న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తెలివైన క్రికెటర్‌, ధోని అంకితభావం గురించి ఎంత చెప్పినా తక్కువే: కోహ్లీ

MS Dhoni most intelligent cricketer, nobody more committed to Indian cricket than him: Virat Kohli

హైదరాబాద్: భారత క్రికెట్‌ పట్ల ధోనికి ఉన్న అంకితభావం గురించి ఎంత చెప్పినా తక్కువేనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా శుక్రవారంతో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు బాదిన ధోని 193 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

సచిన్‌లో కోపాన్ని చూశా.. కానీ, ధోనిలో ఇంతవరకు కనిపించలేదు: శాస్త్రిసచిన్‌లో కోపాన్ని చూశా.. కానీ, ధోనిలో ఇంతవరకు కనిపించలేదు: శాస్త్రి

మూడో వన్డేలో మహేంద్రసింగ్ ధోని (87 నాటౌట్), కేదార్ జాదవ్ (61 నాటౌట్) హాఫ్ సెంచరీలు సాధించడంతో 231 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకుంది. అంతేకాదు ఆస్ట్రేలియా గడ్డపై ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ గెలవడం భారత్‌కు ఇదే తొలిసారి.

తొలి జట్టుగా టీమిండియా అరుదైన ఘనత

తొలి జట్టుగా టీమిండియా అరుదైన ఘనత

ఒక్క ఫార్మాట్లో కూడా సిరీస్‌ కోల్పోకుండా ఆసీస్‌ పర్యటనను ముగించిన తొలి జట్టుగా టీమిండియా అరుదైన ఘనత సాధించింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "ధోని పరుగులు చేయడంపై జట్టంతా సంతోషంగా ఉంది. ఆత్మవిశ్వాసం తిరిగి పెంపొందించుకోవాలన్నా పరుగులు చేయడం చాలా ముఖ్యం. బయట చాలా మాట్లాడుకుంటారు. విమర్శలు చేస్తారు" అని అన్నాడు.

ధోనికి ఉన్న అంకితభావం గురించి

"భారత క్రికెట్‌ పట్ల ధోనికి ఉన్న అంకితభావం గురించి ఎంత చెప్పినా తక్కువే. ధోనీకి ఉన్న అంకితభావం గురించి మాకు తెలుసు. అతనిలా నిబద్ధత ఉన్న క్రికెటర్‌ మరొకరు లేరు. దేశం కోసం ఎంతో చేసిన అతణ్ని స్వేచ్ఛగా వదిలేయాలి. జట్టు కోసం ఏం చేయాలో అతనికి బాగా తెలుసు. ధోని తెలివైన క్రికెటర్‌" అని కోహ్లీ వెల్లడించాడు.

నేను కూడా ఆశ్చర్యపోయేవాడినేమో

నేను కూడా ఆశ్చర్యపోయేవాడినేమో

"ఈ పర్యటన చాలా అద్భుతంగా గడిచింది. రెండు ఫార్మాట్‌లు గెలిచి మూడో దాంట్లో సమంగా నిలిచాం. ఆస్ట్రేలియా రావడానికి ముందు ఇలాంటి ఫలితం గురించి ఎవరైనా చెప్పి ఉంటే నేను కూడా ఆశ్చర్యపోయేవాడినేమో" అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఈ సిరిస్‌లో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌' గెలవడంతో అత్యంత పెద్ద వయసు (37 ఏళ్ల 195 రోజులు)లో ఈ అవార్డు గెలిచిన భారత ఆటగాడిగా ధోని నిలిచాడు.

మూడో వన్డేలో నాలుగో స్థానంలో

మూడో వన్డేలో నాలుగో స్థానంలో

గవాస్కర్‌ (37 ఏళ్ల 191 రోజులు, 1987లో శ్రీలంకపై) రికార్డును ధోని బద్దలు కొట్టాడు. తొలి రెండు వన్డేల్లోనూ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన ధోని.. మూడో వన్డేలో అంబటి రాయుడిపై వేటు పడటంతో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు.

Story first published: Saturday, January 19, 2019, 15:03 [IST]
Other articles published on Jan 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X