న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ, రోహిత్ రికార్డు బద్దలు: టీ20ల్లో మిథాలీ అరుదైన రికార్డు

ICC Women's World T20 : Mithali Raj Ahead Of Rohit Sharma and Virat Kohli | Oneindia Telugu
Mithali Raj Becomes Highest T20I Run-Scorer for India Ahead Of Rohit Sharma, Virat Kohli

హైదరాబాద్: కరేబియన్ దీవుల్లో జరుగుతున్న మహిళల వరల్డ్ టీ20లో భారత ఓపెనర్ మిథాలీ రాజ్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. గురువారం రాత్రి ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మిథాలీ హాఫ్ సెంచరీతో రాణించడంతో భారత తరపున అత్యధిక టీ20 పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించింది.

కోహ్లీ, రోహిత్‌ను అధిగమించిన మిథాలీ

కోహ్లీ, రోహిత్‌ను అధిగమించిన మిథాలీ

ఈ క్రమంలో టీమిండియా పురుషు క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను సైతం మిథాలీ అధిగమించడం విశేషం. మిథాలీకి ఈ టోర్నీలో ఇది వరుసగా రెండో హాఫ్‌ సెంచరీ. తాజా ప్రదర్శనతో పురుషుల జట్టులో అత్యధిక పరుగులు చేసిన న్యూజిలాండ్‌ క్రికెటర్‌ మార్టిన్‌ గఫ్తిల్‌(2271)ను సైతం మిథాలీ అధిగమించింది.

2283 పరుగులతో మిథాలీ రాజ్ రికార్డు

ప్రస్తుతం గుప్టిల్‌ 2271 పరుగులతో అందరికంటే ఈ జాబితాలో ముందు వరుసలో ఉండగా తాజాగా మిథాలీ(2283) అతడిని అధిగమించింది. ఇప్పటివరకు మిథాలీ రాజ్ 85 టీ20ల్లో 37.43 యావరేజితో 2,283 పరుగులు చేసింది. మరోవైపు అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌వుమెన్‌గా మిథాలీ నాలుగో స్థానంలో ఉంది.

నాలుగో స్థానంలో మిథాలీ రాజ్

ఈ జాబితాలో న్యూజిలాండ్‌ బ్యాటర్‌ సుజీ బేట్స్‌(2996) అందరికంటే ముందు వరుసలో ఉండగా, వెస్టిండీస్‌కు చెందిన టేలర్‌(2691) రెండో స్థానంలో ఇంగ్లాండ్‌కు చెందిన ఎడ్వర్డ్(2605) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక, ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మిథాలీ రాజ్ 4 ఫోర్ల సాయంతో 56 బంతుల్లో 51 పరుగులు చేసింది.

ఐర్లాండ్‌పై 52 పరుగుల తేడాతో భారత్ విజయం

మిథాలీ కీలక ఇన్నింగ్స్‌కు తోడు స్పిన్నర్లు రాణించడంతో భారత్‌, ఐర్లాండ్‌పై 52 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్‌‌కు చేరుకుంది. మిథాలీ ప్రదర్శనపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. దీనిపై మిథాలీ తన ట్విట్టర్‌లో "క్రికెట్‌లో స్లో వికెట్‌, కఠిన పరిస్థితులను అభిమానులు అర్థం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సెమీస్‌లో కూడా మంచి పరిస్థితులుంటాయని అనుకుంటున్నా"అని ట్వీట్‌ చేసింది.

Story first published: Friday, November 16, 2018, 14:42 [IST]
Other articles published on Nov 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X