న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ చుట్టూ కొంతమంది చెత్త కెప్టెన్లు కూడా ఉన్నారు: అక్తర్ సంచలన వ్యాఖ్యలు

Kohli Learning Well From Mistakes As Captain : Shoaib Akhtar || Oneindia Telugu
Not many great captains apart from Virat Kohli and Kane Williamson: Shoaib Akhtar

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ప్రశంసల వర్షం కురిపించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ తన దేశాన్ని తన ముందు ఉంచుతున్నాడని, అందుకే టీమిండియా ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుగా అవతరించిందని కొనియాడాడు.

షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్టు చేసిన వీడియోలో "విరాట్ కోహ్లీ ప్రపంచ కప్ తరువాత మంచి కెప్టెన్ అవుతాడని నేను ఇంతకు ముందే చెప్పాను. ఎందుకంటే అతను తన తప్పుల నుండి నేర్చుకుంటున్నాడు. అతడు చాలా బాగా నేర్చుకుంటున్నాడు" అని తెలిపాడు.

భారత్ నుంచి ఒకే ఒక్కడు: కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డుభారత్ నుంచి ఒకే ఒక్కడు: కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

"టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌తో పాటు జట్టు కూర్పును ఎలా క్రమబద్ధీకరించాలో కోహ్లీ నేర్చుకున్నాడు. విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్, అతని చుట్టూ చాలా మంది పేలవమైన కెప్టెన్లు కూడా ఉన్నారు" అని షోయబ్ అక్తర్ అన్నాడు. ఈ మధ్య కాలంలో కనిపిస్తోన్న మధ్యస్థ కెప్టెన్సీపై అక్తర్ నిరాశ వ్యక్తం చేశాడు.

విలియమ్సన్, కోహ్లీలు మాత్రమే

విలియమ్సన్, కోహ్లీలు మాత్రమే

"ఈ మధ్యకాలంలో మధ్యస్థ కెప్టెన్సీ కనిపిస్తోంది. కేన్ విలియమ్సన్, విరాట్ కోహ్లీలు కాకుండా ప్రపంచంలో గొప్ప కెప్టెన్లు లేరన్న విషయం నన్ను చాలా నిరుత్సాహపరుస్తుంది. ఇక్కడ కోహ్లీ గురించి నేను ఒక్క విషయం చెప్పదలచుకున్నా. భయం అంటే ఏంటో తెలియని కెప్టెన్ కోహ్లీ" అని షోయబ్ అక్తర్ అన్నాడు.

సఫారీలపై కోహ్లీ డబుల్ సెంచరీ

సఫారీలపై కోహ్లీ డబుల్ సెంచరీ

"కోహ్లీ దక్షిణాఫ్రికాపై అద్భుత ప్రదర్శన చేశాడు. టీమిండియా ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుగా నిలిచింది. భారత జట్టుకు గొప్ప, నిర్భయమైన కెప్టెన్ ఉన్నాడు. అతడు తన దేశాన్ని తనకంటే ముందు ఉంచుతున్నాడు" అని అక్తర్ తెలిపాడు. పూణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

టెస్టుల్లో 7వ డబుల్ సెంచరీ

టెస్టుల్లో 7వ డబుల్ సెంచరీ

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీతో మెరిశాడు. టెస్టుల్లో విరాట్ కోహ్లీకి ఇది 7వ డబుల్ సెంచరీ. ఈ క్రమంలో అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. "కోహ్లీ డబుల్ సెంచరీ సాధించిన వైఖరి నాకు బాగా నచ్చింది. అతడి ఆకలి కనిపించింది. భవిష్యత్ కూడా అతడు అలాంటి భారీ ఇన్నింగ్స్‌లను ఆడతాడు" అని అక్తర్ తెలిపాడు.

ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో విజయం

ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో విజయం

పూణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా భారీ విజయం సాధించడంతో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది. తొలి 50 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన మూడో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఇది 30వ విజయం కాగా... కెప్టెన్‌గా 50వ టెస్టు మ్యాచ్‌.

కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అరుదైన ఘనత

కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అరుదైన ఘనత

దీంతో తొలి 50 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజాలు స్టీవ్‌ వా(37), రికీ పాంటింగ్‌(35)ల తర్వాత మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో కోహ్లీ తర్వాత వివ్‌ రిచర్డ్స్‌(27) నాలుగో స్థానంలో ఉన్నాడు. భారత్ తరుపున తొలి 50 టెస్టుల్లో 30 విజయాలు సాధించిన ఏకైక కెప్టెన్‌ విరాట్ కోహ్లీనే.

Story first published: Tuesday, October 15, 2019, 16:35 [IST]
Other articles published on Oct 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X