న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ జట్టులో లేకపోతే.. కోహ్లీ సక్సెస్ కాలేడు: వసీం జాఫర్

MS Dhoni Will Provide Help To Virat Kohli With His Cricketing Acumen says Wasim Jaffer

ముంబై: టీమిండియా సారధ్య బాధ్యతలను మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నుండి విరాట్ కోహ్లీ తీసుకున్న విషయం తెలిసిందే. ధోనీ కెప్టెన్సీలో చాన్నాళ్లు క్రికెట్‌ ఆడటం కోహ్లీకి ఎంతో లాభపడింది. ధోనీ వారసుడిగా జట్టు పగ్గాలు చేపట్టిన కోహ్లీ.. ఇప్పటికే తన సత్తా నిరూపించుకున్నాడు. అద్భుత ఆటతీరుతో పాటు కెప్టెన్‌గానూ టీమిండియాను ఉన్నత స్థానంలో నిలిపాడు. అయితే ఇప్పటివరకు కోహ్లీ పక్కనే ఉన్న మహీ.. కీలక విషయాల్లో సలహాలు ఇచ్చేవాడు. ముఖ్యంగా డీఆర్‌ఎస్ రివ్యూలలో. అయితే ధోనీ లేకపోతే కోహ్లీ డీఆర్‌ఎస్ రివ్యూలను కోరడంలో సక్సెస్ కాలేడని మాజీ ఓపెనర్ వసీమ్ జాఫర్ అభిప్రాయపడ్డాడు.

చహల్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన డివిలియర్స్!!చహల్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన డివిలియర్స్!!

ఐపీఎల్ తర్వాత క్లారిటీ

ఐపీఎల్ తర్వాత క్లారిటీ

తాజాగా వసీం జాఫర్ టైమ్స్ నౌతో మాట్లాడుతూ... 'ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ గురించి అందరూ అంచనాలు వేయడం సహజం. మహీ ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. అందుకు చెన్నై సూపర్ కింగ్స్ నెట్స్‌లో ఏ తరహాలో ప్రాక్టీస్ చేశాడో మనం చూశాం. బహుశా ఐపీఎల్ ముగిసిన తర్వాత ధోనీ కెరీర్‌పై ఓ క్లారిటీ వస్తుందనుకుంటున్నా. ధోనీ రిటైర్మెంట్ రూమర్స్‌ ఇటవల చాలా ఎక్కువ అయ్యాయి. ధోనీ ఇలాంటివి పట్టించుకోడు. మహీ ఏ నిర్ణయం తీసుకున్నా.. సరైనదిగానే ఉంటుంది' అని అన్నాడు.

ధోనీ లేకపోతే డీఆర్‌ఎస్ రివ్యూలన్నీఫెయిలే

ధోనీ లేకపోతే డీఆర్‌ఎస్ రివ్యూలన్నీఫెయిలే

'టీ20ల్లో ఇప్పటికీ ఎంఎస్ ధోనీ బెస్ట్ క్రికెటర్. ఒకే ఓవర్లో మ్యాచ్‌ను లాగేసుకుంటాడు. బెస్ట్ ఫినిషర్. అంతేకాకుండా కెప్టెన్‌ విరాట్ కోహ్లీకి మైదానంలో చాలా విషయాల్లో అతను సాయం చేస్తున్నాడు. అందులో డీఆర్‌ఎస్ రివ్యూలు కూడా ఉంటాయి. ఒకవేళ ధోనీ జట్టు‌లో లేకపోతే చాలా డీఆర్‌ఎస్ రివ్యూలు ఫెయిలవుతాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు' అని మాజీ ఓపెనర్ వసీమ్ జాఫర్ పేర్కొన్నాడు. డిసిషెన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్‌ఎస్)ని ధోనీ రివ్యూ సిస్టమ్ అని పిలుస్తారన్న విషయం తెలిసిందే.

2014లో టెస్టులకి రిటైర్మెంట్

2014లో టెస్టులకి రిటైర్మెంట్

2014లో టెస్టులకి ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పుడు కోహ్లీ చేతికి టెస్టు జట్టు పగ్గాలు వచ్చాయి. ఆ తర్వాత 2017లో వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోనీ తప్పుకోగా.. కోహ్లీ పూర్తి స్థాయి కెప్టెన్‌గా మారాడు. అప్పటి నుండి మహీ పక్కనే ఉండి కోహ్లీ ఎన్నో సూచనలు, సలహాలు నేర్చుకున్నాడు. 2019 వన్డే ప్రపంచకప్‌ తర్వాత క్రికెట్‌కి దూరంగా ఉంటున్న ధోనీ.. ఐపీఎల్ 2020 సీజన్‌తో మళ్లీ బ్యాట్ పట్టాలని ఆశించాడు. కానీ కరోనా వైరస్ కారణంగా ఈ టోర్నీ నిరవధికంగా వాయిదాపడగా.. ధోనీ కెరీర్ ప్రశ్నార్థకంలో పడిపోయింది.

కోహ్లీ కంటే స్మిత్‌ బెటర్‌

కోహ్లీ కంటే స్మిత్‌ బెటర్‌

టెస్టు క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీ కంటే స్టీవ్‌ స్మిత్‌ గొప్ప బ్యాట్స్‌మని వసీమ్ జాఫర్ పేర్కొన్నాడు. 'బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదం నుంచి తేరుకొని అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే మళ్లీ నంబర్‌ వన్‌ స్థానానికి స్మిత్‌ ఎగబాకాడు. అంతేకాకుండా ఏడాది పాటు టెస్టు క్రికెట్‌ దూరంగా ఉన్నప్పటికీ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లోనే కొనసాగాడు. అయితే మూడు ఫార్మట్లలో కలిపి బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా విరాట్‌ కోహ్లీ నిలుస్తాడు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కోహ్లీ తర్వాత రోహిత్‌ శర్మ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌' అని జాఫర్‌ అభిప్రాయపడ్డాడు.

Story first published: Saturday, June 6, 2020, 16:51 [IST]
Other articles published on Jun 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X