న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

‘Independent doctor on site’: ఫెర్గూసన్ గాయం ఎఫెక్ట్, ఐసీసీకి వాన్ కొత్త ప్రతిపాదన

 ‘Independent doctor on site’: Michael Vaughan proposes radical rule change in cricket after Lockie Ferguson injury


హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య పెర్త్ వేదికగా తొలి టెస్టు గురువారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ టెస్టులో పర్యాటక జట్టైన న్యూజిలాండ్‌ను బౌలర్ కష్టాలు వేధిస్తున్నాయి. తొలి రోజు ఆటలో భాగంగా కివీస్‌ పేసర్ ఫెర్గూసన్‌ కాలికి గాయమైంది.

భారత జట్టులో చేర్చుకుంటావా?: చిన్నారి బ్యాటింగ్‌కు కోహ్లీ ఫిదా (వీడియో)భారత జట్టులో చేర్చుకుంటావా?: చిన్నారి బ్యాటింగ్‌కు కోహ్లీ ఫిదా (వీడియో)

11 ఓవర్లు వేసిన ఫెర్గూసన్

11 ఓవర్లు వేసిన ఫెర్గూసన్

దీంతో అతడు మైదానాన్ని వీడాడు. కేవలం 11 ఓవర్లు వేసిన అనంతరం ఫెర్గూసన్‌ మైదానం వీడటంతో ఒక బౌలర్‌ లోటుతోనే న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్‌ను ఎలాగో ఒకలా ముగించింది. దీంతో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసి ఆలౌటైంది. ఫెర్గూసన్‌ గాయం తీవ్రతను దృష్టిలో పెట్టుకుని డాక్టర్లు తొలి టెస్టులో అతడు బౌలింగ్‌ చేయకపోవడమే మంచిదని నిర్ణయించారు.

తొలుత బ్యాటింగ్ చేయొచ్చని

తొలుత బ్యాటింగ్ చేయొచ్చని

అదే సమయంలో అతడు బ్యాటింగ్ చేయొచ్చని న్యూజిలాండ్ బోర్డు పేర్కొంది. అయితే, ఏమైందో ఏమో తెలియదు గానీ, శుక్రవారం ఫెర్గూసన్‌కు తొలి టెస్టుకు విశ్రాంతి నివ్వడమే మంచిదని డాక్డర్లు సూచించినట్లు మరో ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తొలి టెస్టులో ఓ పేస్ బౌలర్ లోటుతో న్యూజిలాండ్ ఆడాల్సిన పరిస్థితి తలెత్తింది.

మైకేల్‌ వాన్‌ కొత్త ప్రతిపాదన

దీంతో ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ ఓ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చాడు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో ఐదు రోజులు టెస్టులో నాలుగు రోజులు న్యూజిలాండ్ ఓ ప్రధాన బౌలర్‌ సేవలను కోల్పోనుంది. ఇది ఏ జట్టుకైన ఇబ్బందే. ఇలాంటి తరుణంలో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ మాదిరిగానే ‘ఇండిపెండెంట్‌ డాక్టర్‌ ఆన్‌ సైట్‌' అనే ప్రతిపాదనను ఐసీసీ ముందుంచాడు.

డాక్టర్‌ అతడిని పరీక్షించిన తర్వాత

డాక్టర్‌ అతడిని పరీక్షించిన తర్వాత

ఈ మేరకు తన ట్విట్టర్‌లో మైకేల్ వాన్ ట్వీట్ చేశాడు. మ్యాచ్‌ సందర్భంగా ఆటగాడు గాయపడితే మైదానంలో ఉన్న నియమిత డాక్టర్‌ అతడిని పరీక్షించిన తర్వాత ఆ క్రికెటర్‌ మ్యాచ్‌ ఆడే వీలులేదని ప్రకటిస్తే మరో ఆటగాడిని జట్టులోకి తీసుకునే వెసులుబాటును కల్పించాలని సూచించాడు.

Story first published: Saturday, December 14, 2019, 10:55 [IST]
Other articles published on Dec 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X