న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్‌లో ధోని పాత్ర కీలకం, ఆటను ఎంజాయ్‌ చేస్తే కప్‌ మనదే: రవిశాస్త్రి

ICC Cricket World Cup 2019: Ravi Shastri : If We Play To Our Potential,Trophy Might Be Back Here
MS Dhonis Role Massive, Will Be Big Player In World Cup 2019: Ravi Shastri

హైదరాబాద్: మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పాత్ర కీలకమని హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశాడు. ఈ మెగా ఈవెంట్ కోసం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా బుధవారం ఇంగ్లాండ్‌కు పయనం కానుంది. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్ సన్నద్ధతపై మంగళవారం కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి వివరాలు వెల్లడించారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ సందర్భంగా రవిశాస్త్రి మాట్లాడుతూ "ఆటను ఎంజాయ్ చేస్తే కప్పు మనదే. వరల్డ్‌కప్‌ లాంటి టోర్నీల్లో ఎంజాయ్‌ చేస్తూ క్రికెట్‌ ఆడాలి. సామ‌ర్థ్యం మేరకు రాణిస్తే వరల్డ్‌కప్ మనదే. ఈ టోర్నీలో గట్టిపోటీనే ఉంటుంది. 2015తో పోలిస్తే బంగ్లాదేశ్‌, అఫ్గనిస్థాన్‌ జట్లు చాలా బలమైన జట్లుగా అవతరించాయి" అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

ధోనీ పాత్ర చాలా కీలకం

ధోనిపై అడిగిన ప్రశ్నకు "ఈ టోర్నీలో ధోనీ పాత్ర చాలా కీలకం. ఈ ఫార్మాట్‌లో అతనికన్నా గొప్ప ఆటగాడు ఎవరూ లేరు. క్లిష్ట పరిస్థితుల్లో మ్యాచ్‌ను మలుపుతిప్పే క్షణాల్లో అతడి అనుభవం చాలా ఉపయోగపడుతుంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో అతనొక గొప్ప క్రికెటర్‌" అని రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు.

కోహ్లీ మాట్లాడుతూ

విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ""ఈ వరల్డ్‌కప్ ఛాలెంజింగ్ వరల్డ్‌కప్. టోర్నీలో పాల్గొనే ఏ జట్టైనా మిగతా జట్టుపై గెలవొచ్చు. ఇంగ్లాండ్ పరిస్థితులకు త్వరగా అలవాటు పడాలి. ఈ వరల్డ్‌కప్‌లో అన్ని రకాల స్కోర్లను అంచనా వేస్తున్నాం. కొన్ని మ్యాచ్‌ల్లో అత్యధిక స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది" అని కోహ్లీ అన్నాడు.

జట్టంతా ఆటపై ఫోకస్ పెట్టింది

"ఈ వరల్డ్‌కప్‌లో జట్టంతా ఆటపై ఫోకస్ పెట్టింది. అసలు ప్రత్యర్ధి ఎవరనేది ఆలోచన చేయడం లేదు. ఈ వరల్డ్‌కప్‌లో ఒత్తిడిని ఎదుర్కోవడం అత్యంత ముఖ్యం. మా బౌలర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. ఐపీఎల్ ఆడటం వల్ల అలసిపోలేదు. డే/నైట్‌ మ్యాచ్‌ లేదా డే మ్యాచ్‌ అనేది పెద్ద విషయం కాదు. మంచి క్రికెట్‌ ఆడాలన్నదానిపైనే మా దృష్టి అంతా" అని కోహ్లీ తెలిపాడు.

11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు

11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు

వరల్డ్‌కప్ క్యాంపెయిన్‌కు ముందు టీమిండియా న్యూజిలాండ్(మే 25), బంగ్లాదేశ్‌(మే 28)న రెండు వార్మప్ మ్యాచ్‌లను ఆడనుంది. ఇక, టోర్నీలో భాగంగా జూన్ 5న దక్షిణాప్రికాతో కోహ్లీసేన తన తొలి మ్యాచ్‌ని ఆడనుంది. వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి. ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి.

Story first published: Tuesday, May 21, 2019, 18:32 [IST]
Other articles published on May 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X