
తిలక్‌వర్మనే బెస్ట్
ఓబ్రెయిన్ అభిప్రాయం ప్రకారం.. హిట్టింగ్ సామర్థ్యాలతో ఆకట్టుకున్న ముంబై ఇండియన్స్ ప్లేయర్ తిలక్ వర్మ, వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ మహేశ్ తీక్షణ, దక్షిణాఫ్రికా ప్లేయర్ అయిన సన్‌రైజర్స్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఐడెన్ మార్క్రామ్.. వేలంలో కొనుగోలు చేసిన వారి ధరకు న్యాయం చేకూర్చే ప్రదర్శన చేస్తున్నారన్నాడు.
'ముంబై ఇండియన్స్ ప్లేయర్ తిలక్ వర్మను నా మొదటి ఛాయిస్‌గా ఎంచుకుంటాను. ఎందుకంటే అతను బంతిని బాగా హిట్ చేయగలడు. ఈ సీజన్లో 250కంటే ఎక్కువ పరుగులు చేశాడు. దాదాపు 140స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు. ముంబై తరఫున అత్యధిక రన్ స్కోరర్ కూడా. ఇక నా రెండో ఆప్షన్ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ తీక్షణ.
అతన్ని చాలా చవకగా కొనుగోలు చేశారు. అజంతా మెండిస్‌లాగా అతని బౌలింగ్ పదును ఉంది. చెన్నై తరఫున మంచి వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ఇక ఐడెన్ మార్క్రామ్ విషయానికొస్తే.. అతను సన్‌రైజర్స్ తరఫున ఇప్పటివరకు నిరాశపరచలేదు. మంచి హిట్టింగ్ సామర్థ్యం ఉంది. స్ట్రైక్ రేట్ కూడా బాగుంది. మంచి ఇన్నింగ్స్‌ను నిర్మించగలడు' అని ఓబ్రెయిన్ తెలిపాడు.

డెవాల్డ్ బ్రెవిస్, తిలక్ వర్మ విలువైన ప్లేయర్లు
మాజీ క్రికెటర్ నిఖిల్ చోప్రా తన అభిప్రాయం ప్రకారం.. ధరకు తగ్గట్టు ప్రదర్శన చేస్తున్న బ్యాటర్లలో ముంబై బ్యాటర్లు డెవాల్డ్ బ్రెవిస్, తిలక్ వర్మలను మొదటి రెండు స్థానాల్లో పేర్కొన్నాడు. ఆ తర్వాత అతను అనుభవజ్ఞులైన భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్, ఉమేష్ యాదవ్‌లను ఎంచుకున్నాడు. వీరు ఈ సీజన్‌లోనే అత్యుత్తమ బౌలర్లుగా పరిగణించబడుతున్నారని పేర్కొన్నాడు. మొదటి రౌండ్‌లో ఉమేష్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడంతో తను షాక్‌కు గురయ్యానని, ప్రస్తుతం అతని ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నానని చోప్రా అభిప్రాయపడ్డారు.

ప్లేయర్లు వారి ధరలు.. ప్రదర్శనలు
తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ రూ.1.70కోట్లకు కొనుగోలు చేసింది. ఆడిన 8మ్యాచ్‌లలో 45సగటుతో 140 స్ట్రైక్ రేటుతో 272పరుగులు చేశాడు. టాప్ స్కోరర్ల లిస్టులో 8వ స్థానంలో కొనసాగుతున్నాడు.
మహీష్ తీక్షణను చెన్నై సూపర్ కింగ్స్ రూ.70లక్షలకు కొనుగోలు చేసింది. ఆడిన 5 మ్యాచ్‌లలో 7.75ఎకానమీతో బౌలింగ్ చేసి 8వికెట్లు తీశాడు.
ఐడెన్ మార్క్రామ్‌ను సన్ రైజర్స్ రూ.2.60కోట్లకు కొనుగోలు చేసింది. ఆడిన 8 మ్యాచ్‌లలో 6ఇన్నింగ్స్‌లలో 148 స్ట్రైక్ రేటుతో 246పరుగులు చేశాడు.
డెవాల్డ్ బ్రెవిస్‌ను ముంబై ఇండియన్స్ రూ.3కోట్లకు కొనుగోలు చేసింది. ఆడిన 6 మ్యాచ్‌లలో 155 స్ట్రైక్ రేటుతో 126పరుగులు చేశాడు.
కుల్దీప్ యాదవ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2కోట్లకు కొనుగోలు చేసింది. ఆడిన 8 మ్యాచ్‌లలో 17వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు.
ఉమేష్ యాదవ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.2కోట్లకు కొనుగోలు చేసింది. ఆడిన 9మ్యాచ్‌లలో 7.28ఎకానమీతో 14వికెట్లు తీశాడు.