న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి గోల్ప్‌ టోర్నమెంట్‌.. బ్యాట్ వదిలి గోల్ఫ్‌ స్టిక్‌ పట్టిన ధోనీ

MS Dhoni Plays First Golf Tournament in American Club on September 13

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్ ధోనీ బ్యాట్ వదిలి గోల్ఫ్‌ స్టిక్‌ పట్టాడు. అదేంటి ధోనీ క్రికెట్ ఆటను వదిలేసాడా? అని ఆశ్చర్యపోతున్నారా. అదేం లేదండి.. విరామ సమయంలో సరదాగా గోల్ప్‌ టోర్నమెంట్‌ ఆడాడు. ప్రపంచకప్‌ అనంతరం పూర్తి విరామ తీసుకుంటున్న ధోనీ గోల్ప్‌ ఆట ఆడాడు.

<strong>దేశంకోసం ప్రపంచకప్ గెలిచినప్పుడు ఆ ఆనందం మాటల్లో చెప్పలేం: యువీ</strong>దేశంకోసం ప్రపంచకప్ గెలిచినప్పుడు ఆ ఆనందం మాటల్లో చెప్పలేం: యువీ

రిటైర్మెంట్‌పై ఎలాంటి క్లారిటీ లేదు:

రిటైర్మెంట్‌పై ఎలాంటి క్లారిటీ లేదు:

ప్రపంచకప్‌ అనంతరం ధోనీ తన రిటైర్మెంట్‌పై ఎలాంటి నిర్ణయం తెలపలేదు. దీంతో అతడి భవితవ్యంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడానని అభిమానులు ఆందోళనలో ఉన్నారు. మరోవైపు ధోనీ ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో.. రిటైర్మెంట్‌పై తన నిర్ణయాన్ని ఆలోచించి త్వరగా ప్రకటించాలని మాజీలు ఘాటుగానే స్పందిస్తున్నారు. అయినా కూడా ధోనీ ఇప్పటివరకు తన రిటైర్మెంట్‌పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

బ్యాట్ వదిలి గోల్ఫ్‌ స్టిక్‌ పట్టిన ధోనీ:

బ్యాట్ వదిలి గోల్ఫ్‌ స్టిక్‌ పట్టిన ధోనీ:

ఇదిలా ఉంటే.. ధోనీ బ్యాటుని వదిలి అమెరికాలో గోల్ఫ్‌ స్టిక్‌ పట్టుకున్నాడు. అమెరికా క్లబ్‌లో సెప్టెంబర్ 13 తన తొలి గోల్ప్‌ టోర్నమెంట్‌ ఆడాడు. గోల్ప్‌ ఆడడమే కాదు.. స్థానిక ఆటగాడు రాజీవ్‌ శర్మతో కలిసి ఫ్లైట్‌ కేటగిరీలో రెండో స్థానంలో నిలవడం విశేషం. ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు సార్లు ధోనీ విజయం సాధించాడు. క్రికెట్ ఆటలోనే కాదు.. గోల్ఫ్‌లో కూడా ధోనీ దిట్టే. మెటుచన్ గోల్ఫ్‌, కంట్రీ క్లబ్‌లో ధోనీ గౌరవ సభ్యుడిగా ఉన్నాడు. ఈ క్లబ్‌కు ధోనీని మూడేళ్ల క్రితం రాజీవ్‌ శర్మనే పరిచయం చేశాడు.

విరామాన్ని పొడిగించనున్న ధోనీ:

విరామాన్ని పొడిగించనున్న ధోనీ:

ప్రపంచకప్‌ సెమీస్‌ ఓటమి అనంతరం ధోనీ క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత ఆర్మీకి సేవ చేసేందుకు వెస్టిండీస్‌ పర్యటనకు దూరమయ్యాడు. సైనిక శిక్షణ ముగించిన తర్వాత స్వదేశంలో సఫారీలతో ముగిసిన టీ20 ఫార్మాట్‌కు కూడా అందుబాటులో లేడు. అంతేకాకుండా దేశవాళీ వన్డే టోర్నమెంట్‌ విజయ్‌ హజారె, నవంబర్‌లో జరగనున్న బంగ్లా సిరీస్‌కు కూడా ధోనీ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం తెలుస్తోంది.

కొత్త కారులో ధోనీ షికారు:

కొత్త కారులో ధోనీ షికారు:

ధోనీ తన విరామ సమయాన్ని మాత్రం కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల కొన్న 'రెడ్‌బీస్ట్‌' జీప్‌ చెరోకీ ట్రాక్‌హక్‌ ఎస్‌యూవీని ధోనీ తొలిసారి నడిపాడు. ధోనీ రాంచీలో కారు నడుపుతూ అభిమానుల కంట పడ్డాడు. ధోనీ జీపు నడుపుతున్న ఫొటోలు వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమెరికా పర్యటన అనంతరం రాంచీ చేరుకున్న ధోనీని.. విమానాశ్రయంలో రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వారితో కలిసి మహీ కారులో వెళ్లాడు.

Story first published: Wednesday, September 25, 2019, 11:19 [IST]
Other articles published on Sep 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X