న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PHOTOS: 3-0తో సిరిస్ క్లీన్ స్వీప్: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ధోని సందడి

MS Dhoni Spotted In Dressing Room After India's Win Over South Africa In Ranchi || Oneindia Telugu
 MS Dhoni spotted in dressing room after Indias win over South Africa in Ranchi

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో సందడి చేశాడు. ధోని సొంత రాష్ట్రమైన జార్ఖండ్‌ భారత్-దక్షిణాఫ్రికా మూడో టెస్టుకు ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.

దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికాపై 3-0తో సిరిస్‌ను గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో మూడో టెస్టు మ్యాచ్ అనంతరం ధోని టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో సందడి చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.

<strong>3-0తో క్లీన్‌స్వీప్:కెప్టెన్‌గా అజహర్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ,డుప్లెసిస్ చెత్త రికార్డు</strong>3-0తో క్లీన్‌స్వీప్:కెప్టెన్‌గా అజహర్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ,డుప్లెసిస్ చెత్త రికార్డు

132/8 ఓవర్‌నైట్‌ స్కోరుతో

132/8 ఓవర్‌నైట్‌ స్కోరుతో

మంగళవారం నాలుగో రోజు ఆటలో భాగంగా 132/8 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఇన్నింగ్స్‌ ఆరంభించిన దక్షిణాఫ్రికా మరో ఒక పరుగు మాత్రమే సాధించి ఆలౌటైంది. కేవలం 12 బంతుల్లోనే దక్షిణాఫ్రికా చివరి రెండు వికెట్లను కోల్పోయింది. డి బ్రుయిన్‌(30) తొమ్మిదో వికెట్‌గా పెవిలియన్‌ చేరగా,. లుంగీ ఎంగిడి డకౌటయ్యాడు. చివరి రెండు వికెట్లు నదీమ్‌‌కే దక్కాయి.

డ్రెస్సింగ్ రూమ్‌లో ధోని సందడి

రాంచీ వేదికగా జరిగిన మూడో టెస్టులో జార్ఖండ్‌కు చెందిన లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేశాడు. ఈ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో షాబాజ్ నదీమ్‌తో ధోని కాసేపు ముచ్చటించాడు. ఈ ఫోటోను బీసీసీఐ తన ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ "చూడండి... ఇక్కడ ఎవరున్నారో" అనే కామెంట్‌ పెట్టింది.

చివరగా వరల్డ్‌కప్‌లో

చివరగా వరల్డ్‌కప్‌లో

ఇంగ్లాండ్‌ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో ధోని టీమిండియా విజయం కోసం ఆఖరి వరకు పోరాడాడు. చివర్లో ధోని రనౌట్ కావడంతో టీమిండియా ఓడిపోయింది. ఆ తర్వాత భారత ఆర్మీకి సేవలందించేందుకు గాను ధోని రెండు నెలలు పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు.

బంగ్లా పర్యటనకు దూరం

బంగ్లా పర్యటనకు దూరం

ఆ తర్వాత విండిస్ పర్యటన నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న దక్షిణాఫ్రికా సిరీస్‌కు కూడా ధోనీ అందుబాటులో లేడు. వచ్చే నెలలో బంగ్లాదేశ్ జట్టు టీ20 సిరిస్ కోసం భారత పర్యటనకు రానుంది. బంగ్లాదేశ్‌తో జరగనున్న ఈ సిరిస్‌కు ధోని అందుబాటులో ఉండటం లేదని వార్తలు వచ్చాయి.

రవిశాస్త్రితో ధోని

అంతకముందు ధోని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రిని కలిశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను రవిశాస్త్రి తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా రవిశాస్త్రి "అద్భుతమైన సిరిస్ విజయం తర్వాత నిజమైన లెజెండ్‌ను కలుసుకోవడం సంతోషంగా ఉంది" అని కామెంట్ పెడుతూ ధోనితో కలిసి దిగిన ఫోటోను పోస్టు చేశాడు.

ధోని భవితవ్యంపై గంగూలీ ఇలా

ధోని భవితవ్యంపై గంగూలీ ఇలా

ఇటీవలే ధోని భవితవ్యంపై అతడితో చర్చిస్తానని బీసీసీఐకి కాబోయే అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించిన సంగతి తెలిసిందే. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ అక్టోబర్ 23న అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నాడు. అక్టోబర్‌ 24న సెలక్టర్లతో సమావేశం కానున్న గంగూలీ "అక్టోబర్‌ 24న సెలక్టర్లతో సమావేశమవుతా. ధోనీ భవితవ్యంపై సెలక్టర్లు అభిప్రాయాలను తెలుసుకుంటా. అనంతరం ధోనీతో కూడా స్వయంగా మాట్లాడి.. అతడు ఏమి ఆశిస్తున్నాడో తెలుసుకుంటా" అని అన్నాడు.

Story first published: Tuesday, October 22, 2019, 12:54 [IST]
Other articles published on Oct 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X