న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మిథాలీని తప్పించడం వెనుక: బోర్డుకు కోచ్ చెప్పిన కారణం సిల్లీగా!

Mithali Raj packed her bags and threatened to quit, reveals Ramesh Powar

హైదరాబాద్: మహిళల వరల్డ్ టీ20లో ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీపైనల్ మ్యాచ్‌లో సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్‌ను తుది జట్టు నుంచి తప్పించడంపై మొదలైన వివాదం ముదురుతోంది. ఈ వివాదంపై ఇప్పటికే బోర్డు సీఈఓ రాహుల్‌ జోహ్రిని మిథాలీతో పాటు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, జట్టు మేనేజర్‌ తృప్తి భట్టాచార్య కలిశారు. ఈ ముగ్గురూ వేర్వేరుగా జోహ్రిని కలిసి వివాదం విషయంలో తమ అభిప్రాయాలు చెప్పారు.

<strong>ఇది నా జీవితంలో విషాదకరమైన రోజు: మిథాలీ రాజ్</strong>ఇది నా జీవితంలో విషాదకరమైన రోజు: మిథాలీ రాజ్

తాజాగా మహిళల జట్టు కోచ్ రమేశ్‌ పవార్‌.. బుధవారం బీసీసీఐ సీఈఓ రాహుల్‌ జోహ్రి, జీఎం సబా కరీమ్‌లను కలిశాడు. ఈ సమావేశంలో మిథాలీతో తనకు సరైన సంబంధాలు లేవని కూడా అంగీకరించినట్లు బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. మిథాలీ స్ట్రైక్‌ రేట్‌ తక్కువగా ఉండటం వల్లే ఆమెను తప్పించినట్లు స్పష్టం చేశాడంట.

పాక్, ఐర్లాండ్‌ మ్యాచ్‌ల్లో ఎందుకు ఆడించారు

పాక్, ఐర్లాండ్‌ మ్యాచ్‌ల్లో ఎందుకు ఆడించారు

మిథాలీ స్ట్రైక్‌ రేట్‌ బాగా లేనపుడు పాకిస్థాన్‌, ఐర్లాండ్‌ మ్యాచ్‌ల్లో ఎందుకు ఆడించారని పవార్‌ను అడిగితే సమాధానం చెప్పలేకపోయాడని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. మిథాలీ ఓపెనింగ్‌లోనే ఆడతానని పట్టుబట్టిందని, లేదంటే ప్రపంచకప్‌ నుంచి తప్పుకుని, రిటైర్మెంట్‌ ప్రకటిస్తానని హెచ్చరించినట్లు పవార్‌ బోర్డుకు రాసిన నివేదికలో పేర్కొన్నాడు.

మిథాలీ వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడుతుంది

మిథాలీ వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడుతుంది

అంతేకాదు మిథాలీ వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడుతుందని, జట్టు ప్రయోజనాల గురించి పట్టించుకోదని కూడా తన నివేదికలో వెల్లడించాడు. మిథాలీ స్ట్రైక్‌ రేట్‌ తక్కువగా ఉండటం వల్లే ఆమెను తప్పించినట్లు కోచ్ పవార్ పేర్కొన్న నేపథ్యంలో తాజాగా మిథాలీ స్ట్రైక్‌ రేట్‌ అంశం తెరపైకి వచ్చింది. మిథాలీ స్ట్రైక్‌ రేట్‌ మరీ అంత తక్కువగా ఉందా? ఆమె వల్ల జట్టుకు నష్టం జరుగుతోందా? అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

85 టీ20లాడిన మిథాలీ స్ట్రైక్‌ రేట్‌ 96.57

85 టీ20లాడిన మిథాలీ స్ట్రైక్‌ రేట్‌ 96.57

ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో 85 టీ20లాడిన మిథాలీ 34.04 సగటు, 96.57 స్ట్రైక్‌ రేట్‌తో 2315 పరుగులు చేసింది. మహిళల టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లలో మిథాలీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. అంతేకాదు మహిళల టీ20క్రికెట్‌లో 30కి పైగా మ్యాచ్‌లాడిన క్రికెటర్లలో మిథాలీ కన్నా ఎక్కువ సగటున్న క్రికెటర్లు ఇద్దరే.

అత్యధిక పరుగులు చేసిన టాప్‌-10లో

అత్యధిక పరుగులు చేసిన టాప్‌-10లో

అందులో ఒకరు భారత కెప్టెన్‌ హర్మన్‌‌ప్రీత్ కౌర్. హర్మన్ ప్రీత్ స్ట్రైక్‌ రేట్‌ 103. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్‌-10 మహిళల్లో ఇద్దరు మాత్రమే 120కి పైగా స్ట్రైక్‌ రేట్‌తో ఉన్నారు. నిజానికి బంతికో పరుగు చొప్పున చేసే మిథాలీ రాజ్ లాంటి క్రికెటర్లతో టీ20ల్లో ఎలాంటి సమస్య లేదు. అయితే, కోచ్‌తో ఉన్న విభేధాల కారణంగానే మిథాలీకి ఇప్పుడు సమస్యలు వచ్చాయి.

Story first published: Thursday, November 29, 2018, 13:32 [IST]
Other articles published on Nov 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X