న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇమ్రాన్ తాహిర్ వికెట్ తీసిన సంబరాలపై ధోని జోకులు (వీడియో)

IPL 2019 : MS Dhoni Jokes About Imran Tahir's Wild Celebrations ! || Oneindia Telugu
MS Dhoni jokes about Imran Tahirs wild celebrations: Its great fun to watch

హైదరాబాద్: సీఎస్‌కే బౌలర్ ఇమ్రాన్‌ తాహీర్‌ వికెట్లు తీసిన తర్వాత సంబరాలు చేసుకునే సమయంలో అతనితో పరుగెత్తడం చాలా కష్టమని ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. చెపాక్ వేదికగా బుధవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 80 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ మ్యాచ్‌లో ఇమ్రాన్ తాహీర్‌ కేవలం 12 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో 22 బంతుల్లో 44(4 ఫోర్లు, 3 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ధోనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ "ఇమ్రాన్ తాహిర్‌ సెలబ్రేషన్స్‌ చూడటం ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ, వికెట్‌ తీయగానే అతనికి దగ్గరికి వెళ్లకూడదని నేను, వాట్సన్‌ నిర్ణయించుకున్నాం" అని అన్నాడు.

వికెట్‌ పడగానే తాహిర్ మరోవైపునకు

"ఎందుకంటే వికెట్‌ పడగానే తాహిర్ మరోవైపునకు పరిగెత్తుకు వెళతాడు. ఇది నాకు, వాట్సన్‌కు కొంత కష్టమే. మేం 100శాతం ఫిట్‌గా లేనప్పుడు అలా పరిగెత్తి అభినందించడం కూడా కొంచెం కష్టమే. అందుకే అతను సంబరాలు ముగించుకొని వెనక్కి వచ్చాక తాహిర్ వద్దకు వెళ్లి బాగా బౌలింగ్‌ చేశావని అభినందిస్తాం. మళ్లీ మా ఫీల్డింగ్‌ పొజిషన్‌కి వచ్చేస్తాం" అని ధోని సరదాగా చెప్పాడు.

అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో

ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో తాహిర్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లాడిన తాహిర్ మొత్తం 21 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ కగిసో రబాడ 25 వికెట్లతో ఆగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా, చివర్లో రాయుడికి అవకాశం ఇవ్వకపోవడంపై కూడా ధోని స్పందించాడు.

భారీషాట్లు కొట్టడం కష్టంతో

భారీషాట్లు కొట్టడం కష్టంతో

"చివరి ఓవర్లో కొత్తగా వచ్చిన బ్యాట్స్‌మెన్‌ భారీషాట్లు కొట్టడం కష్టంతో కూడుకున్న పని. అందులోనూ చివర్లో బౌలర్లు స్లో డెలివరీలు, ఇన్‌ స్వింగర్లు వేస్తుంటారు. అలాంటి సమయాల్లో కనీసం 10 నుంచి 15 బంతులైనా ఎదుర్కొన్న బ్యాట్స్‌మెన్‌ ఉంటే బౌండరీలు బాదే అవకాశం ఉంటుంది. అందుకే నేను రాయుడికి బ్యాటింగ్‌ ఇవ్వలేదు" అని ధోని చెప్పుకొచ్చాడు.

అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాలి

అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాలి

"చివరి ఓవర్లో రిషభ్‌పంత్‌ కూడా చేతి నుంచి గ్లౌజులు తీయకుండా మాకు ఉపకారం చేశాడు. లేకపోతే పరుగు తీసే సమయంలో రనౌట్‌ అయ్యే వాడిని. మైదానంలో మంచు కూడా ఎక్కువ ప్రభావం ఏం చూపలేదు. ముఖ్యంగా ఇక్కడ అభిమానుల గురించి చెప్పాలి. ప్రతి మ్యాచులోనూ మా వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్నారు" అని ధోనీ తెలిపాడు.

Story first published: Thursday, May 2, 2019, 14:20 [IST]
Other articles published on May 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X