న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

10000 పరుగుల క్లబ్‌లో కోహ్లీ: నమోదు చేసిన రికార్డులివే

Kohli 10000: Virat Kohli in numbers

హైదరాబాద్: విశాఖపట్నం వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా పది వేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు.

వన్డేల్లో పది వేల పరుగులు చేసిన ఐదో భారత బ్యాట్స్‌మన్‌గా మొత్తంగా 13వ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున సచిన్ టెండూల్కర్ (18,426), సౌరవ్ గంగూలీ (11,363), రాహుల్ ద్రవిడ్ (10,889), మహేంద్రసింగ్ ధోనీ (10,126) మాత్రమే ఈ రికార్డుని అందుకున్నారు.

<strong>విశాఖలో కోహ్లీ సెంచరీ: వెస్టిండిస్ విజయ లక్ష్యం 322</strong>విశాఖలో కోహ్లీ సెంచరీ: వెస్టిండిస్ విజయ లక్ష్యం 322

ఈ క్రమంలో సచిన్ రికార్డుని కోహ్లీ అధిగమించాడు. వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి సచిన్ 259 ఇన్నింగ్స్‌లు తీసుకోగా కోహ్లీకి 205 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. 9000 పరుగుల నుంచి పది వేల పరుగుల మైలురాయిని కోహ్లీ కేవలం 11 ఇన్నింగ్స్‌ల్లోనే అందుకున్నాడు.

1
44267

అంతేకాదు విశాఖ వన్డేలో కోహ్లీ 37వ సెంచరీని సాధించాడు. 107 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 102 పరుగుతో సెంచరీని సాధించాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 37వ సెంచరీ కావడం విశేషం. ఈ సిరిస్‌లో ఇది రెండోది కావడం గమనార్హం. ఈ క్రమంలో కోహ్లీ ఆసీస్ మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ రికార్డుని అధిగమించాడు.

No 3 స్లాట్‌లో క్రీజులోకి వచ్చి రికీ పాంటింగ్ 29 సెంచరీలు చేయగా... విరాట్ కోహ్లీ ఇదే స్థానంలో క్రీజులోకి వచ్చి 30 సెంచరీలు సాధించాడు. అంతేకాదు ఈ 30 సెంచరీలు చేసేందుకు గాను కోహ్లీకి 153 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా, పాంటింగ్ 330 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు.

ఈ క్రమంలో కోహ్లీ ఖాతాలో పలు రికార్డులు వచ్చి చేరాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం....

1. అత్యంత వేగంగా పదివేల పరుగులను సాధించిన క్రికెటర్

1. అత్యంత వేగంగా పదివేల పరుగులను సాధించిన క్రికెటర్

ఇన్నింగ్స్‌లు: 205

సచిన్ టెండూల్కర్ 259

అరంగేట్రం చేసినప్పటి నుంచి: 3270

రాహుల్ ద్రవిడ్: 3969

తీసుకున్న బంతులు: 10813

సనత్ జయసూర్య: 11296

అత్యధిక యావరేజి: 59.17

ధోని: 51.30

2. పదివేల పరుగులు చేసిన క్రికెటర్లు వీరే

2. పదివేల పరుగులు చేసిన క్రికెటర్లు వీరే

* విరాట్‌ కోహ్లీ (213 వన్డేలు- భారత్‌)

* సచిన్‌ తెందుల్కర్‌ (266- భారత్‌)

* సౌరవ్‌ గంగూలీ (272- భారత్‌)

* రికీ పాంటింగ్‌ (272- ఆస్ట్రేలియా)

* జాక్వెస్‌ కలిస్‌ (286- దక్షిణాఫ్రికా)

* ఎంఎస్‌ ధోనీ (320- భారత్‌)

* బ్రియన్‌ లారా (287- వెస్టిండీస్‌)

* రాహుల్‌ ద్రవిడ్‌ (309- భారత్‌)

 3. సొంతగడ్డపై అత్యంత వేగంగా 4000 పరుగులు చేసిన క్రికెటర్

3. సొంతగడ్డపై అత్యంత వేగంగా 4000 పరుగులు చేసిన క్రికెటర్

విరాట్ కోహ్లీ - 78 ఇన్నింగ్స్‌లు

సచిన్ టెండూల్కర్ - 92

మహేంద్ర సింగ్ ధోని - 99

4. వెస్టిండిస్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్

4. వెస్టిండిస్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్

విరాట్ కోహ్లీ: 29 ఇన్నింగ్స్‌ల్లో 1574*

సచిన్ టెండూల్కర్: 39 ఇన్నింగ్స్‌ల్లో 1573

రాహుల్ ద్రవిడ్: 1348 పరుగులు

సౌరవ్ గంగూలీ: 1142 పరుగులు

5. విశాఖ స్టేడియంలో గతంలో కోహ్లీ చేసిన పరుగులు

5. విశాఖ స్టేడియంలో గతంలో కోహ్లీ చేసిన పరుగులు

118 v Aus 2010

117 v WI 2011

99 v WI 2013

65 v NZ 2016

157* v WI 2018

Story first published: Wednesday, October 24, 2018, 18:38 [IST]
Other articles published on Oct 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X