న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సాధించడానికి ఏమీ లేదు: ధోని రిటైర్మెంట్ వార్తలపై విశ్వనాథన్ ఆనంద్

MS Dhoni retirement speculations: Dhoni has nothing left to achieve, says chess wizard Anand

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గురువారం చేసిన ఓ ట్వీట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ఊహాగానాలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ వార్తలపై విశ్వనాథన్ ఆనంద్ స్పందించాడు. తన కెరీర్‌లో ధోని సాధించడానికి ఇంక ఏమీ మిగల్లేదని ఆయన అన్నారు.

చెన్నైలో పీటీఐతో ఆయన మాట్లాడుతూ "అతనికి (ధోని) సరైన నిర్ణయం ఏమిటో తెలుసు. తన కెరీర్‌లో అతడు సాధించడానికి ఇంక ఏమీ మిలిగి ఉందని నేను భావించడం లేదు. అతనికి అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఏదైతో అతను సాధించడానికి నిర్దేశించబడిందో ప్రతిదాన్ని సాధించాడు " అని అన్నారు.

ధోని రిటైర్మెంట్ వార్తలపై స్పందించిన ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ధోని రిటైర్మెంట్ వార్తలపై స్పందించిన ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్

"కెప్టెన్‌గా భారత్‌కు రెండు ప్రపంచ కప్‌లు (2007 వరల్డ్ టి20, 2011 వన్డే వరల్డ్‌కప్) అందించాడు. అతనొక గొప్ప కెప్టెన్. అతను ఎప్పుడు నిష్క్రమించాలో ఎవరూ నిర్ణయించలేరు. అతను ఏమి చేయాలనుకుంటున్నాడో అందరికంటే అతడికే బాగా తెలుసు. అతడు సాధించడానికి ఏమీ లేదు. అతడు గొప్ప కెరీర్‌ను కలిగి ఉన్నాడు" అని ఐదు సార్లు వరల్డ్ చెస్ ఛాంపియన్ కొనియాడాడు.

కాగా, సందర్భమేమీ లేకపోయినా 2016 టీ20 వరల్డ్‌కప్‌లో ధోనీతో కలిసి ఆడిన మ్యాచ్ గుర్తు చేసుకుంటూ విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడనే ఊహాగానాలకు తెరలేపింది. "ఆ మ్యాచ్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ మనిషి ఫిట్‌నెస్ టెస్ట్‌లో పరిగెత్తించినట్టు నన్ను పరిగెత్తించాడు" అంటూ ధోనీని ట్యాగ్ చేస్తూ కోహ్లీ కామెంట్ పెట్టాడు.

ఇప్పటికే జట్టు మేనేజ్‌మెంట్‌కు తన నిర్ణయాన్ని చెప్పేశాడని... గురువారం తన నిర్ణయాన్ని మీడియా సమావేశంలో వెల్లడించనున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. ఈ వార్తలపై దక్షిణాఫ్రికాతో టెస్టు సిరిస్‌కు జట్టుని ప్రకటించే సమయంలో ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించాడు. ధోనీ రిటైర్మెంట్‌ అంశానికి సంబంధించి తమకు ఎటువంటి సమాచారం అందలేదని తెలిపిన ఎమ్మెస్కే ప్రసాద్.. ధోని రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు.

ఇప్పటికే టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన ధోని.. పరిమిత ఓవర్ల క్రికెట్‌ మాత్రమే ఆడుతున్నాడు. అయితే గత కొద్దికాలంగా పేలవ ఫామ్‌తో బ్యాటింగ్‌లో విఫలమవుతున్న ధోనిపై విమర్షల వర్షం కురుస్తోంది. ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత భారత ఆర్మీకి సేవలందించాలనే ఉద్దేశంతో రెండు నెలల పాటు ధోని క్రికెట్‌ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నాడు.

Story first published: Thursday, September 12, 2019, 18:48 [IST]
Other articles published on Sep 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X