న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓడినా వణికించాం.. మరో 10 పరుగులు చేసుంటే మేమే గెలిచేవాళ్లం: మిచెల్ సాంట్నర్

Mitchell Santner says If wed got an extra 10 or 15, could have been the difference After IND beat NZ

లక్నో: భారత్‌తో రెండో టీ20లో ఓడినా అసాధారణమైన బౌలింగ్‌తో వణికించామని న్యూజిలాండ్ తాత్కలిక కెప్టెన్ మిచెల్ సాంట్నర్ అన్నాడు. మరో 10-15 పరుగులు చేసుంటే ఫలితం మరోలా ఉండేదని తెలిపాడు. ఆదివారం ఉత్కంఠసాగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గట్టెక్కింది. ఈ మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందించిన మిచెల్ సాంట్నర్.. ఇదో అద్భుతమైన మ్యాచ్ అని అభివర్ణించాడు. పిచ్ ఇరు జట్లకు సవాల్ విసిరిందని తెలిపాడు.

'క్రికెట్‌‌లోనే ఇదో గొప్ప మ్యాచ్. అసాధారణ బౌలింగ్‌తో లోస్కోరింగ్ మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చాం. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మేం అదనంగా 10-15 పరుగులు చేసుంటే ఫలితం మరోలా ఉండేది. అయితే సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ప్రశాంతంగా ఆడుతూ లక్ష్యాన్ని చేధించారు. మేం 17 ఓవర్లను స్పిన్నర్లతోనే వేయించాం. ఇది నిజంగా ప్రత్యేకమే. ఇక టర్న్‌తో పాటు అనూహ్య బౌన్స్ ఉన్న ఈ వికెట్‌పై ఎంత లక్ష్యం అవసరమనేది ఊహించలేకపోయాం. ఓ దశలో 140-160 చేయాలనుకున్నాం. కానీ బ్యాటింగ్ చేస్తున్నా కొద్దీ 120 పరుగులు కూడా ఈ వికెట్‌పై చేజ్ చేయలేమనిపించింది.'అని మిచెల్ సాంట్నర్ అన్నాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 99 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ మిచెల్ సాంట్నర్(19 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, దీపక్ హుడా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 19.5 ఓవర్లలో 100 పరుగులు చేసి విజయాన్నందుకుంది. సూర్యకుమార్ యాదవ్(31 బంతుల్లో ఫోర్‌తో 26 నాటౌట్), హార్దిక్ పాండ్యా(20 బంతుల్లో ఫోర్‌తో 15 నాటౌట్) కడవరకు నిలిచి భారత్‌‌ థ్రిల్లింగ్ విక్టరీ అందించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మైకేల్ బ్రేస్‌వెల్, ఇష్ సోదీ తలో వికెట్ తీసారు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాయి. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్1-1తో సమం చేసింది. ఆఖరి మ్యాచ్ బుధవారం(ఫిబ్రవరి) అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.

Story first published: Sunday, January 29, 2023, 23:15 [IST]
Other articles published on Jan 29, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X