న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోని కంటే మిథాలీనే బెస్ట్

Mithali Raj the real Chase Master? Indian captain pips MS Dhoni to record stellar number in successful chases

హైదరాబాద్: ప్రపంచ క్రికెట్‌లో వన్డేల్లో అత్యుత్తమ ఫినిషర్ ఎవరంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు మహేంద్ర సింగ్ ధోని. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూల్‌గా ఉంటూ జట్టుకు విజయాన్ని అందిస్తుంటాడు. చివరి ఓవర్లలో క్రీజులోకి వచ్చి ఫోర్లు, సిక్సర్లు బాది మ్యాచ్‌ని ముగించడంలో ధోని దిట్ట.

ఆండీ ముర్రేకు శస్త్రచికిత్స: 2019 వింబుల్డన్ కోసమేనా!ఆండీ ముర్రేకు శస్త్రచికిత్స: 2019 వింబుల్డన్ కోసమేనా!

ఛేజింగ్‌లో అలాంటి ధోని కంటే భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ యావరేజి ఎక్కువగా ఉండటం విశేషం. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో భారత మహిళల కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

మిథాలీ రాజ్ ఖాతాలో రికార్డు

మిథాలీ రాజ్ ఖాతాలో రికార్డు

ఈ నేపథ్యంలో ఛేజింగ్‌లో మిథాలీ రాజ్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు నమోదైంది. ఆ రికార్డు ఏంటంటే చేధనలో అత్యధిక యావరేజిని కలిగి ఉండటం. ఛేజింగ్‌లో మిథాలీ యావరేజి 111.29గా ఉంటే ధోని యావరేజి 103.07గా ఉంది. దీంతో ఇప్పటివరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ధోని రికార్డుని మిథాలీ అధిగమించింది.

రెండో వన్డేలో హాఫ్ సెంచరీ

రెండో వన్డేలో హాఫ్ సెంచరీ

పురుషుల, మహిళల క్రికెట్లో ఇదే అత్యధికం. రెండో వన్డేలో మరీ నెమ్మదిగా (111 బంతుల్లో 63) బ్యాటింగ్‌ చేసిందనే విమర్శలు వ్యక్తమైనప్పటికీ ఛేదనలో తనకు సాటి లేదని నిరూపించుకుంది. మరోవైపు వీరిద్దరి తర్వాతి స్థానంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 96.23 యావరేజితో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

8 వికెట్ల తేడాతో భారత్ విజయం

8 వికెట్ల తేడాతో భారత్ విజయం

మౌంట్ మాంగనూయ్ వేదికగా మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మిథాలీ సేన కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత మహిళల జట్టు న్యూజిలాండ గడ్డపై వన్డే సిరీస్‌ నెగ్గి చరిత్ర సృష్టించింది.

మంధాన హాఫ్ సెంచరీ

మంధాన హాఫ్ సెంచరీ

న్యూజిలాండ్ నిర్దేశించిన 162 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు 14.4 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. ఈ సిరిస్‌లో బాగంగా తొలి వన్డేలో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ స్మృతి మంధాన రెండో వన్డేలోనూ 90 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. మరోవైపు కెప్టెన్ మిథాలీ రాజ్ సైతం 63 పరుగులతో నౌటౌట్‌గా నిలిచింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు 161 పరుగులకే కుప్పకూల్చారు.

Story first published: Wednesday, January 30, 2019, 12:00 [IST]
Other articles published on Jan 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X