న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

500 మ్యాచ్‌ల క్లబ్‌లోకి సచిన్, ద్రవిడ్‌ల తర్వాత ధోనీ..??

Will Dhoni Ranks In That Place after Sachin And Dravid ?
 Major milestone beckons MS Dhoni in England; cricketer set to emulate Sachin Tendulkar, Rahul Dravid

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డుకు దూరంలో ఉన్నాడు. ఇప్పటి వరకు భారత్‌ తరఫున ఈ రికార్డును సచిన్‌ టెండూల్కర్, రాహుల్‌ ద్రవిడ్‌ మాత్రమే అందుకోగలిగారు. ఇప్పుడా రికార్డు అందుకోవడానికి.. ఎంఎస్ ధోనీ సిద్ధంగా ఉన్నాడు. అదేంటంటే.. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ తరఫున అన్ని ఫార్మాట్‌లలో కలిపి 500లు, ఆపైన మ్యాచ్‌లు ఆడటం.

500 క్లబ్బుకి చేరువగా:

500 క్లబ్బుకి చేరువగా:

ఇప్పటివరకూ.. ప్రస్తుతం ధోనీ 497 (వన్డేలు-318, టెస్టులు-90, టీ20లు-89) మ్యాచ్‌లతో ఉన్నాడు. టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ ఐర్లాండ్‌తో రెండు టీ20లు, ఇంగ్లాండ్‌తో 3 టీ20లు, మూడు వన్డేలు ఆడనున్నాడు. ధోనీ ఈ ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆడితే అంతర్జాతీయ క్రికెట్‌లో అతడు ఆడిన మ్యాచ్‌ల సంఖ్య 505కు చేరనుంది. ఐర్లాండ్‌తో బుధవారం, శుక్రవారం రెండు టీ20లు ఆడనున్నాడు. ఆ తర్వాత జులై 3న ఇంగ్లాండ్‌తో టీ20 ఆడనున్నాడు.

3 మ్యాచ్‌లు ఆడితే ధోనీ:

3 మ్యాచ్‌లు ఆడితే ధోనీ:

3 మ్యాచ్‌లు ఆడితే ధోనీ 500 మ్యాచ్‌ల క్లబ్‌లో చేరతాడు. కానీ, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్ ఎవరికీ అందనంత దూరంలో ఉన్నాడు. గరిష్ఠంగా 664 (టెస్టులు 200, వన్డేలు 463, టీ20-1)తో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత రాహుల్‌ ద్రవిడ్‌ 509(టెస్టులు-164, వన్డేలు-344, టీ20-1) మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. త్వరలో ధోనీ భారత్‌ తరఫున 500 మ్యాచ్‌లు ఆడిన మూడో ఆటగాడిగా రికార్డు నెలకొల్పనున్నాడు.

ధోనీ కంటే ధావన్ కంటే 4 మ్యాచ్‌లు వెనుకే

ధోనీ కంటే ధావన్ కంటే 4 మ్యాచ్‌లు వెనుకే

అంతేకాదు ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌ పర్యటనలు ముగిసేలోపు ధోనీ 505 మ్యాచ్‌లాడనున్నాడు. అంటే ద్రవిడ్‌ కంటే కేవలం నాలుగు మ్యాచ్‌లు వెనుక. ఈ ఏడాది సెప్టెంబరులో భారత్‌ ఆసియా కప్‌ ఆడనుంది. ఈ టోర్నీలో ధోనీ ఆడితే ద్రవిడ్‌ రికార్డును బద్దులకొట్టే అవకాశం ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నా.. సచిన్‌దే అగ్రస్థానం

ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నా.. సచిన్‌దే అగ్రస్థానం

అన్ని దేశాల క్రికెటర్లతో పోల్చుకున్నా సచిన్‌దే అగ్రస్థానం. ఆ తర్వాతి స్థానంలో శ్రీలంక ఆటగాడు మహేల జయవర్ధనే(652) ఉన్నాడు. కుమార సంగాక్కర (594) మూడో స్థానంలో ఉండగా మహేంద్ర సింగ్‌ ధోనీ పదో స్థానంలో కొనసాగుతున్నాడు.

Story first published: Wednesday, June 27, 2018, 15:16 [IST]
Other articles published on Jun 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X