న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా ఎదుగుతాడు'

Jasprit Bumrah a workhorse, he will soon be worlds best bowler: Michael Clarke

హైదరాబాద్: రాబోయే రోజుల్లో టీమిండియా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా ఎదుగుతాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ప్రశంసించాడు. మూడు ఫార్మాట్లలో బుమ్రా నంబర్‌వన్ స్థానానికి చేరుకుంటాడని క్లార్క్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

ప్రేమించొచ్చు, ద్వేషించొచ్చు, కానీ ఆయన్ను మాత్రం విస్మరించలేం: శ్రీనిపై ధోనిప్రేమించొచ్చు, ద్వేషించొచ్చు, కానీ ఆయన్ను మాత్రం విస్మరించలేం: శ్రీనిపై ధోని

మెల్‌బోర్న్ వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆరు, రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో బుమ్రాదే కీలకపాత్ర. మూడో టెస్ట్‌లో బుమ్రా ప్రదర్శన చూసిన తర్వాత క్లార్క్ ప్రశంసల వర్షం కురిపించాడు.

భవిష్యత్‌లో గొప్ప బౌలర్‌ అవుతాడు

భవిష్యత్‌లో గొప్ప బౌలర్‌ అవుతాడు

"కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రణాళికలకు తగ్గట్టుగా ఆడే బౌలర్ బుమ్రా. భవిష్యత్‌లో గొప్ప బౌలర్‌గా మారడానికి మరెంతో కాలం పట్టదు. అతనిపై ఒత్తిడి, అంచనాలు పని చేయవు. ఏదైనా నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు" అని మైకేల్ క్లార్క్ పేర్కొన్నాడు.

399 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్

ఆటలో నాలుగో రోజైన శనివారం 399 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 258/8తో ఓటమి అంచున ఉంది. ఆ జట్టు విజయానికి ఇంకా 141 పరుగులు చేయాల్సి ఉండగా.. చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉండటంతో ఆదివారం భారత్ గెలుపు లాంఛనంగానే కనిపిస్తోంది.

106/8 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన భారత్

ఆటలో భాగంగా నాలుగో రోజైన శనివారం ఓవర్ నైట్ స్కోరు 54/5తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన టీమిండియా 106/8 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 292 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని మొత్తం 399 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు ముందు ఉంచింది.

 బుమ్రా మాట్లాడుతూ

బుమ్రా మాట్లాడుతూ

బుమ్రా మాట్లాడుతూ "నేను బౌలింగ్ చేస్తున్నప్పుడు పిచ్ చాలా మందకొడిగా తయారయ్యింది. బంతి కూడా సున్నితంగా మారింది. అందుకే స్లో బంతులు వేసేందుకు ప్రయత్నించా. ఫుల్లర్ కూడా స్లోగానే వేశా. అప్పటికే బంతి రివర్స్ స్వింగ్‌కు అనుకూలిస్తున్నది. భారత్‌లో రంజీల్లో ఎక్కువగా ఇలాగే వేసేవాడ్ని. ఆ అనుభవం ఇక్కడ పని చేసింది. ఈ ఏడాది సూపర్‌ఫామ్‌లో ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించలేదు" అని అన్నాడు.

పరిస్థితులకు తగ్గట్టుగా బౌలింగ్ చేశా

పరిస్థితులకు తగ్గట్టుగా బౌలింగ్ చేశా

"నాపై నాకే నమ్మకం లేకుంటే ఇంకెవ్వరు మద్దతిస్తారు. అందుకే పరిస్థితులకు తగ్గట్టుగా బౌలింగ్ చేశా. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవంతో ఆరంభం బాగా ఉండేలా చూసుకున్నా. ఆసీస్‌కు ఫాలో ఆన్ ఇవ్వకపోవడంలో ఎలాంటి వ్యూహాలు లేవు. కేవలం సానుకూలమైన క్రికెట్ ఆడాలనే ఉద్దేశంతో మేం బ్యాటింగ్‌కు దిగాం. కొన్ని వికెట్లు కోల్పోయినా మరిన్ని పరుగులు జోడిస్తామనే నమ్మకం ఉంది. నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం ఆసీస్‌కు చాలా కష్టం" అని బుమ్రా అన్నాడు.

1
43625
Story first published: Saturday, December 29, 2018, 16:58 [IST]
Other articles published on Dec 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X