ఆరో వరల్డ్ కప్‌లో ఆడతా: రిటైరయ్యే ఆలోచనపై మిథాలీ

Posted By:

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా 2021లో జరిగే వరల్డ్ కప్‌లో ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ స్పష్టం చేసింది. 15 ఏళ్లకు పైగా అంతర్జాతీయ క్రికెట్‌‌లో రాణిస్తున్న మిథాలీ రాజ్ ఇప్పటి వరకు ఐదు వరల్డ్ కప్‌లు ఆడింది.

దీంతో మరో నాలుగేళ్లలో జరగనున్న వరల్డ్ కప్‌లో వయసు రీత్యా మిథాలీ రాజ్ ఆడకపోవచ్చనే అనుమానులు వ్యక్తం అవుతున్నాయి. అయితే మిథాలీ మాత్రం తనకు ఇప్పుడే రిటైరయ్యే ఆలోచనేమీ లేదని స్పష్టం చేసింది. ఐసీసీ వన్డే ఛాంపియన్‌షిప్‌లో భాగంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మిథాలీ సేన దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది.

ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రాతో కలిసి మిథాలీరాజ్ సోమవారం టోర్నీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 'తర్వాతి ప్రపంచకప్‌లో నేను ఆడే అవకాశాల్ని కొట్టిపారేయలేను. అయితే నాలుగేళ్ల తర్వాత ప్రపంచకప్‌ ఆడాలంటే ముందు ఈ మూడేళ్లూ ఎలా కెరీర్‌ను కొనసాగిస్తానో చూడాలి' అని పేర్కొంది.

 దృష్టంతా టీ20 వరల్డ్ కప్‌పైనే

దృష్టంతా టీ20 వరల్డ్ కప్‌పైనే

అయితే అప్పటి వరకు తన ఫామా ఎలా ఉంటుందన్నది కీలకమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికి తన దృష్టంతా 2018లో జరగబోయే టీ20 వరల్డ్ కప్, మిగతా మ్యాచ్‌ల మీదేనని మిథాలీ స్పష్టం చేసింది. ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వరల్డ్ కప్ తర్వాత ఐదు నెలల పాటు విరామం తీసుకున్న భారత మహిళల జట్టు ఏడాది చివర్లో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనుంది.

 దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల సిరీస్

దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల సిరీస్

2017-2020 వరకు జరిగే వన్డే చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత మహిళల క్రికెట్ జట్టు వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 10 తేదీ వరకు దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతుంది. వన్డే ఛాంపియన్‌షిప్‌లో ప్రతి జట్టు మిగతా జట్లతో స్వదేశంలో, విదేశాల్లో సిరీస్‌లు ఆడాల్సి ఉంటుంది.

 డిసెంబరు నుంచి సన్నాహాలు

డిసెంబరు నుంచి సన్నాహాలు

ఇందులో భాగంగా దక్షిణాఫ్రికాతో జరగబోయే సిరీస్‌కు డిసెంబరు నుంచి సన్నాహాలు మొదలుపెడతామని మిథాలీ చెప్పింది. 'మా దేశవాళీ సీజన్‌ డిసెంబర్లో మొదలవుతుంది. దక్షిణాఫ్రికా పర్యటనకు అది సన్నాహకం. మూడు నెలలకు పై గా విరామం తర్వాత మేం మళ్లీ మైదానంలోకి వస్తాం' అని మిథాలీ చెప్పింది.

 టాప్-3 జట్లు 2021 ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత

టాప్-3 జట్లు 2021 ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత

ఇక, వన్డే ఛాంపియన్‌షిప్‌లోని టాప్-3 జట్లు 2021లో న్యూజిలాండ్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత సాధిస్తాయి. మిగిలిన 4 బెర్తుల కోసం ఆరు జట్లతో కలిసి ప్రపంచకప్ అర్హత టోర్నీ నిర్వహిస్తారు. అక్టోబర్ 11న వెస్టిండీస్, శ్రీలంక మధ్య జరిగే సిరీస్‌తో ఐసీసీ వన్డే ప్రపంచ చాంపియన్‌షిప్‌ ప్రారంభం కానుంది.

Story first published: Tuesday, October 10, 2017, 11:49 [IST]
Other articles published on Oct 10, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి