
హైదరాబాద్: పాకిస్థాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవికి తాు దరఖాస్తు చేసుకున్నట్టు ఆ దేశ మాజీ దిగ్గజ ఆటగాడు మిస్బా ఉల్ హక్ సోమవారం తెలిపాడు. 45 ఏళ్ల మిస్బా ఉల్ హక్ పాకిస్థాన్ తరుపున మొత్తం 75 టెస్టులు ఆడి 2017లో అంతర్జాతీ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డేవరల్డ్ కప్‌లో పాకిస్థాన్ జట్టు విఫలం కావడంతో హెచ్ కోచ్‌గా ఉన్న మిక్కి ఆర్థర్‌తో పాటు సహాయక సిబ్బంది కాంట్రాక్టును పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) పొడిగించని సంగతి తెలిసిందే. అంతేకాదు ఆగస్టు 9 నుంచి కొత్త హెడ్ కోసం పీసీబీ దరఖాస్తులను సైతం ఆహ్వానించింది.
ఈ దరఖాస్తుల గడువు సోమవారంతో ముగిశాయి. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న మిస్బా ఉల్ హక్ పాకిస్థాన్ క్రికెట్ కమిటీ నుంచి తప్పుకున్నాడు. కాగా, మిస్బాను పాక్ హెడ్ కోచ్‌తో పాటు చీఫ్ సెలెక్టర్‌గా నియమిస్తారన్న ఊహాగానాలు కొద్దిరోజులుగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మిస్బా మాట్లాడుతూ "నేను హెడ్ కోచ్ స్థానం కోసం దరఖాస్తు సమర్పించా. ఈ నిర్ణయం ఈ రోజే తీసుకున్నా. పోటీ తీవ్రంగా ఉంటుందని తెలుసు. ఎంతో చాలెంజ్‌తో కూడుకున్న ఈ పదవి కోసం చాలా మంది సీనియర్లు, మెరుగైన అర్హత కలిగిన వారు రేసులో ఉన్నారు" అని చెప్పాడు.మరోవైపు పాక్ హెడ్ కోచ్ రేసులో ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్ డీన్ జోన్స్ కూడా ఉన్నాడు.