హైదరాబాద్: మ్యాచ్‌లు ముగించే విషయంలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనిపై అతిగా ఆధారపడొద్దని టీమిండియా మాజీ హెడ్ కోచ్‌అనిల్ కుంబ్లే సూచించారు. టీమిండియా మిడిలార్డర్ ఇంకా కుదురుకున్నట్టు కనిపించకపోవడంతో వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని కుంబ్లే ఈ వ్యాఖ్యలు చేశాడు.
భారత్ Vs వెస్టిండిస్: నమోదయ్యే రికార్డులివే, కోహ్లీ ఖాతాలో మరో మైలురాయి
తాను గొప్ప స్పిన్నర్ కాకున్నప్పటికీ వికెట్లు తీసినందుకు చాలా సంతోషంగా ఉందని కుంబ్లే పేర్కొన్నాడు. మద్రాస్ ఐఐటీ పూర్వవిద్యార్థుల 'సంగం'లో కుంబ్లే మాట్లాడుతూ "నేను బంతిని స్పిన్ చేయనని 18 ఏళ్లకు పైగా బ్యాట్స్‌మెన్ గుర్తించనందుకు ఆనందంగా ఉంది" అని నవ్వుతూ చెప్పడం విశేషం. కెరీర్ తొలినాళ్లలో కుంబ్లే స్పిన్ బాగా చేయలేడన్న విమర్శ లొచ్చాయి.
దీంతో కుంబ్లే మద్రాస్ ఐఐటీ మైదానంలో వారానికి ఐదు రోజులు స్పిన్ దిగ్గజం వీవీ కుమార్ ఆధ్వర్యంలో లెగ్‌స్పిన్ ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత ఇరానీ ట్రోఫీలో ముంబైతో జరిగిన మ్యాచ్ అనిల్ కుంబ్లే క్రికెట్ కెరీర్‌నే మలుపు తిప్పింది. ఆ మ్యాచ్‌లో ముంబై 190 పరుగులు ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది.
మా జట్టు తిరిగి పోటీలోకి రావాలంటే ముంబైని 100 పరుగుల్లోపే ఆలౌట్ చేయాలి. ఆ ఇన్నింగ్స్‌లో నేను ఏడు వికెట్లు తీశా. ముంబై 90 పరుగులకు ఆలౌటైందని అప్పటి సంగతులను కుంబ్లే గుర్తు చేసుకున్నాడు. అయినప్పటికీ, మా జట్టు 40 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆ మ్యాచ్‌లో తన ప్రదర్శన తనలో ఆత్మవిశ్వాసం పెంచిందని కుంబ్లే తెలిపాడు.
యువ ఆటగాళ్లు మ్యాచ్‌లను ముగించేలా ప్రోత్సహిస్తూ ధోని ఆటను ఆస్వాదించాలని కుంబ్లే తెలిపాడు. అజహరుద్దీన్, సౌరవ్ గంగూలీ తనకు ఇష్టమైన కెప్టెన్లు అని, తన భార్యకు మాత్రం ధోనీ అంటే ఇష్టమని, ఎప్పుడు కలిసినా అతడితో ఓ ఫొటో తీసుకుంటుందని కుంబ్లే తెలిపాడు.