న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20ల్లో టీమిండియా ఫాస్టెస్ట్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్..తుడుచుకుపెట్టుకుపోయిన కోహ్లీ రికార్డ్

Kl rahul achieved fastest batsmen of teamindia to achieve 6000 runs in t20 cricket

టీమిండియా స్టార్ క్రికెటర్, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 6,000 పరుగులు చేసిన తొలి టీమిండియా క్రికెటర్‌గా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. కోహ్లీ రికార్డును తుడిచిపెట్టిన రాహుల్ టీ20ల్లో 6,000 పరుగులు పూర్తి చేసిన ఫాస్టెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. మంగళవారం ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లో ఈ ఘనతను రాహుల్ అందుకున్నాడు. కోహ్లీ 184 ఇన్నింగ్స్‌‌ల్లో 6,000పరుగులు సాధించగా.. రాహుల్ 166ఇన్నింగ్స్‌లలోనే 138.18 స్ట్రైక్ రేట్‌తో ఈ మైలురాయిని చేరుకున్నాడు.

క్రికెట్ చరిత్రలో టీ20ల్లో ఇన్నింగ్స్‌ల పరంగా వేగవంతంగా 6,000 పరుగులు చేరుకున్న బ్యాటర్లలో యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ అందరి కన్నా ముందున్నాడు. అతను కేవలం 162 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ అందుకున్నాడు. తర్వాత 2వ స్థానంలో పాకిస్థాన్ ప్రస్తుత కెప్టెన్ బాబర్ ఆజామ్ ఉన్నాడు. అతను 165 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. 3వ స్థానంలో కేఎల్ రాహుల్ ఉన్నాడు. 4వ స్థానంలో ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ షాన్ మార్ష్.. 180ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డు సాధించగా.. 184ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డ్ సాధించిన కోహ్లీ 5వ స్థానంలో ఉన్నాడు. కోహ్లీ కంటే 18తక్కువ ఇన్నింగ్స్‌లలోనే రాహుల్ ఈ ఫీట్ సాధించాడు.

Kl rahul achieved fastest batsmen of teamindia to achieve 6000 runs in t20 cricket

టీమిండియా పరంగా చూస్తే టీ20ల్లో వేగవంతంగా 6,000 పరుగులు సాధించిన వారిలో తొలిస్థానంలో కేఎల్ రాహుల్ (166 ఇన్నింగ్స్‌లు), రెండో స్థానంలో విరాట్ కోహ్లీ (184 ఇన్నింగ్స్‌లు), మూడో స్థానంలో శిఖర్ ధావన్ (214 ఇన్నింగ్స్‌లు), నాలుగో స్థానంలో సురేష్ రైనా (217ఇన్నింగ్స్‌లు), అయిదో స్థానంలో రోహిత్ శర్మ (228 ఇన్నింగ్స్‌లు)తో టాప్-5లో ఉన్నారు. ఎల్‌ఎస్‌జి కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇప్పుడు ఆల్ టైమ్ టీ20 ఫాస్టెస్ట్ 6,000 రన్స్ లిస్టులో క్రిస్ గేల్ (162ఇన్నింగ్స్‌లు), బాబర్ ఆజం (165)తర్వాత ఉన్నాడు. రాహుల్ ఇదే ఫాం కొనసాగిస్తే 7,000పరుగుల మైలురాయి విషయంలో ఆల్ టైమ్ ఫాస్టెస్ట్ బ్యాటర్‌గా నిలిచే అవకాశం ఉంది.

ఇక నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ 24బంతుల్లో 30పరుగులు చేయడంతో 6,000పరుగులకు చేరుకున్నాడు. మంగళవారం నాటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో 18పరుగుల తేడాతో లక్నో ఓడిపోయింది. ఇక లక్నో ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో తమ తర్వాతి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.

Story first published: Wednesday, April 20, 2022, 14:36 [IST]
Other articles published on Apr 20, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X