న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్టంప్స్ వెనుక ధోని అనుభవం ఎంతో కీలకం: కోహ్లీ కెప్టెన్సీపై సచిన్

MS Dhonis role behind the stumps critical for Virat Kohli: Sachin Tendulkar

హైదరాబాద్: వరల్డ్‌కప్‌లో స్టంప్స్ వెనుక ధోని పాత్ర ఎంతో కీలకమని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సూచించాడు. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సచిన్ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

"ముందుగా.. ఐపీఎల్‌ను అంతర్జాతీయ క్రికెట్‌తో సరిపోల్చకూడదు. ఈ రెండు కూడా భిన్నమైన ఫార్మెట్లు. ఐపీఎల్ టీ20 టోర్నీ... అంతేకాదు జట్టులో విదేశీ ఆటగాళ్లు కూడా ఉంటారు. అదే వరల్డ్ కప్ జట్టులో అందరూ భారత్‌కు చెందిన సహాచర క్రికెటర్లు ఉంటారు. కాబట్టి రెండింటినీ పోల్చకూడదు" అని సచిన్ అన్నాడు.

ధోని అనుభవం

ధోని అనుభవం

కోహ్లీ విషయానికి వస్తే నాయకత్వంలో నిబద్ధతతో పనిచేస్తాడని సచిన్ అన్నాడు. వరల్డ్‌కప్‌లో ధోని అనుభవం గురించి కూడా సచిన్ స్పందించాడు. "వికెట్‌ కీపర్‌గా ధోని అనుభవం, సమయస్ఫూర్తి టీమిండియాకు ఎంతో కీలకం. స్టంప్స్‌ వెనకాల నిలబడి అతడు మైదానాన్ని మొత్తం పరిశీలిస్తాడు. బ్యాట్స్‌మెన్‌ తీరును పసిగట్టగలడు" అని సచిన్ తెలిపాడు.

ధోనీనే బంతిని బాగా గమనిస్తాడు

ధోనీనే బంతిని బాగా గమనిస్తాడు

"బౌలర్‌ బంతి వేయడం ప్రారంభించాక బ్యాట్స్‌మెన్‌ కంటే ధోనీనే బంతిని బాగా గమనిస్తాడు. అందుకే స్టంప్స్‌ వెనక ఎంతో అనుభవమున్న ధోనీ టీమిండియాకు బోనస్‌" అని సచిన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ వరల్డ్‌కప్‌లో టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించేది టాప్-3 బ్యాట్స్‌మెనే అని సచిన్ అన్నాడు.

కోహ్లీ కెప్టెన్సీ గురించి

కోహ్లీ కెప్టెన్సీ గురించి

కోహ్లీ కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ "కోహ్లీ కెప్టెన్సీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఐపీఎల్‌లో విఫలమైనంత మాత్రాన అతడి నైపుణ్యాన్ని విమర్శించడం, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం సరికాదు" అని సచిన్ అన్నాడు. టోర్నీలో భాగంగా శనివారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ ప్రారంభమైంది.

మొత్తం 10 జట్లు

మొత్తం 10 జట్లు

టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. టోర్నీలో భాగంగా కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా జూన్‌ 5న సౌతంప్టన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో తన తొలి మ్యాచ్‌ ఆడనుంది. వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి.

Story first published: Saturday, May 25, 2019, 16:09 [IST]
Other articles published on May 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X