న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఆ లక్ష్యం నెరవేరితే టీ20లకు కూడా ఆనందంగా వీడ్కోలు పలుకుతా'

India Vs Sri Lanka 1st T20i: Lasith Malinga Talks About His Retirement Plans | Oneindia Telugu
Lasith Malinga Says My only target is to play qualify round in the T20 World Cup

గువాహటి: వచ్చే అక్టోబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక నాకౌట్స్‌కు అర్హత సాధించడమే నా లక్ష్యం. ఆ లక్ష్యం తర్వాత ఇక ఎప్పుడైనా నేను రిటైర్ అవుతా అని శ్రీలంక టీ20 కెప్టెన్ లసిత్‌ మలింగ తెలిపాడు. నాలుగు నెలల తర్వాత బరిలోకి దిగుతున్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా తన లయను అందుకోవడానికి కొంత సమయం పడుతుందని, దాన్ని వినియోగించుకుంటాం అని మలింగ పేర్కొన్నాడు.

<strong>'భవిష్యత్తు గురించి పెద్దగా ఆలోచించను.. తర్వాతి మ్యాచ్‌ గురించే ఆలోచిస్తా'</strong>'భవిష్యత్తు గురించి పెద్దగా ఆలోచించను.. తర్వాతి మ్యాచ్‌ గురించే ఆలోచిస్తా'

బుమ్రా రీఎంట్రీ మాకు సానుకూలాంశం

బుమ్రా రీఎంట్రీ మాకు సానుకూలాంశం

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శ్రీలంక-భారత్ జట్ల మధ్య ఈ రోజు రాత్రి 7 గంటలకు తొలి మ్యాచ్‌ జరగనుంది. ఈ సందర్భంగా మలింగ మాట్లాడుతూ... 'బుమ్రాకు మంచి బౌలర్. అతని బౌలింగ్‌లో నైపుణ్యం, కచ్చితత్వం ఉంది. అయితే గాయంతో క్రికెట్‌కు దూరమైన బౌలర్లు పునరాగమనంలో తిరిగి తమ లయను అందిపుచ్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. దాన్ని వినియోగించుకుంటాం. బుమ్రా బౌలింగ్‌ గురించి మా ఆటగాళ్లకు వివరిస్తా. మా బ్యాట్స్‌మెన్‌ కూడా అతడిని ఎంతో తెలివిగా ఎదుర్కోవాలి' అని అన్నాడు.

అదే నా ప్రధాన లక్ష్యం

అదే నా ప్రధాన లక్ష్యం

ఇప్పటికే టెస్టు, వన్డేలకు గుడ్‌బై చెప్పిన మలింగ.. తన టీ20 రిటైర్మెంట్ గురించి కూడా మాట్లాడాడు. 'టెస్టులు, వన్డేలకు ఇప్పటికే వీడ్కోలు పలికా. నా సేవలు జట్టుకు ఇక చాలు అని వారు భావిస్తే.. టీ20లకు కూడా ఆనందంగా వీడ్కోలు పలుకుతా. అక్టోబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక నాకౌట్స్‌కు అర్హత సాధించడమే నా ప్రధాన లక్ష్యం. అర్హత సాధించన తర్వాత ఎప్పుడైనా నేను రిటైర్ అవుతా' అని మలింగ తెలిపాడు.

విజయంతో ఆరంభిస్తాం:

విజయంతో ఆరంభిస్తాం:

'కొత్త సంవత్సరంను విజయంతో ఆరంభించాడనికి ప్రయత్నిస్తాం. టీ20 ఫార్మాట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. విజయాలు తారుమారు అవుతాయి. లంక జట్టులో యవ ఆటగాళ్లకు మంచి ప్రతిభ ఉంది. అయితే అనుభవం మాత్రం అంతగా లేదు. వారికి ఎక్కువ అవకాశాలు ఇస్తాం. ఈ ఫార్మాట్‌లో పరిస్థితులను గెలవడమే కీలకం. బౌలర్లు కూడా మ్యాచ్‌లను గెలవగలరు' అని మలింగ తెలిపాడు. గాయంతో గత ఆగస్టులో జట్టుకు దూరమైన బుమ్రా.. తొలి టీ20 మ్యాచ్‌తో తిరిగి మైదానంలోకి దిగనున్నాడు.

ఆసీస్‌ చేతిలో 0-3తో ఓటమి:

ఆసీస్‌ చేతిలో 0-3తో ఓటమి:

దశాబ్దకాలంగా తమను ప్రతిసారి దెబ్బకొడుతున్న భారత జట్టుపై లంక ఈసారి సమష్టిగా చెలరేగాలనుకుంటోంది. సీనియర్‌, యువ ఆటగాళ్ల కలయికతో ఆ జట్టు సమతూకంతో ఉంది. అయితే టీ20ల్లో లంక ప్రయాణం ఏమంత బాగాలేదు. ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగినా పాక్‌ను వారి సొంతగడ్డపైనే 3-0తో క్లీన్‌స్వీప్ చేయగా.. ఆ వెంటనే ఆసీస్‌ చేతిలో 0-3తో ఓడింది. మరి ఇప్పుడు ఎలా ఆడుతుందో చూడాలి.

Story first published: Sunday, January 5, 2020, 14:04 [IST]
Other articles published on Jan 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X