న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కారణం తెలిస్తే షాకవుతారు: డే-నైట్ టెస్టుకు ధోని కామెంటేటర్‌గా రావడం లేదు!

India vs Bangladesh 2019 : Dhoni Unlikely To Commentate In Day-Night Test At Eden Gardens
MS Dhoni unlikely to commentate in day-night Test vs Bangladesh

హైదరాబాద్: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న డే-నైట్ టెస్టు‌కు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కామెంటేటర్‌గా వ్యవహరించే అవకాశం లేదని అతడి సన్నిహిత వర్గాలు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి తెలిపాయి. భారత పర్యటనలో బంగ్లాదేశ్‌ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనున్న సంగతి తెలిసిందే.

నవంబర్‌ 22 నుంచి కోల్‌కతా వేదికగా రెండో టెస్టుని డే-నైట్ టెస్టుగా ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అంగీకరించింది. దీంతో భారత్ తొలిసారిగా డే-నైట్ టెస్టుకు ఆతిథ్యమిస్తోన్న తరుణంలో ఈ మ్యాచ్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని బీసీసీఐతో పాటు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తమవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

టీమిండియాకు సేవలందించిన టెస్టు కెప్టెన్లను అందరినీ ఆహ్వానించి వారి అనుభవాలను పంచుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా డే-నైట్ టెస్టులో ధోని కామెంటేటర్‌గా వ్వవహారించడంపై హోస్ట్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ బీసీసీఐకి ప్రతిపాదన పంపినప్పటికీ బోర్డు ఇంకా స్పందించలేదు. బీసీసీఐ అనుమతి ఇవ్వడమే తరువాయి.

బీసీసీఐ అధికార ప్రతినిధి మాట్లాడుతూ

బీసీసీఐ అధికార ప్రతినిధి మాట్లాడుతూ

ఈ విషయమై బీసీసీఐ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ "అవును, బ్రాడ్‌కాస్టర్లు ప్రతిపాదన పంపారు. కానీ, ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. బీసీసీఐ అనుమతిస్తే ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే మ్యాచ్‌లో ధోనీని కామెంటేటరి బాక్స్‌లో చూడొచ్చు" అని తెలిపాడు. అయితే, ఇక్కడ ఒక చిక్కొచ్చిపడింది.

పరస్ఫర విరుద్ధ ప్రయోజనాల సెగ

పరస్ఫర విరుద్ధ ప్రయోజనాల సెగ

ప్రస్తుత బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం, ధోని కామెంటేటర్‌గా వ్వవహారిస్తే అది పరస్ఫర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుంది. దీంతో డే-నైట్ టెస్టులో ధోని కామెంటేటర్‌గా వ్యవహరించే అవకాశం లేదని అతడి సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జూలైలో జరిగిన వరల్డ్‌కప్ సెమీఫైనల్ తర్వాత ధోని రెండు నెలల పాటు క్రికెట్ నుంచి విరామం తీసుకున్నాడు.

బీసీసీఐ కాంట్రాక్టు ఆటగాడిగానే కొనసాగుతోన్న ధోని

బీసీసీఐ కాంట్రాక్టు ఆటగాడిగానే కొనసాగుతోన్న ధోని

అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరామం తీసుకున్నప్పటికీ ధోని బీసీసీఐ కాంట్రాక్టు ఆటగాడిగానే కొనసాగుతున్నాడు. చారిత్రాత్మక ఈడెన్‌ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌కు తొలి టెస్టు కావడంతో.. ఈ టెస్టును వీక్షించాల్సిందింగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, బంగ్లా ప్రధాని షేక్‌ హసీనాలకు కూడా ఇప్పటికే ఆహ్వానం పంపిన సంగతి తెలిసిందే.

భారత్-బంగ్లా ప్రధానులకు ఆహ్వానం

భారత్-బంగ్లా ప్రధానులకు ఆహ్వానం

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్వయంగా టెస్టు మ్యాచ్‌ను వీక్షించాల్సిందిగా ఇరు దేశాల ప్రధానులకు ఆహ్వానించారు. అయితే, మ్యాచ్‌లకు ఇలా దేశ ప్రధానులను ఆహ్వానించడం ఇదే తొలిసారి కాదు. 2011 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో భాగంగా భారత్‌-పాక్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌కు అప్పటి ప్రధానులు మన్మోహన్‌ సింగ్‌, యూసఫ్‌ రజా గిలానీలు హాజరైన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, November 6, 2019, 19:30 [IST]
Other articles published on Nov 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X