న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరో ఎంఎస్ ధోనీ ఎప్పటికీ రాలేడు: మిథాలీ

Mithali Raj says There will never be another MS Dhoni

హైదరాబాద్: టీమిండియా‌ మాజీ కెప్టెన్‌, సీనియర్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌పై భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ స్పందించారు. ధోనీ లాంటి ఆటగాడు ఎప్పటికీ రాలేడని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్క క్రికెటర్‌కు మహీ ఓ ప్రేరణ అని మిథాలీ పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెబుతున్నట్టు ధోనీ శనివారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. 16 ఏళ్ల కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ తప్పుకుంటున్నట్లు ఆయన వెల్లడించాడు.

England vs Pakistan: రెండు ఇన్నింగ్స్‌లు కూడా సాగలేదు.. వర్షం ఖాతాలో రెండో టెస్టు!!England vs Pakistan: రెండు ఇన్నింగ్స్‌లు కూడా సాగలేదు.. వర్షం ఖాతాలో రెండో టెస్టు!!

ధోనీలా ఇంకెవరూ ఉండరు:

ధోనీలా ఇంకెవరూ ఉండరు:

బీసీసీఐ సోమవారం తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలో మిథాలీ రాజ్ మాట్లాడుతూ... 'ప్రతి క్రికెటర్‌కు ఎంఎస్ ధోనీ ఓ ప్రేరణ. అతడు చెప్పింది చేస్తాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించాలనుకుని.. అనుకున్నది సాధించే చిన్న పట్టణాలకు చెందిన కుర్రాళ్లందరికీ మహీ ఓ స్వప్నం. అత్యంత ఒత్తిడి సమయాల్లోనూ అతడు కనబరిచే ప్రశాంతత నాకెంతో ఇష్టం. అతడి బ్యాటింగ్‌, వికెట్‌ కీపింగ్‌ శైలికి వీరాభిమానిని. క్రికెట్‌ పుస్తకంలో లేని హెలిక్యాప్టర్‌ షాట్‌.. ధోనీ సహజత్వం, ప్రతిభ, ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. అలాంటి ఆటగాడు మళ్లీ రాడు. ఎప్పటికీ ధోనీ దిగ్గజమే' అని అన్నారు.

 గొప్ప నాయకుడు:

గొప్ప నాయకుడు:

ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌పై స్టార్ మహిళా ఓపెనర్ స్మృతి మందాన కూడా స్పదించారు. '2011 ప్రపంచకప్‌ ఫైనల్లో బ్యాటింగ్‌ చేసేందుకు ధోనీ మైదానంలోకి వెళ్తున్న దృశ్యం ఇప్పటికీ గుర్తే. ఆ సమయంలో మహీ ముఖంలో కనిపించిన ఆత్మవిశ్వాసం నాలో స్ఫూర్తి రగిల్చింది. తన చుట్టూ ఉన్న వాళ్లు మెరుగైన క్రికెటరయ్యేలా అతడు ప్రేరణనిచ్చాడు. అతడు గొప్ప నాయకుడు, అన్నింటికన్నా ముఖ్యంగా అతడు మంచి మనిషి' అని పేర్కొన్నారు.

నువ్వో దిగ్గజం.

నువ్వో దిగ్గజం.

ధోనీ ఆడిన తరంలోనే అథ్లెట్‌ అయినందుకు గర్విస్తున్నానని భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మిర్జా‌ అన్నారు. 'ఎంఎస్ ధోనీ నువ్వో దిగ్గజం. నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ క్రీడాకారుల్లో నువ్వూ ఒకడివి. దేశం కోసం నువ్వు చేసిన సేవకు ధన్యవాదాలు. నీ భవిష్యత్‌ మరింత బాగుండాలని ఆశిస్తున్నా. నువ్వు ఆడిన తరంలోనే, ఇదే దేశం తరఫున నేను కూడా ఒక క్రీడాకారిణి అయినందుకు గర్విస్తున్నా' అని సానియా ట్వీట్ చేశారు.

350 వన్డేలు:

350 వన్డేలు:

అంతర్జాతీయ కెరీర్‌లో ఎంఎస్ ధోనీ 90 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 4,876 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధ శతకాలు ఉన్నాయి. 350 వన్డే మ్యాచ్‌ల్లో 10,773 రన్స్‌ చేశాడు. వీటిల్లో 10 శతకాలలతో పాటు 73 అర్థ శతకాలు ఉన్నాయి. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 183‌. ఇక 98 టీ20 మ్యాచ్‌లలో 1,600 పరుగుల బాదాడు.

Story first published: Tuesday, August 18, 2020, 8:27 [IST]
Other articles published on Aug 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X