న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మహిళా క్రికెట్‌కు షాక్: జులన్ గోస్వామి రాజీనామా

Jhulan Goswami Retires From T20 Internationals
Jhulan Goswami has retired from T20Is.

న్యూ ఢిల్లీ: భారత వెటరన్ పేసర్ జులన్ గోస్వామి ఇక నుంచి ఐసీసీ వరల్డ్ టీ20(షార్ట్ ఫార్మాట్) నుంచి తప్పుకోనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. భారత్ తరపున గోస్వామి 68 టీ20ల్లో ఆడి 56 వికెట్లు పడగొట్టింది. 2012వ సంవత్సరంలో ఆస్ట్రేలియాతో ఆడి ఒకే మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టడమనేది ఆమె కెరీర్‌లోనే కీలకమైన విషయం.

ఈ సందర్భంగా టీమిండియా మహిళా జట్టు ఆమె నిర్ణయాన్ని స్వగతించారు. మిగిలిన ఫార్మాట్లలో తనతో పాటు ఆడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు క్రికెట్ టీ20 కెరీర్లో తనకు సహకరించన వాళ్లకు గోస్వామి కృతజ్ఞతలు తెలిపారు. జట్టులో ఆమె స్థానాన్ని శిఖా పాండే భర్తీ చేయనున్నారు. ఆవిడతో పాటుగా పూజా వస్త్రాకర్, మన్సి జోషి బాధ్యతలు తీసుకోనున్నారు. గోస్వామి.. మిథాలీ రాజ్ వంటి సీనియర్ క్రికెటర్లతో పాటుగా 2002వ సంవత్సరంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగ్రేటం చేశారు.

పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో గోస్వామి ప్రయాణం మొదలైంది. ఆమె చిన్నతనం నుంచే మగపిల్లలతో ఆడి ఆమెలోని పేస్‌ను మెరుగుపరుచుకుంది. కోల్‌కతాలోని వివేకానంద పార్క్‌లో ఆమె శిక్షణాకాలం మెరుగుపరచుకుంది.

గోస్వామి తన కెరీర్‌లో 10 టెస్టులు, 169 వన్డేలు ఆడారు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో ఎక్కువ వికెట్లు పడగొడుతున్న పేసర్ ఉందంటే అది గోస్వామినే. ఆమెకు వన్డేల్లో 200వికెట్లు తీసిన మహిళా క్రికెటర్‌గా కూడా పేరుంది.


2007లో ఐసీసీ వుమెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును అందుకుంది.


2008-2011 మధ్య టీమిండియాకు సారథ్య బాధ్యతలు నిర్వర్తించింది.


2010లో అర్జున అవార్డుతో పాటు 2012లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది.


Story first published: Thursday, August 23, 2018, 17:05 [IST]
Other articles published on Aug 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X