న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రూ.35వేలు: ధోని, చాహల్‌కు ఇచ్చిన ప్రైజ్ మనీపై గవాస్కర్ మండిపాటు

India vs Australia : Indian Team Must Be Given With Monetary | Oneindia Telugu
 Just USD 500 for Yuzvendra Chahal, MS Dhoni? Sunil Gavaskar slams Cricket Australia for ‘miser’ approach

హైదరాబాద్: క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ మండిపడ్డారు. తొలిసారి ఆసీస్ గడ్డపై ద్వైపాక్షిక సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియాకు నగదు బహుమతి ఇవ్వకుండా ట్రోఫీ మాత్రమే ప్రదానం చేస్తారా? అంటూ క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వాహకులపై భారత మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధోని ఖాతాలో అరుదైన ఘనత: సచిన్, రోహిత్, కోహ్లీ సరసన ధోని ఖాతాలో అరుదైన ఘనత: సచిన్, రోహిత్, కోహ్లీ సరసన

శుక్రవారం మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్‌ 7 వికెట్ల తేడాతో గెలిచి మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో నెగ్గిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన లెగ్‌ స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ వరించగా.. సిరీస్‌ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన ధోనికి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు దక్కింది.

1
43629
ధోని, చాహల్‌లకు క్యాష్ ప్రైజ్‌

ధోని, చాహల్‌లకు క్యాష్ ప్రైజ్‌

మ్యాచ్‌ అనంతరం నిర్వాహకులు ధోని, చాహల్‌లకు క్రికెట్ ఆస్ట్రేలియా ఈ ట్రోఫీలతో పాటు రూ.35వేలు (500 అమెరికా డాలర్లు) చొప్పున చెక్కులను క్యాష్ ప్రైజ్‌గా అందజేసింది. ఈ చెక్కుల విషయమే సునీల్‌ గవాస్కర్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. స్పాన్సర్లు, ప్రసార హక్కుల ద్వారా భారీ మొత్తం ఆర్జిస్తోన్న క్రికెట్ ఆస్ట్రేలియా తక్కువ మొత్తాన్ని అందజేయడాన్ని గవాస్కర్ మండిపడ్డారు.

వాటాను పంచాల్సిన అవసరం ఉంది

వాటాను పంచాల్సిన అవసరం ఉంది

ఆటగాళ్ల ద్వారా లాభాలు పొందుతున్న నిర్వాహకులు దానిలో వాటాను పంచాల్సిన అవసరం ఉందని సన్నీ అభిప్రాయపడ్డాడు. ప్రసార హక్కుల ద్వారా భారీ మొత్తాన్ని ఆర్జిస్తోన్న నిర్వాహకులు ఆటగాళ్లకు సముచితమైన ప్రైజ్ మనీ ఎందుకు ఇవ్వరని గవాస్కర్ నిలదీశారు. స్పాన్సర్లు రావడానికి ప్రధాన కారణం ఆటగాళ్లేనని గవాస్కర్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు.

 500 డాలర్లు ఇవ్వడం ఏమిటీ

500 డాలర్లు ఇవ్వడం ఏమిటీ

"ఆటగాళ్లకు 500 డాలర్లు ఇవ్వడం ఏమిటీ? పైగా జట్టుకు కేవలం ట్రోఫీ మాత్రమే అందించారు. ప్రసార హక్కుల ద్వారా భారీగా ఆర్జించిన నిర్వాహకులు ఆటగాళ్లకు మంచి నగదు బహుమతి ఎందుకు ఇవ్వట్లేదు? ఆట ద్వారా ఆదాయం రావడంలో ఆటగాళ్లే కీలకం కదా. అలాంటప్పుడు వాళ్లకు తగిన విధంగా నగదు అందించాలి" అని గవాస్కర్ అన్నాడు.

వింబుల్డన్ విజేతలకు ఇస్తోన్న ప్రైజ్ మనీ చూడండి

వింబుల్డన్ విజేతలకు ఇస్తోన్న ప్రైజ్ మనీ చూడండి

"వింబుల్డన్ విజేతలకు ఇస్తోన్న ప్రైజ్ మనీ చూడండి. నిజంగా అద్భుతం. సంపద సృష్టిలో ఆటగాళ్లలే ముఖ్యం. వారికి సముచితంగా రివార్డ్ అందజేయాలి. వింబుల్డన్‌లో తొలి రౌండ్లో ఓడిన కూడా ఆటగాడికి రూ.36 లక్షలు అందుతాయి. సింగిల్స్‌ విజేతగా నిలిచిన ప్లేయర్లకు దాదాపు రూ.21 కోట్లు ఖాతాలో చేరతాయి. టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనను దిగ్విజయంగా ముగించిన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, January 19, 2019, 11:34 [IST]
Other articles published on Jan 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X