న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీని వెక్కిరించిన వాళ్లే.. జేజేలు కొట్టారు

Kohli’s Gritty 149 Keeps India in the Hunt on Day 2 vs England

హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో విరాట్ కోహ్లి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లిష్ ఫ్యాన్స్ వెక్కిరింతల మధ్య క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లి.. మైదానాన్ని వీడేటప్పుడు అదే ఫ్యాన్స్‌తో చప్పట్లు కొట్టించుకున్నాడు. కోహ్లి పట్టుదలకు ఇంగ్లాండ్ అభిమానులు ఫిదా అయిపోయి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు.

బర్మింగ్‌హమ్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమైనా.. కోహ్లి సెంచరీతో ఆదుకున్నాడు. 149 పరుగులు చేసిన విరాట్ ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. 2014లో పది ఇన్నింగ్స్‌ల్లో కలిపి 134 రన్స్ మాత్రమే చేసిన కోహ్లిపై విమర్శలు వెల్లువెత్తాయి. అదే తరహాలో ఆడతాడనుకొని ఇంగ్లీషు బౌలర్లు సైతం కోహ్లీపై వ్యూహరచనలు చేశారు. విరాట్‌ని అదుపుచేస్తే.. జట్టు స్కోరును మొత్తం అదుపులో ఉంచుకోవచ్చని భావించారు. ఊహించిన దానికి పూర్తిగా విరుద్ధంగా జరగడంతో.. ఇంగ్లాండ్ క్రికెటర్లతో పాటు మ్యాచ్ చూసేందుకు వచ్చిన వారంతా కోహ్లీకి ఫిదా అయిపోయారు.

1
42374

కెప్టెన్‌గా కోహ్లికి ఇది 15వ సెంచరీ కాగా.. అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్ల జాబితాలో మూడోస్థానానికి చేరుకున్నాడు. గ్రేమ్ స్మిత్ (25), పాంటింగ్ (19) మాత్రమే కోహ్లి కంటే ముందున్నారు. వేగంగా 22 టెస్టు సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో బ్రాడ్‌మెన్ (58 ఇన్నింగ్స్) అగ్రస్థానంలో ఉన్నాడు. తర్వాతి స్థానంలో గవాస్కర్ (101), స్టీవ్ స్మిత్ (108) ఉండగా.. కోహ్లి (113 ఇన్నింగ్స్) నాలుగో స్థానంలో ఉన్నాడు. సచిన్ 114 ఇన్నింగ్స్‌ల్లో 22 సెంచరీలు సాధించాడు.

విరాట్ కోహ్లి ఇప్పటికే ఆస్ట్రేలియా (5), న్యూజిలాండ్ (1), దక్షిణాఫ్రికా (2), వెస్టిండీస్‌(1), శ్రీలంక (2)ల్లో టెస్ట్ సెంచరీలు నమోదు చేశాడు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, జింబాబ్వే, అప్ఘానిస్థాన్‌లలో మాత్రమే కోహ్లి సెంచరీలు చేయాల్సి ఉంది. బంగ్లాదేశ్‌లో ఒకే టెస్ట్ ఆడిన విరాట్.. పాక్, జింబాబ్వేల్లో ఇంత వరకూ టెస్టులు ఆడలేదు. అప్ఘానిస్థాన్ ఇటీవలే టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఈ దేశాల్లో సెంచరీ చేసే అవకాశం విరాట్‌కు దక్కలేదు.

Story first published: Friday, August 3, 2018, 17:17 [IST]
Other articles published on Aug 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X