో ఆడుతున్నప్పుడు స్కోర్‌ గురించి అంచనా వేయడం కష్టం. 320 పరుగులు అంటే సాధారణంగా భారీ స్కోర్‌ కిందకే వస్తుంది. అలాగని ప్రత్యర్థి జట్టు దాన్ని సాధించలేదని తక్కువగా అంచనా వేయలేం" అని అన్నాడు.

మరో 30 పరుగులు చేసి ఉండి ఉంటే

మరో 30 పరుగులు చేసి ఉండి ఉంటే

"మేం ఎక్కువ పరుగులే చేశాం. కానీ, మరో 30 పరుగులు చేసి ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇప్పటికీ భారత్‌పై గెలవడానికి సానుకూల అంశాలున్నాయి. అనుభవమే వాటిని మాకు చూపుతుంది. మా పొరపాట్లను సరిదిద్దు కోవడానికి వాటి నుంచి పాఠాలు నేర్చుకోవడానికి మేం ప్రయత్నిస్తూనే ఉన్నాం" అని జాసన్ హోల్డర్ తెలిపాడు.

 వారిద్దరి వల్లే ఓడాం

వారిద్దరి వల్లే ఓడాం

"భారత జట్టులో నాణ్యమైన ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ తొలి వన్డేలో మమ్మల్ని దెబ్బకొట్టారు. బౌండరీలకు బంతులను తరలించే అవకాశం వారికి మేం ఎక్కువగా కల్పించాం. బ్యాట్స్‌మెన్స్‌ మీద ఒత్తిడి తీసుకురావాలంటే వికెట్లు తీయడం ఒకటే మార్గం. శిఖర్ ధావన్‌ను త్వరగానే ఔట్‌ చేయగలిగాం. కానీ కోహ్లీ, రోహిత్‌‌ ఇద్దరూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు" అని హోల్డర్ పేర్కొన్నాడు.

తొలి వన్డేలో టీమిండియా అలవోక విజయం

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. అనంతరం 323 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 42.1 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (140), రోహిత్‌ శర్మ(152 నాటౌట్‌) సెంచరీలతో చెలరేగడంతో టీమిండియా అలవోక విజయాన్ని నమోదు చేసింది.

రెండో వికెట్‌కు 246 పరుగులు జోడించిన కోహ్లీ-రోహిత్

ఈ మ్యాచ్‌లో కోహ్లీ-రోహిత్‌ల జోడీ రెండో వికెట్‌కు 246 పరుగులు జోడించడం విశేషం. ఛేదనలో ఏ వికెట్‌కైనా భారత్ తరఫున ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మలను ఔట్ చేసేందుకు వెస్టిండిస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ బౌలర్లని మారుస్తూ తీవ్రంగా శ్రమించినా.. మ్యాచ్ చేజారిపోయే వరకూ ఫలితం రాబట్టలేకపోయాడు.

Story first published: Tuesday, October 23, 2018, 14:08 [IST]
Other articles published on Oct 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X