న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కేదర్ జాదవ్ బౌలింగ్‌లో ధోనీ చేసిన స్టంపౌట్ (వీడియో)

Kedar Jadhav’s beauty and MS Dhoni’s clinical work trumps Shadab Khan

న్యూ ఢిల్లీ: ఆసియా కప్‌లో భాగంగా జరిగిన భారత్Xపాక్ మ్యాచ్‌లో టీమిండియా ఎనిమిది వికెట్ల ఆధిక్యంతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి తన టెక్నిక్‌ను ఉపయోగించి షాదబ్ ఖాన్ వికెట్ పడగొట్టాడు. 33వ ఓవర్‌లో షాదబ్ మాలిక్ బ్యాటింగ్ చేస్తున్నాడు. కేదర్ జాదవ్ బౌలింగ్‌ వేస్తుండగా షాదబ్‌ను మహేంద్ర సింగ్ స్టంప్ ఔట్ చేశాడు. ధోనీ తనదైన శైలిలో చేసిన ఔట్‌ను చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

పాక్ బ్యాట్స్‌మెన్ ఫెయిల్ అవడంతో భారత్‌తో జరిగిన పోరాటంలో ఓటమి తప్పలేదు. పాక్ జట్టు సర్ఫరాజ్ అహ్మద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బాబర్ అజాం, షోయబ్ అక్తర్లు భారీ భాగస్వామ్యం నెలకొల్పే ఉద్దేశ్యంలో విఫలమై.. పాక్ జట్టు ఆలౌట్‌కు గురి కాగా 44 ఓవర్లకు 162 పరుగులు చేయగలిగింది. టార్గెట్‌ను చేధించేందుకు టీమిండియా ఎంతో కష్టపడాల్సిన అవసరం లేకుండా పోయింది.

29 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టంతో విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ప్రత్యర్థిని భారత్‌ 43.1 ఓవర్లకు కేవలం 162 పరుగులకే కుప్పకూల్చింది. బౌలర్లు కేదార్‌ జాదవ్‌ (3/23), భువనేశ్వర్‌ కుమార్‌ (3/15), జస్ర్పీత్‌ బుమ్రా (2/23) పాక్‌ నడ్డి విరిచారు.

గ్రూప్ ఏ నుంచి ఇండియా.. పాకిస్తాన్ మరోసారి సూపర్ ఫోర్ విభాగంలో తలపడనుంది. సెప్టెంబర్ 23 బుధవారం జరగనున్న మ్యాచ్‌లో భారత్Xపాక్ మ్యాచ్ ఇంకోసారి ఆడనుండటంతో మ్యాచ్ ను చూసేందుకు తీవ్రమైన స్థాయిలో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు క్రికెట్ అభిమానులు.

Story first published: Thursday, September 20, 2018, 12:00 [IST]
Other articles published on Sep 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X