న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కార్తీక్ ఓ ఆప్షన్,. ఇప్పటికీ ధోనీయే నా ఫస్ట్ ఛాయిస్'

By Nageshwara Rao
Dhoni & Dinesh Karthik Are Both In One Race During Selection
Karthik an option, but Dhoni still first choice: Sandeep Patil

హైదరాబాద్: వికెట్ కీపర్‌గా దినేశ్ కార్తీక్ మంచి ప్రత్యామ్నాయమే అయినప్పటికీ, ధోనినే తన తొలి ప్రాధాన్య వికెట్‌కీపర్ అని టీమిండియా మాజీ సెలక్టర్ సందీప్ పాటిల్ వెల్లడించాడు. 2004లో జింబాబ్వే పర్యటన సందర్భంగా వీరిద్దరిలో ఒక్కరినే ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు తాను కార్తీక్‌వైపే మొగ్గుచూపానని చెప్పాడు.

అప్పుడు జింబాబ్వే పర్యటనకు వెళ్లిన భారత్‌-ఏ జట్టుకు కోచ్‌‌గా సందీప్ పాటిల్ ఉన్నాడు. ఆ సమయంలో ఛీఫ్ సెలక్టర్‌ సయ్యద్‌ కిర్మాణి ఫోన్ చేసి గాయపడ్డ పార్థివ్‌ పటేల్‌ స్థానంలో ఛాంపియన్స్‌ ట్రోఫీకి ధోని లేదా కార్తీక్‌ పేరును సూచించాలని అడిగాడు. అప్పుడు ఏ జట్టులో ధోని ప్రాధాన్య వికెట్‌కీపర్‌ కాదు. తుది పదకొండు మందిలో కూడా లేడని చెప్పాడు.

 కార్తీక్‌ను నేను హోటల్‌ గదికి పిలిచా

కార్తీక్‌ను నేను హోటల్‌ గదికి పిలిచా

'ఆ సాయంత్రం హరారేలో దినేశ్‌ కార్తీక్‌ను నేను హోటల్‌ గదికి పిలిచా. సెలక్టర్ల నుంచి నాకు ఫోన్‌ వచ్చిందని, నీ పేరును సూచించానని చెప్పాను. ఆ తర్వాత ధోనీని కూడా పిలిచా. తన పేరును కాకుండా కార్తీక్‌ పేరును ఎందుకు సూచించాల్సి వచ్చిందో వివరించా. ఏదో ఒక రోజు నీకు కూడా అవకాశమొస్తుందని అన్నాను' అని పాటిల్ తెలిపాడు.

 జింబాబ్వే పర్యటనలో కార్తీక్ సెంచరీ బాదాడు

జింబాబ్వే పర్యటనలో కార్తీక్ సెంచరీ బాదాడు

'కార్తీక్‌ సెంచరీ బాదాడు. వికెట్‌ కీపింగ్‌ కూడా చేస్తున్నాడు. అదే సమయంలో ధోని మ్యాచ్‌లు ఆడటం లేదు. ఆ తర్వాత మేం కెన్యా వెళ్లాం. అక్కడ అతడు చెలరేగిపోయాడు' అని పాటిల్ తెలిపాడు. అప్పుడు అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన కార్తీక్‌ స్థానంలో సరిగ్గా ఏడాది తర్వాత ధోని భారత జట్టులోకి వచ్చాడు.

వ్యక్తిగత సమస్యలు అతడిని ఇబ్బంది పెట్టాయి

వ్యక్తిగత సమస్యలు అతడిని ఇబ్బంది పెట్టాయి

'అప్పుడు కార్తీక్‌ భిన్నమైన ఆటగాడు. భారత జట్టులో చోటు దొరకగానే, స్ట్రెయిట్‌గా ఆడాలని చాలా మంది ఆటగాళ్లు భావిస్తుంటారు. తమ శైలి మరిచిపోతారు. కార్తీక్‌ విషయంలోనూ అదే జరిగింది. కార్తీక్‌ తనదైన ఆటను తగ్గించుకున్నాడు. ఆ తర్వాత వ్యక్తిగత సమస్యలు కూడా అతణ్ని ఇబ్బందిపెట్టాయి' అని సందీప్‌ పాటిల్‌ అన్నాడు.

 జింబాబ్వే పర్యటనలో సెంచరీ నమోదు

జింబాబ్వే పర్యటనలో సెంచరీ నమోదు

'షాట్‌ ఆడితే ఔటైపోతామేమో అని యువ ఆటగాళ్లు భయపడుతుంటారు. రంజీ ట్రోఫీ, భారత్‌ ఏ జట్టుకు ఆడేటప్పుడు కార్తీక్‌లో ఆ భయం లేదు. అందుకే జింబాబ్వే పర్యటనలో సెంచరీని నమోదు చేశాడు. నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాడు. లక్కీగా ధోని కూడా అదే జింబాబ్వే పర్యటనలో ఉన్నాడు' అని పేర్కొన్నాడు.

Story first published: Thursday, March 22, 2018, 16:26 [IST]
Other articles published on Mar 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X