న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈసారి నీవల్ల కాదులే బాస్‌.. ధోనీ స్టంపింగ్‌పై బంగ్లా క్రికెటర్ పంచ్!!

Not today, What Sabbir Rahman told MS Dhoni in 2019 World Cup

ఢాకా: వికెట్ల వెనుక రెప్పపాటులో స్టంపౌట్ చేయడంలో ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని మించిన వికెట్ కీపర్ లేడు. బ్యాట్స్‌మెన్ పాదాల కదలికల్ని నిశితంగా పరిశీలించే ధోనీ స్టంపౌట్‌లు చేయడంలో సిద్ధహస్తుడు. అయితే ఎంతటి సిద్దహస్తుడైనా ఒక్కసారి తప్పిదాలు చేస్తాడు. ఆ తప్పిదమే 2019 వన్డే ప్రపంచకప్‌‌లో మహీ చేసాడు. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ షబ్బీర్ రెహ్మాన్‌ని స్టంపౌట్ చేయడంలో తడబడ్డాడు.

ఎంఎస్ ధోనీ భారత్ తరఫున 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఎంఎస్ ధోనీ భారత్ తరఫున 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

నీవల్ల కాలే బాస్:

నీవల్ల కాలే బాస్:

అంతకుముందు 2016 టీ20 ప్రపంచకప్‌‌లో షబ్బీర్ రెహ్మాన్‌ని స్టంపౌట్‌ చేసిన ఎంఎస్ ధోనీ.. 2019 ప్రపంచకప్‌‌లో చాన్స్‌ లభించినా దాన్ని మిస్సయ్యాడు. కరోనా వైరస్ పుణ్యమాని ఫేస్‌బుక్‌ లైవ్‌ సెషన్‌లో పాల్గొన్న షబ్బీర్‌.. ఆ ఘటనను గుర్తు చేసుకున్నాడు. '2016 టీ20 ప్రపంచకప్‌‌లో ధోనీ నన్ను స్టంపౌట్ చేశాడు. ఆ తర్వాత 2019 వన్డే ప్రపంచకప్‌లోనూ ధోనీకి ఛాన్స్ వచ్చింది. అయితే నేను తెలివిగా మళ్లీ క్రీజులోకి వచ్చా. అనంతరం ధోనీ వైపు చూసి 'ఈరోజు నీది కాదు, నీవల్ల కాదులే బాస్' అని చెప్పా' అని షబ్బీర్ తెలిపాడు.

195 స్టంపౌట్స్:

195 స్టంపౌట్స్:

ఆ మ్యాచ్‌‌లో షబ్బీర్ రెహ్మాన్ స్టంపౌట్‌ నుండి తప్పించుకున్నా,.. పెద్దగా పరుగులేమీ చేయలేదు. కేవలం 36 పరుగులే చేసాడు. చివరకు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో షబ్బీర్ ఔటయ్యాడు. ఇక ఆ మ్యాచ్‌‌లో బంగ్లాదేశ్‌ని 28 పరుగుల తేడాతో టీమిండియా ఓడించింది. ఎంఎస్ ధోనీ భారత్ తరఫున 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 195 స్టంపౌట్స్ చేశాడు. గత రెండుమూడేళ్లలో రెప్పపాటు వేగంతో చేసిన స్టంపౌట్‌లు ఎన్నో ఉన్నాయి.

10 నెలలుగా క్రికెట్‌కి దూరం:

10 నెలలుగా క్రికెట్‌కి దూరం:

2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంఎస్ ధోనీ టీమిండియాకి దూరమయ్యాడు. బీసీసీఐ సెలక్షన్‌కు కూడా అందుబాటులో ఉండడం లేదు. దీంతో సెంట్రల్ కాంట్రాక్టు నుండి అతనిని బీసీసీఐ తప్పించింది. ఇక మహీ స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌కి భారత సెలక్టర్లు వరుసగా అవకాశాలిచ్చారు. ఈ ఇద్దరిలో పంత్ ఫెయిలవగా.. రాహుల్ వన్డే, టీ20ల్లో వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్‌గా రాణించాడు. ప్రస్తుతం రాహుల్ టీ20 ప్రపంచకప్ రేసులో ఉన్నాడు.

డైలమాలో ధోనీ క్రికెట్ భవిష్యత్తు:

డైలమాలో ధోనీ క్రికెట్ భవిష్యత్తు:

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2020 నిరవధిక వాయిదా పడింది. దీంతో ధోనీ ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి తిరిగి రావడాన్ని ఆలస్యం చేసింది. ఐపీఎల్‌లో మహీ బాగా రాణించినట్లయితే.. అక్టోబర్-నవంబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ ఆడే అవకాశం ఉండేది. కానీ పరిస్థితి ఇప్పుడు అలా లేదు. లీగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో కచ్చితంగా చెప్పలేం. దీంతో ధోనీ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తు డైలమాలో పడింది.

Story first published: Saturday, May 16, 2020, 17:28 [IST]
Other articles published on May 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X