న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'బుమ్రా ప్రమాదకర బౌలర్.. 140 కి.మీ వేగంతో హడలెత్తిస్తాడు'

Marnus Labuschagne Says Hard To Get Past Jasprit Bumrah Among Indian Bowlers
Jasprit Bumrah Names ‘The Best Yorker Bowler In The World’

బ్రిస్బేన్‌: టీమిండియా పేస్‌ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడం చాలా కష్టమని ఆస్ట్రేలియా యువ ఆటగాడు మార్నస్‌ లబుషేన్‌ అన్నాడు. ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, మొహమ్మద్ షమీలతో టీమిండియా పేస్‌ దళం పటిష్టంగా ఉందని ప్రశంసలు కురిపించాడు. 2020-21 సీజన్‌కు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించిన కాంట్రాక్ట్‌ జాబితాలో లబూషేన్‌ స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు భారత్‌పై ఒక్క టెస్టు మాత్రమే ఆడిన లబుషేన్‌.. ఈ ఏడాది చివర్లో జరుగనున్న భారత్‌, ఆసీస్‌ సిరీస్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు.

 బుమ్రాతో చాలా డేంజర్‌:

బుమ్రాతో చాలా డేంజర్‌:

ఆదివారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మార్నస్‌ లబుషేన్‌ మాట్లాడుతూ... 'గంటకు 140 కి.మీల వేగంతో నిలకడగా బౌలింగ్‌ చేయగల సత్తా జస్ప్రీత్ బుమ్రాకు ఉంది. పరిస్థితులు అనుకూలిస్తే బంతిని ఇరువైపులా స్వింగ్‌ను రాబట్టడంలో కూడా దిట్ట. అందుకే బుమ్రా బౌలింగ్‌ ఆడటం చాలా కష్టం. ఇప్పుడు భారత్‌ పేస్‌ దళం చాలా మెరుగ్గా ఉంది. అందులో బుమ్రా ప్రమాదకర బౌలర్‌. నీకు నువ్వు బ్యాట్స్‌మన్‌గా పరీక్షించుకోవాలంటే బుమ్రా బౌలింగ్‌ను ఆడితేనే తెలుస్తుంది. టీమిండియా పేస్‌ దళానికి బుమ్రానే లీడర్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదు' అని అన్నాడు.

ఇషాంత్‌ బాగా మెరుగయ్యాడు:

ఇషాంత్‌ బాగా మెరుగయ్యాడు:

'నేను భారత్‌లో ఒకే ఒక టెస్టు మ్యాచ్‌ ఆడాను. గతంలో సిడ్నీ మ్యాచ్‌లో భారత్‌తో ఓ మ్యాచ్‌ ఆడా. నాకు భారత్‌ బౌలింగ్‌ను ఆడటంలో పెద్దగా అనుభవం లేదు. ఇక పరిమిత ఓవర్ల సిరీస్‌ ఆడటానికి ఈ ఏడాది ఆరంభంలో భారత్‌కు వెళ్ళాను. టెస్టుల్లో పరంగా చూస్తే భారత్‌ బౌలింగ్‌ను చాలా తక్కువగానే ఆడాను. టీమిండియా పేస్‌ బౌలింగ్‌ యూనిట్‌లో ఇషాంత్‌ శర్మ కూడా బాగా మెరుగయ్యాడు. ఆసీస్‌ గడ్డపై అతనికి మంచి రికార్డు ఉంది. ఇషాంత్ నుంచి కూడా కంగారూలకు ముప్పు పొంచి ఉంది. రాబోయే సిరీస్‌ల్లో భారత​ నుంచి బాగా గట్టి పోటీ తప్పదు' అని లబూషేన్‌ పేర్కొన్నాడు. ఇప్పటివరకూ 14 టెస్టు మ్యాచ్‌లు ఆడిన లబూషేన్‌ 63పైగా యావరేజ్‌తో 1459 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, ఏడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

వారిలా ఆడాలనుకుంటున్నా:

వారిలా ఆడాలనుకుంటున్నా:

మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాలైన టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఆసీస్‌ సీనియర్‌ ఆటగాడు స్టీవ్ స్మిత్, ఇంగ్లడ్ టెస్టు కెప్టెన్ జో రూట్‌ల మాదిరి అన్ని ఫార్మాట్లలో రాణించేందుకు ప్రయత్నిస్తానని లబూషేన్‌ చెప్పాడు. ' స్టీవ్‌ స్మిత్‌, విరాట్‌ కోహ్లీ, కేన్‌ విలియమ్సన్‌, జో రూట్‌ను స్ఫూర్తిగా తీసుకుంటాను. సుదీర్ఘ కాలంగా వారు ఒకటి కన్నా ఎక్కువ ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్నారు. నేను అలా ఆడాలనుకుంటున్నా' అని చెప్పుకొచ్చాడు.

 కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా:

కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా:

గతేడాది లార్డ్స్‌ మైదానంలో యాషెస్‌ రెండో టెస్టులో మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ గాయపడటంతో మార్నస్‌ లబూషేన్‌ కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా బ్యాటింగ్‌కు వచ్చి.. హాఫ్‌ సెంచరీతో ఆసీస్‌ను ఆదుకున్నాడు. ఆపై పరుగుల వరద పారించాడు. దాంతో స్మిత్‌ జట్టులో ఉన్నప్పటికీ లబూషేన్‌ రెగ్యులర్‌ ఆటగాడు అయిపోయాడు. తనకు ఇచ్చిన వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడంలో సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు. ఆపై పాకిస్తాన్‌తో స్వదేశంలో జరిగిన రెండు టెస్టుల్లో భారీ శతకాలు సాధించి ఆసీస్‌ ఇన్నింగ్స్‌ విజయాలు సాధించడంలో ముఖ్య భూమిక పోషించాడు. ఈ ఏడాది ఆరంభంలోనే డబుల్‌ సెంచరీ బాదేశాడు.

'కరోనా ఆటగాళ్ల ఫాంను దెబ్బతీసింది.. ఇప్పుడు పేసర్లు మరింత జాగ్రత్తగా ఉండాలి'

https://telugu.mykhel.com/cricket/irfan-pathan-feels-fast-bowlers-need-to-be-more-careful-than-others-on-return-029246.html

Story first published: Monday, July 20, 2020, 11:34 [IST]
Other articles published on Jul 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X