న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లిస్ట్‌-ఎ క్రికెట్‌లో 13వేల పరుగులు: ఎలైట్ జాబితాలోకి ధోని

Dhoni Joins Sachin, Sourav, Dravid In Elite Group | Oneindia Telugu
 MS Dhoni Joins Elite List Of Indian Batsmen With Gritty Fifty In 1st ODI

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన మహేంద్ర సింగ్ ధోని అరుదైన ఘనత సాధించాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన వన్డే సిరీస్‌తో ధోని మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత జరిగిన న్యూజిలాండ్ పర్యటనలో సైతం పాత ధోనీని అభిమానులకు గుర్తు చేస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. శనివారం హైదరాబాద్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలోఐదో వికెట్‌కు 141 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పిన కేదార్ జాదవ్ (87 బంతుల్లో 81 నాటౌట్), ధోనీ (72 బంతుల్లో 59 నాటౌట్) జట్టుని విజయతీరాలకు చేర్చాడు.

<strong>పన్ను మినహాయింపు లేకపోతే ఆ భారం బీసీసీఐ మోయాల్సిందే</strong>పన్ను మినహాయింపు లేకపోతే ఆ భారం బీసీసీఐ మోయాల్సిందే

1-0 ఆధిక్యంలో భారత్

1-0 ఆధిక్యంలో భారత్

వీరిద్దరూ ఎంతో సమన్వయంతో ఆడటం వల్ల 236 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 48.2 ఓవర్లలో భారత్ ఛేదించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో ధోని 72 బంతుల్లో 59 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లిస్ట్‌-ఎ క్రికెట్‌లో 13000 పరుగులు సాధించిన నాలుగో భారత్‌ క్రికెటర్‌గా ధోని అరుదైన రికార్డుని నెలకొల్పాడు.

సచిన్‌, గంగూలీ, ద్రవిడ్‌ సరసన ధోని

సచిన్‌, గంగూలీ, ద్రవిడ్‌ సరసన ధోని

అంతేకాదు మాజీ క్రికెట్ దిగ్గజాలైన సచిన్‌, గంగూలీ, ద్రవిడ్‌ తర్వాత ఈ మైలురాయిని అందుకున్న నాలుగో క్రికెటర్. 412 లిస్ట్‌-ఎ మ్యాచ్‌ల్లో ధోని ఇప్పటివరకు మొత్తం 13,054 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ గ్రాహమ్‌ గూచ్‌ 50.79 సగటుతో 22,211 పరుగులు సాధించి ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

జాదవ్‌తో కలిసి 141 పరుగుల భాగస్వామ్యం

జాదవ్‌తో కలిసి 141 పరుగుల భాగస్వామ్యం

శనివారం ఆసీస్‌తో జరిగిన మొదటి వన్టేలో కేదార్‌ జాదవ్‌తో కలిసి 141 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో ధోని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ రికార్డుని కూడా అధిగమించాడు. ఈ మ్యాచ్‌కి ముందు రోహిత్ శర్మ-ధోని ఇద్దరూ వన్డేల్లో 215 సిక్సులతో సమంగా ఉన్నారు.

రోహిత్ శర్మను అధిగమించిన ధోని

రోహిత్ శర్మను అధిగమించిన ధోని

అయితే, హైదరాబాద్ వన్డేలో ధోని 6 ఫోర్లు, ఒక సిక్స్‌తో రోహిత్ శర్మను అధిగమించాడు. ఈ జాబితాలో సచిన్ (195 సిక్సులు), గంగూలీ(189), యువరాజ్ (153) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య మార్చి 5(మంగళవారం) నాగ్‌పూర్ వేదికగా రెండో వన్డే జరగనుంది.

Story first published: Monday, March 4, 2019, 15:09 [IST]
Other articles published on Mar 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X