హైదరాబాద్: ఎవరైనా క్రికెటర్ గురించి ఒక్కమాటలో చెప్పాలని సహచర ఆటగాళ్లను అడిగితే.. అతడు గొప్ప ఆటగాడనో, ఏ హిట్టరనో, ఆల్‌రౌండర్ అనో, మ్యాచ్ ఫినిషనర్ అనో, మంచి వ్యక్తిత్వం గలవాడనో, సరదాగా ఉంటాడనో చెబుతారు. లేదంటే.. అతడిలో మార్చుకోవల్సిన అలవాట్ల గురించి సలహాలిస్తారు. అయితే టీమిండియా స్టార్ పేసర్, ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా మాత్రం ఓ విచిత్రమైన సమాధానం చెప్పాడు. అది కూడా సహచర ఆటగాడు హార్దిక్ పాండ్యా గురించి. ఇక ముంబై జట్టు సభ్యులను ఇదే ప్రశ్న అడిగితే ఏమన్నారో ఓసారి తెలుసుకుందాం.
హార్దిక్ పాండ్యా అంటే వెంటనే గుర్తొచ్చేది అతడి పవర్ ఫుల్ హిట్టింగ్. చూడ్డానికి సన్నగా కనపడినా.. బంతిని మాత్రం బౌండరీలు దాటించడంలో దిట్ట. క్రీజులో ఉన్నంతసేపూ ఫోర్లు, సిక్సుల వర్షం కురిపించి బౌలర్లకు చెమటలు పట్టించగలడు. ముఖ్యంగా ఐపీఎల్‌లో హార్దిక్ ఆట అద్భుతంగా ఉంటుంది. అలాంటి క్రికెటర్ గురించి ఒక్కమాటలో చెప్పాలని ముంబై ఇండియన్స్ జట్టు సబ్యులకు ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి ముంబై బ్యాటింగ్ కోచ్ మహేలా జయవర్దనే సమాధానమిస్తూ.. హార్దిక్ అంటే వ్యక్తిత్వం అని పేర్కొన్నాడు.
ముంబై జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ జహీర్ ఖాన్‌ను అడిగితే 'శక్తి సామర్థ్యం' అని బదులిచ్చాడు. బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ అయితే అతడో 'లెజెండ్' అంటూ కొనియాడాడు. వీరంతా ఒకెత్తు.. పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రం కొంత విచిత్రమైన సమాధానం చెప్పాడు. అతడి ఆట గురించి మాట్లాడకుండా.. హార్దిక్ అందగాడంటూ చెప్పుకొచ్చాడు. తానూ విషయం చెప్పానని అతడికి చెప్పండని కూడా అన్నాడు. మరి దీనిపై హార్దిక్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి. చివరగా ముంబై బ్యాట్స్‌మన్ ఆదిత్య తారెను అడిగితే.. 'రాక్‌స్టార్'తో పోల్చాడు. ఈ వీడియోను ముంబై తాజాగా ట్విటర్‌లో పంచుకుంది.
👒 🎸🏏 Paltan, what's your one word to describe our Kung-Fu Pandya? 😋#OneFamily #MumbaiIndians @hardikpandya7 pic.twitter.com/H6vSNnlAwC
— Mumbai Indians (@mipaltan) November 18, 2020
ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలు సిడ్నీలో ఉన్న విషయం తెలిసిందే. క్వారంటైన్‌లో ఉంటూ ప్రాక్టీస్ చేస్తున్నారు. నవంబర్ 27 నుంచి ఆరంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. వన్డేలు, టీ20లకు బుమ్రా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ 17 నుంచి బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. టెస్టు సిరీస్‌లో తొలి పోరు డే అండ్ నైట్‌గా జరుగనుండటంతో దానిపైనే దృష్టి సారించిన భారత్ సుదీర్ఘ ఫార్మాట్ కోసమే ప్రాక్టీస్ చేస్తున్నది. బుమ్రా నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు.
ఆ విషయంలో.. కేఎల్ రాహుల్‌కు 10కి 7.5 మార్కులు!!