న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా క్రికెటర్!!

World Cup Winner Munaf Patel Retires From All Forms Of Cricket | Oneindia Telugu
Munaf Patel, part of World Cup winning team in 2011, retires from international cricket

హైదరాబాద్: కొన్ని నెలలుగా గాయాలు.. ఫామ్ లేమి కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్న భారత జట్టు సీనియర్ ఫాస్ట్ బౌలర్ మునాఫ్ పటేల్. ఈ నేపథ్యంలో ఇక తన అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కి వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్రికెట్‌కు దూరంగా ఉంటూనే వీడ్కోలు పలకాల్సి వస్తుందనే ఆవేదన వ్యక్తం చేశాడు.

2003లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో ఫస్ట్‌ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన మునాఫ్ పటేల్.. ఆ తర్వాత మూడేళ్లకి భారత్ జట్టులో చోటు సంపాదించాడు. 2006 మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగిన ఆ టెస్టు మ్యాచ్‌లో.. వేగం, కచ్చితత్వంతో అందరి నుంచి ప్రశంసలు అందుకున్నాడు. కానీ.. గాయాలు అతడి కెరీర్‌ని దారుణంగా దెబ్బతీశాయి. 2011 వరకూ జట్టులోకి వస్తూపోతున్న ఈ పేసర్.. ఆ ఏడాది తర్వాత మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేయలేకపోయాడు.

'రిటైర్మెంట్ ప్రకటిస్తున్నందుకు అంతగా బాధ లేదు. కానీ, నాతోపాటు ఆడిన చాలా మంది క్రికెటర్లు రిటైర్మెంట్ తీసుకున్నారు. అయితే.. ఒక్కటే చింత.. వారంతా క్రికెట్ ఆడుతూ ఉండగానే రిటైర్‌మెంట్ తీసుకోగలిగారు. నాకు మాత్రం ఆ అవకాశం లేకపోయింది' అని 35 ఏళ్ల మునాఫ్ పటేల్ వెల్లడించాడు.

కెరీర్‌లో 70 వన్డేలాడి 86 వికెట్లు పడగొట్టిన మునాఫ్ పటేల్.. 13 టెస్టుల్లో 35 వికెట్లు, 3 టీ20ల్లో 4 వికెట్లు సాధించాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్‌కి ఆడిన ఈ పేసర్ 63 మ్యాచ్‌ల్లో 74 వికెట్లు తీశాడు. 2011లో ప్రపంచకప్ గెలిచిన భారత్ జట్టులో సభ్యుడిగా ఉన్న మునాఫ్ పటేల్.. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కి దూరమై దేశవాళీ, ఐపీఎల్‌కే పరిమితమయ్యాడు.

Story first published: Saturday, November 10, 2018, 14:22 [IST]
Other articles published on Nov 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X