న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ లేకపోతే కోహ్లీ కెరీర్ ముగిసేదే: గంభీర్

MS Dhoni Backing Virat Kohli During His Poor Performance in 2014

ఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ సారథి ఎంఎస్ ధోనీ ప్రతి భారత క్రికెట్ అభిమాని గుండెల్లో చెరగని ముద్రవేశారు. ఇద్దరూ ఎన్నో రికార్డులు బద్దలు కొట్టారు, సృష్టించారు కూడా. కోహ్లీ, ధోనీలు మైదానంలో అగ్రశ్రేణి ఆటగాళ్ళుగా కొనసాగుతున్నారు. అయితే 2014 ఇంగ్లాండ్ టూర్ తరువాత విరాట్ కాకుండా మరో ఆటగాడైతే క్రికెట్‌‌ నుంచే కనుమరుగై పోయేవాడని భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డారు.

అత్యంత పేలవమైన ప్రదర్శన

అత్యంత పేలవమైన ప్రదర్శన

ప్రస్తుతం ఉన్న పోటీ నేపథ్యంలో ఎవరైనా ఆటగాడు విదేశీ గడ్డపై ఒకటి, రెండు మ్యాచుల్లో రాణించకపోతే.. అతడి కెరీర్ కష్టాల్లో పడినట్టే. అయితే ఓ యువ ఆటగాడు మొత్తం సిరీస్‌లోని 5 మ్యాచ్‌ల్లోనూ అత్యంత పేలవమైన ప్రదర్శన చేస్తే.. అతడికి జట్టులో మళ్లీ స్థానం లభిస్తుందా? అంటే కచ్చితంగా లేదనే చెబుతారు. కానీ విరాట్ కోహ్లీ విషయంలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా జరిగిందని, దీనికి కారణం అప్పటి కెప్టెన్ ఎంఎస్ సింగ్ ధోనీనే అని గౌతమ్ గంభీర్ చెబుతున్నారు.

ధోనీ అండగా నిలిచాడు

ధోనీ అండగా నిలిచాడు

తాజాగా గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ... '2014 ఇంగ్లాండ్ సిరీస్‌లో మొత్తం 5 టెస్టులాడిన విరాట్ కేవలం 13.4 సగటుతో 134 పరుగులే చేశాడు. సాధారణంగా ఎవరైనా ఓ సిరీస్‌లో ఇంత చెత్తగా ఆడితే.. అతడి కెరీర్ ముగిసినట్లేనని అనుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ సిరీస్‌ తరువాత కోహ్లీకి అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోనీ పూర్తి అండగా నిలిచాడు. కోహ్లీపై ఒక్క మాట పడనివ్వలేదు. విరాట్ మళ్లీ తన పూర్తి ఫామ్ అందుకునేవరకు మహీ అండగా నిలిచాడు' అని బీజేపీ ఎంపీ చెప్పుకొచ్చారు.

ద్రవిడ్‌ కెప్టెన్సీకి క్రెడిట్‌ దక్కలేదు

ద్రవిడ్‌ కెప్టెన్సీకి క్రెడిట్‌ దక్కలేదు

భారత క్రికెట్‌ను అత్యంత ప్రభావితం చేసిన క్రికెటర్లలో రాహుల్‌ ద్రవిడ్‌ ముందు వరుసలో ఉంటాడని గంభీర్‌ అభిప్రాయపడ్డారు. 'నా వన్డే అరంగేట్రం సౌరవ్‌ గంగూలీ నేతృత్వంలో జరగ్గా.. టెస్టు అరంగేట్రం ద్రవిడ్‌ సారథ్యంలో జరిగింది. ద్రవిడ్‌ జట్టుకు చేసిన సేవలు అమోఘం. గంగూలీ విజయవంతమైన సారథి అయినా ద్రవిడ్‌కు తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించాడు. ద్రవిడ్‌ సారథిగా కూడా గొప్ప విజయాల్నే చూశాడు. ఓపెనర్‌గా, కీపర్‌గా బహుముఖ పాత్రలో ద్రవిడ్‌ అలరించాడు. కానీ తగిన గుర్తింపు రాలేదు. సచిన్‌ నీడలో ఆడటం కూడా ద్రవిడ్‌కు గుర్తింపు రాకపోవడానికి ఒక కారణం. సచిన్‌ తరహా క్రికెటర్‌ ద్రవిడ్‌. గంగూలీ వైట్‌బాల్‌ క్రికెట్‌లో అత్యంత ప్రభావం చూపిన కెప్టెన్‌. కానీ భారత క్రికెట్‌లో ఓవరాల్‌గా రాహుల్‌ ద్రవిడే ప్రభావంతమైన కెప్టెన్‌' అని గౌతీ పేర్కొన్నాడు.

'భువనేశ్వర్ చాలా హాటెస్ట్.. నా స్నేహితురాలిగా భువీని ఎంచుకుంటా'

Story first published: Tuesday, June 23, 2020, 17:39 [IST]
Other articles published on Jun 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X