న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'అతడు బ్యాట్స్‌మెన్‌ను మెస్మరైజ్‌ చేయలేడు.. టీ20 ప్రపంచకప్‌లో కుల్దీప్‌ యాదవే బెటర్ ఆప్షన్'

Muttiah Muralitharan picks Kuldeep Yadav ahead of Varun Chakravarthy for T20 World Cup 2021
Muttiah Muralitharan Picks Kuldeep Ahead Of Varun Chakravarthy For T20 WC || Oneindia Telugu

కొలంబో: టీమిండియా మణికట్టు స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌పై శ్రీలంక దిగ్గజ బౌలర్‌ ముత్తయ్య మురళీధరన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇప్పటికే కుల్దీప్‌ తన ప్రతిభను నిరూపించుకున్నాడని, అయినా దురుదృష్టవశాత్తూ తనకు తగినన్ని అవకాశాలు లభించడం లేదన్నాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్) కుల్దీప్ సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోకపోవడం పట్ల మురళీధరన్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇక రానున్న టీ20 ప్రపంచకప్‌లో వరుణ్‌ చక్రవర్తితో పోలిస్తే.. కుల్దీప్‌కే టీమిండియా తరఫున ఆడే అవకాశం ఎక్కువగా ఉందని, తన ఓటు అతడికే అని మురళీధరన్‌ తెలిపాడు.

Tokyo Olympics 2021: పంజాజ్‌ ఆటగాళ్లకు బంపర్ ఆఫర్.. భారత్ స్వర్ణం గెలిస్తే కోట్లే!!!Tokyo Olympics 2021: పంజాజ్‌ ఆటగాళ్లకు బంపర్ ఆఫర్.. భారత్ స్వర్ణం గెలిస్తే కోట్లే!!!

ఐపీఎల్‌లో చక్రవర్తికే ఏక్కువ అవకాశాలు:

ఐపీఎల్‌లో చక్రవర్తికే ఏక్కువ అవకాశాలు:

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న కుల్దీప్‌ యాదవ్‌‌ను ఆ జట్టు యాజమాన్యం, కెప్టెన్ అంతగా పట్టించుకోవడం లేదు. 2019, 2020, 2021లో కుల్దీప్‌ ఎక్కువగా మ్యాచులు ఆడలేదు. 2019 వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కకపోవడానికి కారణం కేకేఆర్ అనే చెప్పొచ్చు. స్పిన్‌ విభాగంలో సునిల్‌ నరైన్‌, షకీబ్‌ అల్‌ హసన్‌, వరుణ్‌ చక్రవర్తిని మాత్రమే కేకేఆర్ ఎక్కువగా వినియోగించుకుంది. తుది జట్టులో నరైన్‌, చక్రవర్తికే ఏక్కువగా అవకాశాలు వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన కుల్దీప్‌.. 'నేను మరీ అంతపనికిరాని వాడినా? చెత్తగా ఆడతానా?' అని మీడియా సమక్షంలోనే ఆవేదన వ్యక్తం చేశాడు.

 టీ20ల్లో అరంగేట్రం:

టీ20ల్లో అరంగేట్రం:

శ్రీలంక టూర్‌లో భారత జట్టులో చోటుదక్కించుకున్న కుల్దీప్‌ యాదవ్‌‌.. వన్డే సిరీస్‌ తొలి మ్యాచ్‌లో 2 వికెట్లు తీశాడు. రెండో మ్యాచ్‌లో ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయిన మణికట్టు మాంత్రికుడు.. చివరి మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక మొదటి టీ20లో ఆడే అవకాశం రాకపోగా.. రెండో టీ20లో 2 వికెట్లతో సత్తాచాటాడు. మూడో మ్యాచ్‌లో ఒక్క వికెట్‌ కూడా తీయలేదు. అదే సమయంలో శ్రీలంక పర్యటనలో భాగంగా అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసిన వరుణ్‌ చక్రవర్తి.. తొలి రెండు మ్యాచ్‌లలో ఒక్కో వికెట్‌ తీశాడు. మూడో మ్యాచ్‌లో ఒక వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు.

 కుల్దీప్‌ యాదవ్‌కే నా ఓటు:

కుల్దీప్‌ యాదవ్‌కే నా ఓటు:

ఈ ఇద్దరి ప్రదర్శనను చూసిన ముత్తయ్య మురళీధరన్‌ టీ20 ప్రపంచకప్‌పై స్పందించాడు. 'యూఏఈలో జరుగనున్న ఐపీఎల్‌ 2021 పూర్తయ్యేంత వరకు వేచి చూడక తప్పదు. ఎవరు ఫామ్‌లో ఉంటారు.. ఎవరు ఫామ్ కొనసాగిస్తారన్న అంశాలు అప్పుడు తెలుస్తుంది. అయితే స్పిన్నర్ల విషయంలో నేను మాత్రం కుల్దీప్‌ యాదవ్‌ వైపే మొగ్గు చూపుతాను. ఎందుకంటే వికెట్లు తీయగల బౌలర్‌గా తనను తాను ఇప్ప్పటికే నిరూపించుకున్నాడు' అని మురళీధరన్‌ అన్నాడు. ఐపీఎల్‌లో భాగంగా ముత్తయ్య మురళీధరన్‌.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

 చక్రవర్తి మెస్మరైజ్‌ చేయలేడు:

చక్రవర్తి మెస్మరైజ్‌ చేయలేడు:

'వరుణ్‌ చక్రవర్తి విషయానికొస్తే.. తను మంచి బౌలర్‌. భారత్, ఐపీఎల్‌ జట్లకు అతడు బెటర్‌ ఆప్షన్‌. అయితే అజంతా మెండిస్‌, సునీల్‌ నరైన్‌ అంతటి స్థాయి వరుణ్‌కు లేదు. తను బ్యాట్స్‌మెన్‌ను మెస్మరైజ్‌ చేయలేడు. ఇంకా మెరుగవ్వాల్సి ఉంది' అని ముత్తయ్య మురళీధరన్‌ స్పష్టం చేశాడు. కుల్దీప్ భారత్ తరఫున 7 టెస్టులు, 65 వన్డేలు, 23 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మరోవైపు టీమిండియా తరఫున చక్రవర్తి 3 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.

Story first published: Saturday, July 31, 2021, 12:15 [IST]
Other articles published on Jul 31, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X