న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోని రిటైర్మెంట్ వార్తలపై స్పందించిన ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్

MS Dhoni's Retirement News Incorrect Says Chief Selector MSK Prasad
MS Dhoni retirement rumours: MSK Prasad clears the air

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్‌పై ఎలాంటి అప్‌డేట్ లేదని, సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు పూర్తిగా అబద్ధమని టీమిండియా ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గురువారం చేసిన ఓ ట్వీట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ఊహాగానాలకు తావిచ్చిన సంగతి తెలిసిందే.

సందర్భమేమీ లేకపోయినా 2016 టీ20 వరల్డ్‌కప్‌లో ధోనీతో కలిసి ఆడిన మ్యాచ్ గుర్తు చేసుకుంటూ విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడనే ఊహాగానాలకు తెరలేపింది. 2016 వరల్డ్ టీ20లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించిన ఫోటోని కెప్టెన్ విరాట్ కోహ్లీ గురువారం అభిమానులతో పంచుకున్నాడు.

ఆ మ్యాచ్‌ను ఎప్పటికీ మర్చిపోలేను

ఆ మ్యాచ్‌ను ఎప్పటికీ మర్చిపోలేను

"ఆ మ్యాచ్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ మనిషి ఫిట్‌నెస్ టెస్ట్‌లో పరిగెత్తించినట్టు నన్ను పరిగెత్తించాడు" అంటూ ధోనీని ట్యాగ్ చేస్తూ విరాట్ కోహ్లీ కామెంట్ పెట్టాడు. గురువారం రాత్రి 7 గంటలకు ధోని మీడియా సమావేశం నిర్వహించడానికి కూడా సిద్ధమయ్యాడనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.

జట్టు మేనేజ్‌మెంట్‌కు తన నిర్ణయాన్ని చెప్పేశాడని

జట్టు మేనేజ్‌మెంట్‌కు తన నిర్ణయాన్ని చెప్పేశాడని

ఇప్పటికే జట్టు మేనేజ్‌మెంట్‌కు తన నిర్ణయాన్ని చెప్పేశాడని... గురువారం తన నిర్ణయాన్ని మీడియా సమావేశంలో వెల్లడించనున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. ఈ వార్తలపై దక్షిణాఫ్రికాతో టెస్టు సిరిస్‌కు జట్టుని ప్రకటించే సమయంలో ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించాడు.

ధోనీ రిటైర్మెంట్‌ అంశానికి సంబంధించి సమాచారం లేదన్న ఎమ్మెస్కే

ధోనీ రిటైర్మెంట్‌ అంశానికి సంబంధించి సమాచారం లేదన్న ఎమ్మెస్కే

ధోనీ రిటైర్మెంట్‌ అంశానికి సంబంధించి తమకు ఎటువంటి సమాచారం అందలేదని తెలిపిన ఎమ్మెస్కే ప్రసాద్.. ధోని రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు. దక్షిణాఫ్రికాతో సెప్టెంబర్ 15న దక్షిణాఫ్రితో జరగనున్న టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో ధోనీకి చోటు దక్కలేదు. దీంతో ధోనీ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు వార్తలు వచ్చాయి.

టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన ధోని!

టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన ధోని!

ఇప్పటికే టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన ధోని.. పరిమిత ఓవర్ల క్రికెట్‌ మాత్రమే ఆడుతున్నాడు. అయితే గత కొద్దికాలంగా పేలవ ఫామ్‌తో బ్యాటింగ్‌లో విఫలమవుతున్న ధోనిపై విమర్షల వర్షం కురుస్తోంది. ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత భారత ఆర్మీకి సేవలందించాలనే ఉద్దేశంతో రెండు నెలల పాటు ధోని క్రికెట్‌ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నాడు.

Story first published: Thursday, September 12, 2019, 18:24 [IST]
Other articles published on Sep 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X