న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

1000వ టెస్టు: ఇంగ్లాండ్ ఆల్‌టైమ్ 'బెస్ట్ టెస్ట్' జట్టుని ప్రకటించిన బోర్డు

By Nageshwara Rao
Legends and Current Stars Find Place in Englands Best Ever Test XI on Eve of Their 1000th Test

హైదరాబాద్: టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్ జట్టు మరో మైలురాయిని అధిగమించనుంది. భారత్‌తో బుధవారం నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగనున్న తొలి టెస్టు ఇంగ్లాండ్ జట్టుకు 1000వ టెస్టు. 1877లో టెస్టు హోదా పొందిన ఇంగ్లాండ్ జట్టు తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడింది.

ఇప్పటివరకు 999 మ్యాచ్‌లు పూర్తి చేసింది. ఇందులో 357 టెస్టులు గెలువగా, 297 మ్యాచ్‌ల్లో ఓడింది. 345 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. భారత్‌తో ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగే టెస్టుతో టెస్టు క్రికెట్ చరిత్రలో 1000 టెస్ట్‌లు ఆడిన తొలి జట్టుగా ఇంగ్లండ్ చరిత్ర సృష్టించనుంది.

ఈ సందర్భంగా ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ టెస్టుల్లో ఆల్ టైమ్ బెస్ట్ టీమ్‌ను ఎంపిక చేయమని ఇంగ్లీష్ ఫ్యాన్స్‌ను కోరింది. సుమారు ఆరు వేల మంది ఇంగ్లండ్ ఫ్యాన్స్ తమకు నచ్చిన ఆటగాళ్లను ఆన్‌లైన్ ఓటింగ్ ద్వారా ఎంపిక చేశారు. బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం ఇంగ్లండ్ ఆల్‌టైమ్ బెస్ట్ టెస్ట్ టీమ్‌‌కు ఎంపికైన ఆటగాళ్లు

1
42374

1. అలెస్టర్ కుక్
2. సర్ లియోనార్డ్ హటన్
3. డేవిడ్ గోవర్
4. కెవిన్ పీటర్సన్
5. జో రూట్
6. ఇయాన్ బోథమ్
7. అలన్ నాట్ (వికెట్ కీపర్)
8. గ్రీమ్ స్వాన్
9. ఫ్రెడ్ ట్రూమన్
10. జేమ్స్ ఆండర్సన్
11. బాబ్ విల్లిస్

కాగా, ఇంగ్లాండ్ జట్టు ఆల్ టైమ్ గ్రేట్స్ లియోనార్డ్ హటన్, ఇయాన్ బోథమ్, బాబ్ విల్లిస్‌తో పాటు ప్రస్తుత ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు అయిన అలెస్టర్ కుక్, జో రూట్, జేమ్స్ ఆండర్సన్ సైతం ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. మరోవైపు ఇంగ్లాండ్ జట్టుకు ఆడిన సమయంలో నిత్యం వార్తల్లో నిలిచిన కెవిన్ పీటర్సన్ సైతం ఈ జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం.

ఇదిలా ఉంటే, భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరిగే ఎడ్జ్‌బాస్టన్‌లోనే ఇంగ్లిష్ టీమ్ 50 టెస్టులు ఆడింది. ఇరుజట్ల మధ్య ఆరు టెస్టులు జరిగితే ఇందులో ఇంగ్లండ్ 5-0తో ఆధిక్యంలో కొనసాగుతున్నది. 1902లో ఆసీస్‌తో ఇక్కడ మొదటి టెస్టు జరిగింది. 27 మ్యాచ్‌ల్లో నెగ్గగా, 8 టెస్టులో ఓడి.. 15 మ్యాచ్‌లను డ్రా చేసుకుంది.

తొలి టెస్టు ఆరంభానికి ముందు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో.. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) చైర్మన్ కొలిన్ గ్రేవ్స్‌కు వెండి జ్ఞాపికను అందజేయనున్నారు.

Story first published: Wednesday, August 1, 2018, 13:11 [IST]
Other articles published on Aug 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X