న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నమ్మశక్యంగా లేదు: ఇండియన్ పేస్ బౌలింగ్‌పై కపిల్ దేవ్

Ind vs Aus 4th Test : Kapil Dev Says 'Indian Fast Bowlers Were Unbelievable In Australia' | Oneindia
No other team has done so well: Kapil Dev says Indian pace attack is ‘unbelievable’

హైదరాబాద్: ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భారత పేస్ బౌలింగ్ దళం అద్భుతంగా ఉందని భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ప్రశంసల వర్షం కురిపించాడు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.

<strong>ఈ సిరిస్‌లో తొలిసారి: ఎడ్జిబాస్టన్ తర్వాత పుజారా బ్యాటింగ్‌లో ఎంత మార్పు!</strong>ఈ సిరిస్‌లో తొలిసారి: ఎడ్జిబాస్టన్ తర్వాత పుజారా బ్యాటింగ్‌లో ఎంత మార్పు!

"మాజీ కెప్టెన్‌ ధోని మైదానంలో ప్రశాంతంగా ఉండటం ఆటకు మంచిదా? చెడ్డదా? అన్న ప్రశ్నకు గాను ప్రతి కెప్టెన్‌కి ఒక్కో ఆలోచనా విధానం ఉంటుంది. దానిని ఎలా తీసుకోవాలనేది మనమే ఆలోచించుకోవాలి. ఒకరితో ఎందుకు పోలిక చూపించాలి. మైదానంలో ఎలా ఆడుతున్నారన్నదానికే ప్రాముఖ్యత ఇవ్వాలి" అని అన్నాడు.

"టీమిండియా గెలిచినంతవరకు ఆ విమర్శల వల్ల ఏ ఉపయోగం ఉండదు" అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం భారత జట్టు ఆటతీరుపై కపిల్ ప్రశంసలు కురిపించాడు. "గత 15 నెలల్లో ఏ జట్టు ఇంత బాగా పేస్‌ బౌలింగ్ చేయలేదు. భారత జట్టు అద్భుతంగా ఆడుతుంది. ఇది నమ్మశక్యంగా లేదు. ఇంతకుమంచి చెప్పేదేమి లేదు" అని అన్నాడు.

గురువారం ప్రారంభమైన సిడ్నీ టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ రాణించడంతో టీమిండియా భారీ స్కోరు దిశ‌గా సాగుతోంది. భారత బ్యాట్స్‌మన్ పుజారా సెంచరీతో చెలరేగగా, ఓపెనర్ మయాంక్ అగర్వాల్(77) హాఫ్ సెంచరీతో రాణించగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది.

ప్రస్తుతం క్రీజులో ఛటేశ్వర్ పుజారా(130), హనుమ విహారి(39) పరుగులతో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హాజెల్‌ఉడ్ రెండు వికెట్లు తీయగా, మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్‌లకు చెరో వికెట్ లభించింది.

Story first published: Thursday, January 3, 2019, 18:38 [IST]
Other articles published on Jan 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X