న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ కొంపముంచిన నోబాల్‌.. ఓడిపోయిన మ్యాచ్ గెలిచిన ఆస్ట్రేలియా! గోస్వామి ఎంతపనాయే!!

No-ball drama: Australia Women beat India Women in Last Ball

మెక్‌కే (క్వీన్స్‌లాండ్‌): ఆస్ట్రేలియా పర్యటనలో భారత మహిళల క్రికెట్‌ జట్టు రెండో పరాజయంను చవిచూసింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్లతో తేడాతో ఓడిపోయింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరి బంతికి గెలిచిన ఆతిథ్య ఆస్ట్రేలియా మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ కైవసం చేసుకొంది. అయితే ఆసీస్ గెలవాలంటే చివరి ఓవర్లో 13 పరుగులు చేయాలి.. ఎంతో అనుభవజ్ఞురాలైన భారత పేసర్ జులన్‌ గోస్వామి చేతిలో బంతి. స్టార్ బ్యాటర్లు బెత్ మూనీతో పాటు నికొలస్‌ కేరీ క్రీజులో ఉన్నా.. టీమిండియాదే విజయం అనుకున్నారు. అలానే జరిగింది కూడా. కానీ ఒక్క నోబాల్‌ భారత్ విజయాన్ని లాగేసుకుంది.

 రాణించిన స్మృతి మంధాన:

రాణించిన స్మృతి మంధాన:

రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 274 పరుగులు సాధించింది. ఓపెనర్‌ స్మృతి మంధాన (86; 94 బంతుల్లో 11×4) హాఫ్ సెంచరీతో సత్తాచాటింది. రిచా ఘోష్‌ (44) రాణించింది. చిచ్చరపిడుగు షఫాలీ వర్మ (22), కెప్టెన్ మిథాలీ రాజ్ (8), యాస్తికా భాటియా (3) పూర్తిగా నిరాశపరిచారు. కీలక సమయంలో దీప్తి శర్మ 34 బంతుల్లో 24 రన్స్ చేసింది. ఇక ఇన్నింగ్స్ చివరలో పూజా వస్ర్తాకర్‌ (29), జులన్‌ గోస్వామి (28 నాటౌట్‌) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో తహిల మెక్‌గ్రాత్‌ (3/45) ఆకట్టుకుంది. మెలినుక్స్, డార్సీ బ్రౌన్ తలో వికెట్ తీశారు.

నోబాల్‌గా ప్రకటించడంతో:

నోబాల్‌గా ప్రకటించడంతో:

అనంతరం భారీ ఛేదనలో ఓపెనర్‌ బెత్‌ మూనీ (133 బంతుల్లో 12 ఫోర్లతో 125 నాటౌట్‌) అజేయ సెంచరీ చేయడంతో ఆస్ట్రేలియా ఓవర్లన్నీ ఆడి 275/5 స్కోరు చేసి నెగ్గారు. చివరి ఓవర్లో ఆసీస్‌ విజయానికి 13 రన్స్‌ అవసరమయ్యాయి. వెటరన్‌ పేసర్‌ జులన్‌ గోస్వామి బంతిని అందుకుంది. తొలి రెండు బంతుల్లో ఆస్ట్రేలియా 5 పరుగులు చేసింది. మూడో బంతిని గోస్వామి నోబ్‌గా వేసింది. తర్వాత రెండు బైస్‌ వచ్చాయి. ఐదో బంతికి క్యారీ 2 రన్స్‌ చేసింది. ఇక చివరి బంతికి 3 పరుగులు అవసరమయ్యాయి. నికొలస్‌ కేరీకి.. జులన్‌ విసిరిన ఫుల్‌టాస్‌ బంతి నేరుగా ఫీల్డర్‌ చేతుల్లో పడింది. దీంతో భారత ఫీల్డర్లు సంబరాలు చేసుకున్నారు. అయితే టీవీ అంపైర్‌ దాన్ని నోబాల్‌గా ప్రకటించడంతో భారత్‌ ఉసూరుమంది. తర్వాత బంతికి క్యారీ-మూనీ వేగంగా 2 రన్స్‌ చేసి విజయం అందించారు. తహిల (74) బ్యాట్‌తోనూ మెరిసింది.

 వరుసగా 26వ విజయం:

వరుసగా 26వ విజయం:

ఆరంభంలోనే వికెట్లు పడగొట్టి ఆసీస్‌పై ఒత్తిడి పెంచిన మిథాలీ బృందం.. దాన్ని చివరి వరకు కొనసాగించలేకపోయింది. మూనీ, తహిలా నిలకడగా ఆడటంతో కంగారూలు క్రమంగా లక్ష్యానికి చేరువయ్యారు. వన్డేల్లో ఆసీస్‌కు ఇది వరుసగా 26వ విజయం కాగా.. మహిళా క్రికెట్‌ చరిత్రలో ఇది మూడో అత్యధిక ఛేదన. అజేయ శతకంతో ఆకట్టుకున్న మూనీకి 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. ఇప్పటికే సిరీస్‌ ఆసీస్‌ వశం కాగా.. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే ఆదివారం ఇక్కడే జరుగనుంది. ప్రస్తుతం భారత మహిళలు ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా.. పురుషులు ఐపీఎల్ 2021 కోసం యూఏఈలో ఉన్నారు. ఐపీఎల్ 2021లో పలు జట్లకు ఆడుతున్నారు. ఈ విజయంపై భారత ఫాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గోస్వామి ఎంతపనాయే అని ట్వీట్లు చేస్తున్నారు.

స్కోర్ బోర్డు:

స్కోర్ బోర్డు:

భారత్‌: 50 ఓవర్లలో 274/7 (స్మృతి మంధాన 86, రిచా ఘోష్‌ 44, పూజా వస్ర్తాకర్‌ 29, జులన్‌ గోస్వామి 28 నాటౌట్‌, దీప్తీ శర్మ 23, షఫాలీ వర్మ 22; తహ్లియా మెక్‌గ్రాత్‌ 3/45, సోఫీ మొలినిక్స్‌ 2/28);

ఆస్ట్రేలియా: 50 ఓవర్లలో 275/5 (బెత్‌ మూనీ 125 నాటౌట్‌, తహ్లియా 74, నికోలా క్యారీ 39 నాటౌట్‌).

Story first published: Saturday, September 25, 2021, 8:07 [IST]
Other articles published on Sep 25, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X