ధోనీ వికెట్ కీపింగ్ చేయడట, భారత మాజీ కెప్టెన్‌పై ఫీల్డింగ్ కోచ్..

Posted By: Subhan
MS Dhoni's wicketkeeping style is not classical but it works well for him: R Sridhar

హైదరాబాద్: ధోనీ మ్యాచ్‌లో ఉన్నాడంటే ప్రతి వికెట్ తీయడం వెనుక మాజీ కెప్టెన్ వ్యూహం ఉందంటూ మధ్య వార్తలు వస్తూనే ఉంటాయి. వాటిని బలపరుస్తూ భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ చేసేది సంప్రదాయ వికెట్ కీపింగ్ కాదని టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ వ్యాఖ్యానించాడు. దక్షిణాఫ్రికాతో మంగళవారం సాయంత్రం 4.30 నుంచి ఐదో వన్డే జరగనున్న నేపథ్యంలో భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ మీడియాతో మాట్లాడాడు.

'మహేంద్రసింగ్ ధోనీ మ్యాచ్‌కి ముందు నెట్స్‌లో అసలు వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేయడు. కానీ.. మ్యాచ్‌లో మాత్రం కళ్లుచెదిరే రీతిలో రనౌట్లు, మెరుపు స్టంపౌట్‌లు చేస్తుంటాడు. అతనికి ఒక సొంత వికెట్ కీపింగ్ శైలి ఉంది. అది సంప్రదాయబద్ధంగా లేదు. కానీ.. అద్భుతాలు చేస్తున్నాడు' అంటూ కొనియాడాడు.

అతని స్టైలే వేరు:
ధోనీ వికెట్ కీపింగ్ గురించి ఇంకా మాట్లాడుతూ.. 'ఆ స్టైల్ అతనికే సెట్ అవుతుందేమో..? అందుకే.. ఇప్పటికీ ఏ యువ క్రికెటర్‌ కూడా అతనికి పోటీ ఇవ్వలేకపోతున్నాడు' అని ఆర్. శ్రీధర్ అభిప్రాయపడ్డాడు. ఇలా ధోనీ వికెట్ కీపింగ్‌ శైలిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వన్డేల్లో ఇటీవల 400 ఔట్లలో పాలుపంచుకున్న తొలి భారత క్రికెటర్‌గా మహేంద్రసింగ్ ధోనీ సరికొత్త రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. కెరీర్‌లో ఇప్పటి వరకు 316 వన్డేలాడిన మహేంద్రసింగ్ ధోని 295 క్యాచ్‌లు, 106 స్టంపింగ్‌లు చేశాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, February 13, 2018, 10:51 [IST]
Other articles published on Feb 13, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి