న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ధోనీ, కోహ్లీ వారి ప్రతిష్టలను త్యాగం చేయలేరు'

MS Dhoni, Virat Kohli Cant Sacrifice Their Reputations For Match-Fixing, Says ACU Chief

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ స్థాయి వ్యక్తులు స్పాట్‌ ఫిక్సింగ్‌ చేయరు. మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ధోనీ, కోహ్లీ వారి ప్రతిష్టలను త్యాగం చేయలేరు అని బీసీసీఐ అవినీతి నిరోధ విభాగం చీఫ్‌ అజిత్‌సింగ్‌ సింగ్ షెకావత్ పేర్కొన్నాడు. తాజాగా భారత మహిళా క్రికెట్ జట్టుతో పాటు తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్)లో ఫిక్సింగ్ కలకలం రేగింది. ఏసీయూ విచారణలో ఈ ఫిక్సింగ్ భూతం బయటపడింది. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఉదంతాల నేపథ్యంలో అజిత్ సింగ్ షెకావత్ మీడియాతో మాట్లాడాడు.

<strong>బెట్టింగ్‌ను న్యాయబద్ధం చేస్తే భారత క్రికెట్‌లో అవినీతిని అరికట్టొచ్చు</strong>బెట్టింగ్‌ను న్యాయబద్ధం చేస్తే భారత క్రికెట్‌లో అవినీతిని అరికట్టొచ్చు

అందుకే ఫిక్సింగ్‌ చేయరు:

అందుకే ఫిక్సింగ్‌ చేయరు:

'నా అబిప్రాయం ప్రకారం.. మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల ఓ స్టార్‌ క్రికెటర్‌ పొందే వాటికన్నా పోగొట్టుకొనేదే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ కోహ్లీ, ధోనీ లాంటి స్థాయి ఆటగాళ్లు ఇలాంటి వాటిల్లో జోక్యం చేసుకుంటే.. అన్ని డబ్బుతోనే ముడిపడి ఉండవు. పరువు అనేది చాలా ముఖ్యం. అల్పమైన వాటి కోసం వారు పరువును తాకట్టు పెట్టరు. వీటన్నింటి కన్నా వారెంతో ఉన్నత వ్యక్తులు. డబ్బు పరంగా చూసినా వారికెన్నో వ్యాపార ఒప్పందాలు ఉంటాయి. వ్యాపార ప్రయోజనాల దృష్టితో ఆలోచిస్తే.. బెట్టింగ్‌ ద్వారా వారికొచ్చే మొత్తం అందులో చిన్నపాటిది' అని అజిత్ సింగ్ పేర్కొన్నారు.

సంప్రదించే ధైర్యం చేయరు:

సంప్రదించే ధైర్యం చేయరు:

'భవిషత్తులో తామేం కోల్పోతున్నామో తెలియని యువ ఆటగాళ్లు, విజయవంతం అవ్వని క్రికెటర్లే ఫిక్సింగ్ వాటికి ఆకర్షితులు అవుతారు. యువకుల దృష్టిలో బుకీల నుంచి వచ్చే డబ్బు విస్మరించలేనంత పెద్ద మొత్తంలో కనిపిస్తుంది. అందుకే వారు అటువైపు ఆకర్షితులయ్యారు. ఓ స్థాయి వ్యక్తులకు స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆలోచనలు రావు. కోహ్లీ, ధోనీ వంటి దిగ్గజాలను, క్రికెట్‌ పట్ల అంకితాభావం ఉన్నవారిని సంప్రదించే ధైర్యం చేయరు. ఎందుకంటే వారిని కలిస్తే ఏమవుతుందో బుకీలకు తెలుసు' అని అజిత్ సింగ్ అన్నారు.

ఏం చేసినా మనం అరికట్టలేం:

ఏం చేసినా మనం అరికట్టలేం:

'స్పాట్‌ ఫిక్సింగ్‌ను ఏం చేసినా మనం అరికట్టలేం. దీనికి వ్యతిరేకంగా మ్యాచ్ ఫిక్సింగ్‌ చట్టం అవసరం. ఫిక్సింగ్‌పై స్పష్టమైన చట్టం ఉంటే పోలీసులు ఇంకా మెరుగ్గా పనిచేస్తారు. బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయడం వల్ల అవినీతిని నియంత్రించవచ్చు. నిబంధనలు పక్కాగా రూపొందించినప్పుడు నియంత్రణ సాధ్యం అవుతుంది. ఇది ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఆదాయాన్ని తెస్తుంది. ఎక్సైజ్ విభాగం ఆదాయానికి దగ్గరగా ఉంటుంది. క్రీడలపై పెడుతున్న బెట్టింగ్‌ డబ్బు మనసును కదిలించేలా ఉంటుంది' అని అజిత్‌ సింగ్‌ పేర్కొన్నారు.

బెట్టింగ్ చట్టబద్ధం కావాలి:

బెట్టింగ్ చట్టబద్ధం కావాలి:

'బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయడాన్ని ప్రభుత్వం పరిశీలించాలి. అలాంటప్పుడే నియంత్రణకు అవకాశం ఉంటుంది. బెట్టింగ్ చట్టబద్ధం కావాలని నేను ప్రత్యేకంగా చెప్పను, కాని దానిని పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుతం బెట్టింగ్‌ చట్టబద్ధం కాదు. ఒక్కసారి చట్టం చేశారంటే ఎవరు బెట్టింగ్‌ చేస్తున్నారు?, ఎంత చేస్తున్నారో కూడా డేటా లభిస్తుంది. దాంతో చట్టవ్యతిరేకులకు కష్టం అవుతుంది' అని అజిత్‌ సింగ్‌ తెలిపారు.

Story first published: Wednesday, September 18, 2019, 8:44 [IST]
Other articles published on Sep 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X