న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందువల్లే మేం ఓడిపోయాం.. ఒకవేళ వర్షం పడకపోయినా మేమే గెలిచేవాళ్లం : బుమ్రా క్లారిటీ

Jasprit Bumrah: While Batting In Second Innings We Are not Up To the Mark, That Leads To losing side

పటౌడీ ట్రోఫీలోని రీషెడ్యూల్ చేసిన అయిదో టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 378 పరుగుల భారీ లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకోలేక ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. 378పరుగులను ఇంగ్లాండ్ అలవోకగా ఛేదించింది. అయిదో ఓవర్ నైట్ స్కోరు 259పరుగులతో ప్రారంభించిన ఇంగ్లాండ్.. మిగతా 119పరుగులను ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఫలితంగా 76.4ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఇంగ్లాండ్ 378పరుగుల టార్గెట్ ఛేదించి 7వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా ఈ సిరీస్ 2-2తో సమమైంది. ఇక ఈ మ్యాచ్ ప్రజెంటేషన్ సందర్భంగా కామెంటేటర్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చిన బుమ్రా తాము ఓడిపోవడానికి గల కారణాలు కొన్ని పేర్కొన్నాడు. ఇకపోతే ఈ సిరీస్లో బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు.

ఆల్రౌండర్ విషయం వదిలేయండి

ఆల్రౌండర్ విషయం వదిలేయండి

మ్యాచ్ అనంతరం హోస్ట్ బుమ్రాను మీరు ఆల్రౌండర్‌గా అవుతారా అని అడగ్గా.. నేను ఆ విషయంలో ఇంకా ముందుకు వెళ్లను అని పేర్కొన్నాడు. ఇక ఓటమి అనంతరం బుమ్రా స్పందిస్తూ.. 'ఈ టెస్ట్ మ్యాచులో తొలి మూడు రోజులు మా వైపు మ్యాచ్ ఉంది. కానీ నిన్న నాలుగో రోజు మేం బ్యాటింగ్లో ఫెయిల్ అయ్యాం. చాలా తక్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యాం. అదే మ్యాచ్ మా నుంచి చేజారడానికి కారణమైంది. ప్రత్యర్థికి అవకాశమిచ్చినట్లయింది. ఏ మ్యాచ్ ఓడిపోయిన అలా జరిగి ఉంటే బాగుండేది.. ఇలా జరిగి ఉంటే బాగుండు అనే మాటలు ఉంటూనే ఉంటాయి. కానీ మేం వాటిని పక్కనపెడుతున్నాం.' అని బుమ్రా చెప్పాడు.

 వాన పడకపోతే సీన్ వేరేలా ఉండేది

వాన పడకపోతే సీన్ వేరేలా ఉండేది

'రెండో రోజు వర్షం పడకపోతే సీన్ వేరేలా ఉండేది. అప్పుడు మేం బౌలింగ్లో బాగా రాణిస్తున్నాం. కానీ వాన తరచు అంతరాయాన్ని కలిగించి.. మా ఫ్లోను డిస్ట్రబ్ చేసింది. మేం వారిని 200లోపే ఆలౌట్ చేసేవాళ్లం. తద్వారా సిరీస్‌ గెలవడానికి మాకు వాన అడ్డంకిగా మారింది. అయినా నేను ఒప్పుకుంటాను. ఇంగ్లాండ్ చాలా బాగా ఆడింది. మేము సిరీస్‌ను డ్రా చేసుకున్నాం. ఈ సిరీస్లో రెండు జట్లు చాలా మంచి క్రికెట్ ఆడాయి. ఇది సరైన ఫలితం.' అని బుమ్రా పేర్కొన్నాడు.

అది నేను నిర్ణయించలేను

అది నేను నిర్ణయించలేను

'ఇక మా బ్యాటర్లలో పంత్ తన అవకాశాలను చేజిక్కించుకున్నాడు. అతను, జడ్డూ తమ ఎదురుదాడితో మమ్మల్ని మళ్లీ ఆటలోకి తీసుకువచ్చారు. ఆ టైంలో ఆటలో మేమే ముందున్నాం. ఇక కోచ్ ద్రావిడ్ సార్ ఎల్లప్పుడూ మాకు మార్గనిర్దేశం చేయడానికి, మద్దతు ఇవ్వడానికి ముందుంటారు. మేము మా బౌలింగ్ లైన్లలో కొంచెం వేరియబుల్ బౌన్స్‌ని ఉపయోగించుకోవాల్సింది. ఇక కెప్టెన్సీ విషయానికొస్తే.. అది నేను నిర్ణయించేది కాదు. నాకు బాధ్యత అంటే ఇష్టం. కెప్టెన్సీ బాధ్యత నాకు మంచి సవాలు. పైగా కొత్తది కూడా. ఏదేమైనా జట్టుకు నాయకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నాను. ఇది నిజంగా గొప్ప అనుభవం.' అని బుమ్రా తెలిపాడు.

Story first published: Tuesday, July 5, 2022, 21:10 [IST]
Other articles published on Jul 5, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X