న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోని, నేను కలిసి PUBG గేమ్ ఆడాం: నవ్వుతూ చెప్పిన చాహల్

Dhoni Bhai And Myself Play PUBG Together Says Yuzvendra Chahal | Oneindia Telugu
Kuldeep Yadav and I always seek MS Dhoni’s advice, says Yuzvendra Chahal

హైదరాబాద్: కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్ ప్రస్తుతం భారత జట్టులో ప్రధాన స్పిన్నర్లుగా కొనసాగుతున్నారు. పిచ్ ఎలాంటిదైనా సర్ తన స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌కు ముప్పుతిప్పులు పెడతారు. ముఖ్యంగా వికెట్ కీపర్‌గా ధోని ఉన్న సమయంలో వీరిద్దరూ మరింతగా విజృంభిస్తారు.

<strong>త్వరలో పెళ్లి పీటలెక్కనున్న సిక్కి రెడ్డి: కవితకు ఆహ్వానం (ఫోటోలు)</strong>త్వరలో పెళ్లి పీటలెక్కనున్న సిక్కి రెడ్డి: కవితకు ఆహ్వానం (ఫోటోలు)

బౌలింగ్ వేస్ సమయంలో ధోని చెప్పిన సలహాలను తూచ తప్పకుండా పాటిస్తూ వికెట్లను తీస్తుంటారు. తాను, కుల్దీప్‌ యాదవ్‌ మైదానంలో ధోనీని తరచూ సలహాలు అడుగుతుంటామని హిందూస్తాన్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్యూలో చైనామన్ స్పిన్నర్ చాహల్‌ చెప్పుకొచ్చాడు. వికెట్ కీపర్‌గా ధోని ఉంటే వికెట్లు తీయడంలో మాపని చాలా సులువు అవుతుందని అన్నాడు.

బౌలింగ్‌లో ఏదైనా సమస్య వచ్చినప్పడు వెంటనే ధోని సాయం తీసుకుంటామని చెప్పుకొచ్చాడు. ''ఏదైనా అనిపిస్తే సీనియర్‌ ఆటగాళ్లు.. కోహ్లీ, ధోని, రోహిత్‌, ధావన్‌లతో మాట్లాడతా. కోహ్లీ లేకుంటే రోహిత్‌‌తో మాట్లాడతా. ఏం చేయాలో, ఏం చేయొద్దో అడుగుతా" అని అన్నాడు. ఈ మధ్య కాలంలో పబ్జీ గేమ్‌కు ఎంత పాపులారిటీ వచ్చిందో తెలిసిందే.

గతేడాది భారత్‌లో వెస్టిండిస్ పర్యటన సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు విమానాశ్రయంలో పజ్జీ గేమ్ ఆడుతోన్న ఫోటోని బీసీసీఐ తన ట్విట్టర్‌లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ధోనితో కలిసి తాను చాలా సార్లు పబ్జీ గేమ్ ఆడినట్లు చాహల్ చెప్పుకొచ్చాడు.

"మహి భాయ్, నేను చాలా సార్లు పబ్జీ గేమ్ ఆడాం(నవ్వుతూ). ఏడు లేదా ఎనిమిది మందితో కలిసి సుమారు రెండు గంటలపాటు పబ్జీ గేమ్ ఆడాం. ఆ తర్వాతే డిన్నర్‌కు వెళ్లాం. మహి భాయ్‌ నాయకత్వంలో ఆడడం గొప్ప విషయం. అతడు నా తొలి కెప్టెన్‌. బౌలింగ్‌లో ఏదైనా సహాయం అవసరమైతే.. నేను, కుల్దీప్‌ అతణ్ని అడుగుతాం" అని చాహల్ అన్నాడు.

Story first published: Wednesday, February 20, 2019, 18:24 [IST]
Other articles published on Feb 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X