న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మిథాలీ ఆగ్రహం వెనుక సరైన కారణం ఉంది: మద్దతు పలికిన ఇంజనీర్

Mithali Raj has got good reasons to be peeved: Farokh Engineer

హైదరాబాద్: వెస్టిండిస్ వేదికగా ముగిసిన ఐసీసీ మహిళల వరల్డ్ టీ20లో ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌కు మిథాలీరాజ్‌ను జట్టు నుంచి తప్పించడం పెను చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. మిథాలీ వివాదం చివరకు బీసీసీఐ వద్దకు కూడా చేరింది. ఈ వివాదానికి సంబంధించి సోమవారం బోర్డు సీఈఓ రాహుల్‌ జోహ్రిని మిథాలీతో పాటు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, జట్టు మేనేజర్‌ తృప్తి భట్టాచార్య కలిశారు.

హాకీ వరల్డ్‌కప్: 28ఏళ్ల తర్వాత బరిలోకి ఫ్రాన్స్, విజేతకు ఇచ్చే ట్రోఫీ ప్రత్యేకతలివేహాకీ వరల్డ్‌కప్: 28ఏళ్ల తర్వాత బరిలోకి ఫ్రాన్స్, విజేతకు ఇచ్చే ట్రోఫీ ప్రత్యేకతలివే

ఈ ముగ్గురూ వేర్వేరుగా జోహ్రిని కలిసి వివాదం విషయంలో తమ అభిప్రాయాలు చెప్పిన సంగతి తెలిసిందే. తనకు అవమానాలు ఎదురవుతున్నా మౌనంగానే భరిస్తూ వచ్చిన మిథాలీ ఎట్టకేలకు మంగళవారం దీనిపై ట్విట్టర్‌లో స్పందించింది. బీసీసీఐ సీఈఓ రాహుల్‌ జోహ్రి, జనరల్‌ మేనేజర్‌ సాబా కరీమ్‌లకు పంపిన ఈ మెయిల్లో తన ఆవేదనను వెళ్లగక్కింది.

మిథాలీకి మద్దతుగా ఫరూక్ ఇంజనీర్

మిథాలీకి మద్దతుగా ఫరూక్ ఇంజనీర్

తనను జట్టు నుంచి తప్పించడానికి సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జి, కోచ్‌ రమేశ్‌ పొవార్‌లే కారణామని ఈ మెయిల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో మిథాలీరాజ్‌కు టీమిండియా మాజీ క్రికెటర్‌ ఫరూక్ ఇంజినీర్‌ మద్దతుగా నిలిచారు. జట్టు నుంచి తప్పించడంపై మిథాలీకి కోపం రావడంలో సరైన కారణం ఉందని ఫరూక్ అభిప్రాయపడ్డారు.

ఫరూక్ ఇంజనీర్ మాట్లాడుతూ

ఫరూక్ ఇంజనీర్ మాట్లాడుతూ

ఈ సందర్భంగా ఫరూక్ ఇంజనీర్ మాట్లాడుతూ "విజయపథంలో ముందుకెళ్తున్న భారత మహిళా క్రికెట్ జట్టులో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం నిజంగా బాధపడాల్సిన విషయమే. మిథాలీ చాలా గొప్ప క్రికెటర్‌. దీనికితోడు ఈ టోర్నీలో ఆమె ఆడిన మ్యాచ్‌ల్లో జట్టుకు ఉపయుక్తమైన ఇన్నింగ్స్‌ ఆడి ముందుండి నడిపించింది" అని చెప్పారు.

ఇది సరైన చర్య కాదు

ఇది సరైన చర్య కాదు

"అయినప్పటికీ కీలక మ్యాచ్‌లో ఆమెపై వేటుపడింది. ఎంతో అనుభవం ఉన్న ఓ క్రికెటర్‌ పట్ల ఇలా వ్యవహరించడం సరైన చర్య కాదు. అప్పటి అవసరాల దృష్ట్యా సెమీస్‌ మ్యాచ్‌లో ఆమెపై వేటు వేసి ఉండొచ్చు. ఆ సమయంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. దీనిపై నేను నేరుగా ఎలాంటి వ్యాఖ్యాలు చేయదలుచుకోలేదు" అని అన్నారు.

సెమీస్‌ మ్యాచ్‌లో మిథాలీని కచ్చితంగా ఆడాల్సింది

సెమీస్‌ మ్యాచ్‌లో మిథాలీని కచ్చితంగా ఆడాల్సింది

"ఫామ్‌ పరంగా చూసుకుంటే మాత్రం సెమీస్‌ మ్యాచ్‌లో మిథాలీని కచ్చితంగా ఆడాల్సింది. మిథాలీని ఆమెను రిజర్వ్ బెంచ్‌కు పరిమితం చేయడం మాత్రం దారుణమైన చర్యే. టోర్నీలో ఆమె అనుభవించిన మానసిక క్షోభ దృష్ట్యా సదరు వ్యక్తుల పట్ల ఆమె ఆగ్రహించడంలో సరైన కారణమే ఉంది" అని ఫరాక్ ఇంజనీర్ చెప్పుకొచ్చారు.

మిథాలీ తొలగింపు వివాదానికి కారణం వీరే

మిథాలీ తొలగింపు వివాదానికి కారణం వీరే

వరల్డ్ టీ20లో మంచి ఫామ్ మీదున్న మిథాలీని తప్పిస్తూ కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్, స్మృతి మందాన, చీఫ్ కోచ్ రమేవ్ పవార్, సెలెక్షన్ కమిటీ సభ్యురాలు సుధాషా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై అటు అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు సైతం తీవ్ర విమర్శలు గుప్పించారు. మిథాలీ తొలగింపు వివాదానికి కారణమైన భారత మహిళల క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ రమేశ్ పవార్‌పై వేటు పడే అవకాశం కనిపిస్తోంది.

Story first published: Wednesday, November 28, 2018, 13:16 [IST]
Other articles published on Nov 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X