న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జట్టులో చోటు ఎవ్వరూ బహుమతి ఇవ్వలేదు.. నాకు నేనుగా సంపాదించా: పంత్

Nobody Gifted Me A Place In The Indian Team, I Earned It : Rishabh Pant || Oneindia Telugu
Nobody Gifted Me a Place in the Indian Team, I Earned It says Rishabh Pant

ఢిల్లీ: భారత జట్టులో చోటును తనకెవరూ బహూకరించలేదని, ఊరికే ఎవరికీ చోటు దక్కదు. జాతీయ జట్టుకు ఎంపికయ్యేందుకు ఎంతో కష్టపడ్డా. నాకు నేనుగా జట్టులో చోటు సంపాదించా అని యువ వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్‌ పేర్కొన్నాడు. పంత్‌ స్వల్ప కాలంలోనే ఇండియా జట్టులో స్థానం సంపాదించాడు. దూకుడైన బ్యాటింగ్‌తో, చురుకైన కీపింగ్‌తో ఆనతి కాలంలోనే పాపులర్ అయ్యాడు. అయితే విండీస్‌ పర్యటనలో ఒక్క అర్ధ సెంచరీ మినహా.. ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో పంత్ విఫలమైన విషయం తెలిసిందే.

<strong>షోకాజ్‌ నోటీసులు.. బీసీసీఐకి క్షమాపణలు చెప్పిన దినేశ్‌ కార్తీక్‌</strong>షోకాజ్‌ నోటీసులు.. బీసీసీఐకి క్షమాపణలు చెప్పిన దినేశ్‌ కార్తీక్‌

నాకు నేనుగా సంపాదించా:

నాకు నేనుగా సంపాదించా:

వెస్టిండీస్‌ పర్యటన అనంతరం స్వదేశానికి వచ్చిన పంత్‌ మీడియాతో మాట్లాడాడు. 'చిన్న వయసులోనే పేరు రావడం బాగుంది. అయితే నాకేదీ ఊరికే రాలేదు. జట్టులో స్థానం కోసం చాలా కష్టపడ్డా. జట్టులో స్థానం నాకెవరూ బహూకరించలేదు. జట్టులోకి రమ్మని ఎవరూ పిలవరు. బాగా ఆడకపోతే ఎంపికవ్వరు. ప్రతి ఒక్కరూ జట్టులో తమ స్థానానికి కచ్చితంగా న్యాయం చేయాల్సిందే. బాగా ఆడినపుడు పొగడడం, విఫలమైనపుడు విమర్శించడం క్రికెట్‌లో సహజమే' అని పంత్ పేర్కొన్నాడు.

ధోనీ సలహాలు తీసుకుంటా:

ధోనీ సలహాలు తీసుకుంటా:

ప్రతీసారి ఎంఎస్‌ ధోనీతో పోల్చడం నాకు నచ్చదు. అతనో గొప్ప లెజెండ్. అతడు సాధించిన ఘనతలు, రికార్డులే చెబుతాయి. నా బ్యాటింగ్‌ శైలి వేరు. అతని బ్యాటింగ్‌ శైలి వేరు. ఒకరితో పోల్చడం ఇష్టముండదు. నేను అతడిని మార్గనిర్ధేశకుడిగా భావిస్తా. అతని సలహాలు తీసుకుంటాను. నేను ఆయన నుంచి నేర్చుకుంటున్నప్పుడు ఆ స్థాయికి రాత్రికి రాత్రే రాలేనని తెలుసుకున్నా. ధోనీ నుంచి అన్నీ నేర్చుకొనేందుకే ప్రయత్నిస్తాను' అని పంత్ తెలిపాడు.

నేరుగా చోటు దక్కుతుందని భావించా:

నేరుగా చోటు దక్కుతుందని భావించా:

'బ్యాటింగ్‌ ఎలా చేయాలి, బ్యాటింగ్‌కు వెళ్లేముందు ఆలోచనా ధోరణి ఎలా ఉండాలి, ముఖ్యంగా ఒత్తిడి సందర్భాల్లో ప్రశాంతంగా ఉండటం ఎలా అనే విషయాలు ధోనీ నేర్పించాడు. నిజానికి ప్రపంచకప్‌లో నేరుగా చోటు దక్కుతుందని భావించా. ఎంతో కష్టపడ్డాను కూడా. అయితే శిఖర్ ధావన్‌ గాయపడ్డప్పుడు బ్యాకప్‌గా వస్తానని మాత్రం అనుకోలేదు. ప్రపంచకప్‌లో చోటు దక్కడం అదృష్టంగా భావించా. ప్రపంచకప్‌లో ఆడడం ప్రతి క్రికెటర్‌ కల' అని పంత్ చెప్పుకొచ్చారు.

Story first published: Sunday, September 8, 2019, 16:42 [IST]
Other articles published on Sep 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X