న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాండ్యాతో పోటీనా?: 'భారీ సిక్సర్లు కండబలంతో కాదు టెక్నిక్‌ కూడా ఉండాలి'

No competition between Hardik Pandya and me: Vijay Shankar

హైదరాబాద్: హార్ధిక్ పాండ్యాతో తనకెలాంటి పోటీ లేదని ఆల్ రౌండర్ విజయ్ శంకర్ స్పష్టం చేశాడు. న్యూజిలాండ్ పర్యటనలో భారత్ తరుపున అద్భుత ప్రదర్శన చేసి వరల్డ్‌కప్ జట్టులో అనూహ్యంగా విజయ్ శంకర్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. వరల్డ్‌కప్‌లో విజయ్ శంకర్ నాలుగో స్థానానికి చక్కగా సరిపోతాడని సెలక్టర్లు అతడికి చోటు కల్పించారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

మే30 నుంచి ఆరంభమయ్యే వరల్డ్‌కప్‌లో భారత్ నుంచి ముగ్గురు ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, రవీంద్ర జడేజాలు సత్తా చాటేందుకు సిద్దంగా ఉన్నారు. అయితే, కీలకమైన నాలుగో స్థానంతో పాటు జట్టులో శాశ్వత స్థానం కోసం హార్దిక్‌ పాండ్యా, విజయ్‌ శంకర్‌లు పోటీ పడుతున్నారని వార్తల నేపథ్యంలో విజయ్ శంకర్ తాజాగా స్పందించాడు.

"పాండ్యాతో నాకెలాంటి పోటీ లేదు. అతడు అద్భుతమైన ఆటగాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగల సమర్థుడు. అవును, మేమంతా ఆల్ రౌండర్లం అయినప్పటికీ... భిన్నంగా ఉంటాం. మా ఇద్దరి మధ్య అసలు పోటీ ఎందుకు? మేము పోటీ పడితే టీమిండియాను గెలిపించడానికే తప్ప వేరేవాటి కాదు" అని విజయ్ శంకర్ తెలిపాడు.

"భారీ సిక్సులు బాదడాన్ని ఆస్వాదిస్తా. అయితే భారీ సిక్సర్లు కేవలం కండబలంతోనే కాదు టెక్నిక్‌ కూడా ఉండాలి. టెక్నిక్‌ లేకుంటే విఫలం అవుతాం. న్యూజిలాండ్‌ సిరీస్‌ అనంతరం నాపై నాకు నమ్మకం కలిగింది.. విశ్వాసం పెరిగింది. నా చిన్ననాటి కోచ్‌తో ఇండోర్‌లో ప్రాక్టీస్ చేశా. ఐపీఎల్‌ సందర్భంగా వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఇచ్చిన సూచనలు ప్రపంచకప్‌లో ఎంతగానే ఉపయోగపడాతాయి" అని విజయ్ శంకర్ అన్నాడు.

Story first published: Tuesday, May 21, 2019, 19:13 [IST]
Other articles published on May 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X